ScienceAndTech

అమరావతి లేని దేశ చిత్రపటం

Indian Central Government Removes Andhra Capital Amaravati From Map

కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసిన భారతదేశ నూతన చిత్ర పటంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి చోటు దక్కలేదు. జమ్మూ కశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయిన నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాల సరిహద్దులతో కేంద్ర హోంశాఖ శనివారం నూతన భారత రాజకీయ చిత్రపటాలను విడుదల చేసింది. ఇందులో జమ్మూ కశ్మీర్‌, లద్ధాఖ్‌లతోపాటు, దేశంలోని మిగతా కేంద్ర పాలిత ప్రాంతాలు, దేశంలోని రాష్ట్రాలు, రైలు, రోడ్డు మార్గాలు, కాల్వలు వంటివి సూచిస్తూ 4 వేర్వేరు మ్యాపులను విడుదల చేసింది. ఇందులో దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిని సూచిస్తూ వాటి పేర్లను ఎర్ర అక్షరాల్లో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని గురించి ఎక్కడా చెప్పలేదు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు హైదరాబాద్‌ ఉండటం వల్ల ప్రభుత్వం దీనిని గుర్తించలేదా? లేక మరో కారణమేదైనా ఉందా? అనే విషయంలో స్పష్టత లేదు.