Politics

ఆ 14మంది తెలుగు తమ్ముళ్లు ఎందుకు రాలేదు?

Why were the 14 TDP MLAs Absent At Chandrababu's Sand Protest

తెదేపా అధినేత చంద్రబాబు ఇసుక దీక్ష చేసిన వేళ తెదేపాకి పెద్ద షాక్ తగిలింది. తెదేపా యువనేత దేవినేని అవినాష్ రాజీనామా చేసి వైకాపాలో చేరడంతో పాటు, వల్లభనేని వంశీ చంద్రబాబు టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సందించడం తెదేపా శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదలా ఉంటె చంద్రబాబు నాయుడు చేసిన ఇసుక దీక్షకు తెదేపా ఎమ్మెల్యేలు పట్టుమని పదిమంది కూడా హాజరు కాకపోవడం ఇప్పుడు తెలుగు తమ్ముల్లలో మరింత టెన్షన్ కు కారణమైంది. ఎపీలోను చర్చనీయంశంగా మారింది.
*చంద్రబాబు దీక్షకు హారజుకాని పద్నాలుగు మంది తెదేపా ఎమ్మెల్యేలు
తెదేపా నుండి గత ఎన్నికల్లో 23మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఇక వీరిలో ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పోగా మిగతా 22మంది ఏమ్మేఎలతో పది మంది ఎమ్మెల్యేలు కూడా అధినేత చంద్రబాబు చేసిన ఇసుక దీక్షకు హాజరుకాకపోవడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇసుక కొరతకు నిరసనగా పనేండు గంటల దీక్ష చేసిన చంద్రబాబు భాజపా మినహా మిగతా ప్రతిపక్ష పార్టీల మద్దతుతో దీక్షను సక్సెస్ చేసినా హాజరుకాకపోవడంతో అది పెద్ద మైనస్ గానే కనిపిస్తోంది తెలుగు తమ్ముల్లలో ఆందోళన మొదలైంది.
**ప్రకాశం జిల్లాలో నలుగురు గెలిస్తే హాజరయ్యింది ఒక్కరే.
విజయవాడ ధర్నాచౌక్ సెంటర్లో చంద్రబాబు చేసిన ఇసుక దీక్షకు తెదేపా ఎమ్మెల్యేలు ఎంతమంది అటెండ్ అయ్యారు. అనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మరింది. 23మంది ఎమ్మెల్యేలతో తొమ్మిది మంది ఎమేమ్లఎలు మాత్రమే బాబు ఇసుక దీక్షకు హాజరయ్యారు. మిగతా పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే మాత్రమే బాబు దీక్షకు హాజరయ్యారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు.
*వైజాగ్ నుండి నలుగురు గెలిస్తే.
వైజాగ్ నుండి గెలిచినా నలుగురు శాసన సభ్యులలో ముగ్గురు చంద్రబాబు దీక్షకు డుమ్మా కొటారు. కేవలం వెలగపూడి రామకృష్ణ మాత్రమే వచ్చారు. అణగని సత్యప్రసాద్ మదపేట ఎమ్మెల్యే జోగేస్వరరావు బెదాలం అశోక్ దీక్షకు హాజరు కాలేదు. ఇక విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అమెరికాలో ఉండడం వల్ల రాలేకపోయారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పయ్యావుల కేశవ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు.
*పద్నాలుగు మంది గైర్హాజరుతో తెలుగు తమ్ముళ్లలో టెన్షన్
మొత్తంగా పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు ఇసుక దీక్షకు హాజరుకాకపోవడంతో తెలుగు తమ్ముళ్ళులో వీరంతా తెదేపాలో కొనసాగుతారా లేక పార్టీ మారతారా అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే భాజపాతో సహా అధికార వైకాపా పదహారు మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని ప్రకటన చేసిన నేపద్యంలో ఎవరికీ వారు జంప్ అవడానికి ప్లాన్ చేస్తున్నారా అన్నది ప్రస్తుత ఏపీలో చర్చనీయంశంగా మారింది.
*పార్టీలో అంతర్గత కలహాలు
ఏదేమైనప్పటికీ తెదేపాలో గత ఎన్నికల తరువాత నెలకొన్న పరిణామాలు అటు పత్రీ అధినేత చంద్రబాబును పార్టీ కేడర్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నిన్నటికి నిన్న దేవినేని అవినాష్ పార్టీ మారడం పార్టీలో పరిస్థితి పై తన అసంతృప్తని వెళ్ళగక్కడం మరోవైపు వల్లభనేని వంశీ సైతం చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం నారాలోకేష్ ను దేవినేని ఉమాను టార్గెట్ చేసి మాట్లాడటం పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.