Agriculture

శీతాకాలం పెరటి పూల వ్యవసాయం

శీతాకాలం పెరటి పూల వ్యవసాయంTelugu Winter Agriculture News. Winter Flower Gardening Tips In Telugu.

శీతాకాలం సూర్యుడు తక్కువ సమయం ఉంటూ, ఎండ కూడా స్వల్పంగా ఉంటుంది. క్రమంగా చల్లని ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటూ, క్లిష్టమైన వాతావరణం నెలకొంటుంది. దీని మూలంగా జీవన విధానాలలో కూడా స్తబ్ధత మొదలవుతుంది. అంతేకాకుండా, శీతాకాలంలో అనేకరకాల పుష్ప జాతుల మొక్కలు ఆకులను వదిలివేసి, నిద్రావస్థకు చేరుకుంటూ ఉంటాయి. క్రమంగా వాటికి పూలు పూయడం కూడా కష్టతరంగా ఉంటుంది. కానీ, ఈ సంవత్సరంలో ఇటువంటి చల్లటి నెలల్లో కూడా వృద్ధి చెందుతున్న కొన్ని పుష్ప జాతులు ఉన్నాయి. కాలానుగుణంగా పుష్పించే మొక్కలు రంగు మరియు పరిమాణంలో మారుతూ ఉంటాయి. అవి మీ తోటలో కూడా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. మీకు మొక్కల పట్ల మక్కువ ఎక్కువగా ఉన్న పక్షంలో, ఈ శీతాకాలంలో కూడా మీరు పూలు పొందగలిగే కొన్ని పుష్ప జాతుల మొక్కల జాబితాను ఇక్కడ చూడండి. కాలెంన్డ్యులా.. కాలెంన్డ్యులా, సాధారణంగా దీనిని ‘పాట్ మారీ గోల్డ్’ అని వ్యవహరించడం జరుగుతుంది. . కుండలు మరియు ప్లాంటర్స్ లో బాగా పెరుగుతాయి. ఇవి అత్యంత సాధారణమైన శీతాకాలపు పువ్వులుగా ఉంటాయి. వీటిని జాగ్రత్తగా నిర్వహించడం కూడా సులభం. పసుపు నుండి లోతైన నారింజ వరకు వివిధ రంగులలో ఈ పూలు పూస్తుంటాయి.
* వింటర్ జాస్మిన్..
ఈ శీతాకాలంలో మీ తోటకి అందాన్నివ్వడానికి ‘వింటర్ జాస్మిన్’ రకం మొక్క ఒక అద్భుతమైన ఎంపికగా చెప్పబడుతుంది. వీటి నిర్వహణా వ్యయం, మరియు శ్రమ కూడా తక్కువగా ఉంటుంది. ఇది ప్రకాశవంతమైన పసుపు రంగు పువ్వులను ఉత్పత్తి చేస్తుంది. మరియు అవి జనవరి ప్రారంభంలోనే వికసిస్తుంటాయి. పాన్సీ.. మరో సాధారణ శీతాకాలపు పువ్వుగా పాన్సీ ఉంటుంది. ఇది దాదాపు అన్ని రంగుల షేడ్స్ లో లభిస్తుంది. విభిన్న రంగుల కలయికను ఉపయోగించి మీరు మీ తోటలో వాటిని పెంచుకోవచ్చు. పాన్సీలు తక్కువగా పెరిగే మొక్కలు కావున ఇవి నీడలో బాగా వృద్ధి చెందుతాయి.
* పెటునియా..
మీ శీతాకాలపు తోటను ప్రకాశవంతం చేయడానికి పెటునియాస్ కూడా మంచి ఎంపికగా సూచించబడుతుంది. ఈ శీతాకాలంలో ‘గ్రాండి ఫ్లోరా’ రకం పెటునియాని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. అవి పెద్ద పరిమాణంలో పువ్వులను కలిగి ఉంటాయి. శరదృతువు మరియు శీతాకాలంలో నాటడానికి అనువైన మొక్కలుగా సూచించబడుతాయి. పెటునియాస్ తెలుపు, పసుపు, గులాబీ, ముదురు క్రిమ్సన్ మరియు నలుపు, ఊదా వంటి అనేక షేడ్స్‌లో వస్తాయి.
*ఇంగ్లీష్ ప్రింరోస్..
