Food

హార్మోన్లను మొలకలు నియంత్రిస్తాయి

Eat loads of sprouts that can control hormones

చాలా తక్కువసమయంలో పోషకాహారాన్ని తీసుకోవాలనుకునేవారికి మొలకల్ని మించిన పరిష్కారం లేదు. వాటిని తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలూ ఉన్నాయి.

* పాతికల్లోనే… అమ్మాయిలు హార్మోన్ల అసమతుల్యతను ఎదుర్కొంటుంటారు. ఇవి ఎన్నో అనారోగ్యాలకు దారితీస్తాయి. ఇలాంటివారు మొలకల్ని తీసుకుంటే ఆ సమస్య అదుపులోకి వస్తుంది. సి విటమిన్‌ ఎక్కువగా దొరుకుతుంది. శరీరంలోని వ్యర్థాలు పూర్తిగా తొలగిపోతాయి. జుట్టూ ఆరోగ్యంగా ఉంటుంది.

* మెదడుకు రక్తసరఫరా చేయడంలోనూ మొలకల్లోని పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని తీసుకుంటే… మెదడు పనితీరు చురుగ్గా మారి… ఏకాగ్రత కుదురుతుంది. ఒత్తిడీ అదుపులో ఉంటుంది. ముఖ్యంగా బీన్స్‌, నట్స్‌, గింజల నుంచి మాంసకృత్తులు ఎక్కువగా అందుతాయి. తృణధాన్యాల మొలకల్లోనూ మాంసకృత్తులు దొరుకుతాయి. ఇవి కండరాలను దృఢంగా ఉంచుతాయి.

* బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మేలు. వీటిలో లభించే పీచు జీర్ణవ్యవస్థ పని తీరును పెంచుతుంది. మొలకల్లో జింక్‌, ఇనుము, క్యాల్షియం ఎక్కువగా లభిస్తాయి. ఇవన్నీ శరీరంలోని అన్ని అవయవాలకూ సక్రమంగా ప్రాణవాయువును సరఫరా చేస్తాయి. ముఖ్యంగా జింక్‌ సంతాన సాఫల్య సమస్యల్ని దూరం చేస్తుంది.

* పెసలు, సెనగలనే కాదు… గోధుమలు, బార్లీ, మెంతులు, అవిసెగింజలు, రాగులు, జొన్నలు.. ఇలా అన్నింటినీ మొలకలు వచ్చేలా చేసుకోవచ్ఛు వాటిని ఓ రోజంతా నానబెట్టి… మర్నాడు మెత్తని వస్త్రంలో మూటలా కడితే మొలకలు వస్తాయి. అలాగే తినడం ఇష్టంలేనివారు ఎండబెట్టి పొడిలా చేసుకోవచ్ఛు చపాతీ పిండిలో కొద్దిగా కలుపుకోవచ్ఛు లేదా జావలా చేసుకుని తాగినా మంచిదే.