Politics

పవన్‌తో తెదేపా నేతల సమావేశం

TDP Leaders Meet With Pawan Kalyan

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను తెదేపా నేతలు కలిశారు. ఈ ఉదయం జనసేనాని నివాసానికి వెళ్లిన అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యపై చర్చించారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రేపు విజయవాడలో చేపట్టనున్న ఇసుక దీక్షకు మద్దతు కోరారు. దీంతో జనసేన సంఘీభావం తెలుపుతుందని పవన్‌ చెప్పారని.. అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పినట్లు తెదేపా నేతలు తెలిపారు.
*ప్రజా సమస్యపై పట్టుదలకు పోవద్దు
ఈ సందర్భంగా తెదేపా నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇసుక కొరతతో 45 మంది ఆత్మహత్యలు చేసుకున్నారనీ.. అయినా ప్రభుత్వం స్పందించడంలేదని మండిపడ్డారు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వం చలిస్తుందని వర్ల ప్రశ్నించారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో అష్టకష్టాలు పడుతున్నారనర్నారు. గత ప్రభుత్వం ఇసుకను ఎలా ఉచితంగా అందజేసిందో.. ఆ విధానాన్నే అమలు చేయాలని కోరారు. ప్రజాసమస్యపై పట్టుదలకు, పౌరుషాలకు పోవద్దని ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపిన పవన్‌ కల్యాణ్‌కు అభినందనలు తెలిపారు.
**అన్ని పార్టీల మద్దతూ కోరాం
వైకాపా మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతునూ కోరామని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రాథమికంగా అందరూ సానుకూలతే వ్యక్తంచేశారని చెప్పారు. భాజపా, సీపీఎం, సీపీఐ, జనసేన.. ఇలా అనేక పార్టీల నేతలను కలిసి సంప్రదింపులు జరిపినట్టు చెప్పారు. వారోత్సవాలతో ఒరిగేదేమీ ఉండదనీ.. పాత విధానం తీసుకొస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అచ్చెన్నాయుడు అన్నారు. మరోవైపు, చంద్రబాబు రేపు చేపట్టబోయే దీక్షా ఏర్పాట్లను పలువురు తెదేపా నేతలు పరిశీలించారు. ఈ మేరకు విజయవాడలోని ధర్నా చౌక్‌కు వెళ్లిన నేతలు అక్కడి పరిసరాలను పరిశీలించారు.
**చంద్రబాబు దీక్షకు మద్దతుగా రండి
చంద్రబాబు దీక్షకు మద్దతుగా రండి.. మాజీ ముఖ్యమంత్రి చందబాబు చేయనున్న నిరసన దీక్షలో పాల్గొని మద్దతుగా ప్రకటించాల్సిందిగా తెదేపా నేతలు అచ్చేనాయుడు, వర్ల రామయ్య జనసేన అధినేత పవన్ ను కోరారు. తెదేపా నేతలు పవన్ ను కలిసారు. చంద్రబాబు లేఖ ను అందించారు, ఇసుక సమస్యలో అధికార పర్ట్టీ నేతలు ఆకర్మలకు పాల్పడుతున్నారని ఇసుక పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ ఇక్కడ భావన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని తెదేపా ఇప్పటికే చార్జి షీట్ విడుదల చేసింది. ఇదే విషయాన్నీ పవన్ కు సైతం తెదేపా నేతలు వివరించారు. పవన్ ఇప్పటికే ఇదే అంశం పైన ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. ప్రభుత్వానికి రెండు వారాల సమయం ఇస్తూ డేడ్ లైన్ విధించారు. ఇప్పుడు రెండు పార్టీల డిమాండ్ ఒక్కటే కావటంతో తెదేపా నేతలు వ్యూహాత్మకంగా పవన్ కు కలుపుకుని ముందుకు పోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా పవన్ నిర్వహించిన లాంగ్ మార్చ్ కు మద్దతిచ్చి ఇప్పుడు తమ దీక్షకు మద్దతివ్వాలని పవన్ ను కోరింది. దీనికి పవన్ సైతం సానుకూలంగా స్పందించక తపని పరిస్థితిని తెదేపా కల్పించింది.
*జనసేన నుండి హాజరు
పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు తెదేపా నుండి మాజీ మంత్రులు అచ్చేన్నాయుడు అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపార్టీ పోరాటాలు నిర్వహించినా ప్రధాన ప్రతిపక్షంగా తెదేపా మద్దతు ఉంటుందని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. అందులో భాగంగానే జనసేనకు ఇసుక అంశం పైన పోరాటంలో మద్దతిచ్చారు. ఇప్పుడు తమ దీక్షకు రావాలంటూ తొలుత భాజపా రాష్టా అద్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను ఇసి అభ్యర్ధించారు. అయితే కన్నా మాత్రం తాముఇప్పటికే ఇసుక అంశం మీద పోరాటం చేస్తునమని ఎవరు పోరాటం చేసినా సంఘీభావం తెలుపుతామంటూ తెదేపా అధినేత దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఇక ఇప్పుడు జనసేన నుండి ఆ పార్టీ నేతలు హాజరు కానున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన పోరాటానికి తమ మద్దతు ఉంటుందని పవన్ హామీ ఎచ్చినట్ట్లుగా తెలుస్తోంది. అయితే జనసేన నుండి ముగ్గురు నేతలను చంద్రబు దీక్షకు మద్దతుగా పంపనున్నట్లు సమాచారం.