ఈ పువ్వులు, శీతాకాలంలో మీ తోటను అందంగా ఉంచేందుకు సూచించదగిన మరొక ఉత్తమ ఎంపికగా ఉంటుంది. అవి తెలుపు, పసుపు, నారింజ నుండి నీలం, గులాబీ మరియు ఊదా రంగు వరకు దాదాపు అన్నిరకాల రంగులో పూస్తుంటాయి. ఇంగ్లీష్ ప్రింరోస్ శీతాకాలం మధ్యకాలం నుండి వికసిస్తుంది.
* హెలెబోర్..
ఈ మొక్కకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. దీనిలో వేర్లు లోతుగా పెరుగుతూ రూట్ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. హెలెబోర్స్ చల్లని ఉష్ణోగ్రతను తట్టుకోగలవు. సాధారణంగా ఇవి తెలుపు, గులాబీ మరియు ఊదా వంటి రంగులలో కనిపిస్తాయి. ఈ పువ్వులు పెరుగుతున్నప్పుడు క్రిందికి వ్రేలాడుతూ ఉంటాయి, అందుకే వాటిని ఎత్తుగా ఉన్న కుండీలలో పెంచవలసి ఉంటుంది. కామెల్లియాస్.. శీతాకాలంలో కామెల్లియాస్ ఆశ్చర్యకరంగా అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోగల పుష్ప జాతిగా ఉంటుంది. అవి చల్లని గాలులు వీచినంత కాలం ఈ పుష్పాలు వికసిస్తుంటాయి. ఈ మొక్కలు మీ తోటలోని ఇతర మొక్కలతో సరిపోయేలా కూడా ఉంటాయి.
* వింటర్ హనీసకిల్..
వింటర్ హనీసకిల్ పువ్వులు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు వికసిస్తాయి. ఈ మొక్క క్రీమీ వైట్ పువ్వులను ఉత్పత్తి చేస్తుంది. ఇది నిమ్మకాయను పోలి ఉండే సువాసనను విడుదల చేస్తుంది, ఇది మీ నిస్తేజమైన శీతాకాలపు వాతావరణాన్ని ఆసక్తికరంగా చేస్తుంది. ఫ్లోక్స్.. శీతాకాలంలో పెరిగే మరొక పుష్ప జాతి మొక్క ఫ్లోక్స్. విస్తృత శ్రేణి రంగులతో, ఇది మీ తోటకి అద్భుతమైన ప్రదర్శనను అందిస్తుంది.
* స్వీట్ అలిసమ్..
ఈ పువ్వులు తేలికపాటి మంచును తట్టుకోగలవు. అవి దృడంగా ఉన్నందున, వాటిని శీతాకాలం అంతా ఎటువంటి సంకోచం లేకుండా పెంచవచ్చు. ఇవి చూసేందుకు చిన్నవిగా ఉన్నా కూడా, సూక్ష్మమైన తీపి సువాసనను కలిగి ఉంటాయి.
* PC : FB స్వీట్-పీ(బఠానీ).. స్వీట్ బఠానీ మొక్కలకు నిర్వహణ కూడా తక్కువగానే ఉంటుంది. చల్లని శీతాకాలంలో అవి సులభంగా పెరుగుతాయి.ఈ స్వీట్-పీ మొక్క నీలం, గులాబీ, తెలుపు నుండి పీచు, బర్గుండి మరియు మెజెంటా రంగులలో విస్తృతంగా పువ్వులను ఉత్పత్తి చేస్తుంది.
* స్నోడ్రోప్స్..
అందమైన, క్రిందికి తిరిగిన తెల్లటి రేకులతో విరబూసే ఈ స్నోడ్రోప్స్ మీ శీతాకాలపు తోటకు సూచించదగిన సరైన పుష్ప జాతి మొక్కలుగా ఉంటాయి. ఈ పువ్వులు నవంబర్ ప్రారంభంలో వికసిస్తూ, అవి ఫిబ్రవరి వరకు పెరుగుతాయి. శీతాకాలంలో పువ్వులను పెంచడానికి సూచించదగిన చిట్కాలు.. 1. మీ తోటలోని స్థలం ప్రకారమే మొక్కలను నాటండి. 2. శీతాకాలంలో మీ మొక్కలకు జాగ్రత్తగా నీరు పోయాలని గుర్తుంచుకోండి. 3. క్రమం తప్పకుండా కంపోస్ట్ అనుసరించండి.