Fashion

ఈ తైలాలు మృదుత్వ చిరునామాలు

Oils that smoothen and moisturize your skin-telugu fashion and beauty news

చలికాలంలో చర్మం పొడిబారడం మామూలే. తేమ అందాలంటే మాయిశ్చరైజర్‌ రాసుకోవడమే కాదు ఈ నూనెల్ని వాడి చూడండి.

ఆముదం: దీనిలోని ప్రొటీన్లు జుట్టుతోపాటు చర్మానికి మేలు చేస్తాయి. కొబ్బరినూనెతో కలిపి రాసుకుంటే చర్మానికి తేమ అందుతుంది. జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.

కొబ్బరినూనె: ముఖం మీద పేరుకున్న బ్యాక్టీరియాని తొలగించే గుణం ఈ నూనెకి ఉంది. మేకప్‌ని సులువుగా తొలగించి, చర్మాన్ని మృదువుగా మారుస్తుందీ నూనె.

సన్‌ఫ్లవర్‌: సాధారణంగా వంటలకే ఉపయోగిస్తాం కానీ… ఇది చర్మానికీ ఎంతో మేలు చేస్తుంది. అన్నిరకాల చర్మతత్వాలవారూ దీన్ని రాసుకోవచ్ఛు స్నానానికి అరగంట ముందు ఈ నూనెని కాళ్లు, చేతులకు రాసుకుని మర్దన చేస్తే చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.

బాదం: ఈ నూనెలో విటమిన్‌ ఈ ఎక్కువగా ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు బాదం నూనెను ముఖం, చేతులు, పాదాలకు రాసుకుని మృదువుగా మర్దన చేస్తే చాలు. చర్మం తేమగా, తాజాగా కనిపిస్తుంది.

లావెండర్‌: సౌందర్య ఉత్పత్తుల్లో దీన్ని ఎక్కువగా వాడతారు. ఇతర నూనెలతో కలిపి వాడితే ప్రయోజనాలెన్నో. తలకి రాసుకుంటే…జుట్టురాలడం తగ్గుతుంది. పొడిబారేతత్వం అదుపులో ఉంటుంది. చర్మం నిగారింపుతో కనిపిస్తుంది.