Sports

కొరియా ఓపెన్ నుండి విశ్రాంతి

Saina takes rest from Korean open-telugu sports news

ఇటీవలి టోర్నీల్లో వరుసగా విఫలమవుతున్న భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ విశ్రాంతి తీసుకుంది. మంగళవారం ఇక్కడ ప్రారంభం కానున్న బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ 400 కొరియా మాస్టర్స్‌ నుంచి ఆమె వైదొలిగింది. దీంతో ఈ టోర్నీ మహిళల సింగిల్స్‌లో భారత్‌ షట్లర్లెవరూ ఎవరూ పోటీలో లేరు. ఆరు నెలలుగా అధిక టోర్నీల్లో తొలి రౌండ్లలోనే పరాజయం చెందుతున్న ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ సైనా.. స్వదేశంలో వచ్చే వారం ప్రారంభమయ్యే సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ టూర్‌ 300 టోర్నీలో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక కొరియా టోర్నీ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌పై కిడాంబి శ్రీకాంత్‌ కన్నేశాడు. గత వారం జరిగిన హాంకాంగ్‌ ఓపెన్‌లో సెమీస్‌ వరకు చేరిన అతడు.. జోరు కొనసాగించాలని ఆశిస్తున్నాడు. తొలి రౌండ్‌లో వింగ్‌ కీ విన్సెంట్‌(హాంకాంగ్‌)తో శ్రీకాంత్‌ తలపడనున్నాడు. సమీర్‌ వర్మ, సౌరభ్‌ వర్మ, శుభాంకర్‌ డే పోటీలో ఉన్నారు. కాగా, కొరియా టోర్నీ డబుల్స్‌ ఏ విభాగంలోనూ భారత షట్లర్లు పోటీలో లేరు.