Movies

జాలి వేస్తుంది

The pity of aditi rao hydari-telugu movie news-జాలి వేస్తుంది

అలాంటి వారిని చూసి తాను జాలి పడతానని చెప్పింది నటి అదితిరావు. కోలీవుడ్‌లో కాట్రువెలియిడై, సెక్క సివందవానం వంటి చిత్రాల్లో నటించిన జాణ ఈ అమ్మడు. టాలీవుడ్‌లోనూ తన ఉనికిని చాటుకుంటున్న అదితిరావ్‌ ఆశించిన స్థాయిలో అవకాశాలను కానీ, క్రేజ్‌ను కానీ ఇంకా సంపాదించుకోలేదు. అయితే విమర్శకులకు మాత్రం ఎక్కవ పనిచెబుతూ ఉంటోంది. ఏదో ఒక విషయంతో వార్తల్లో ఉండే అదితిరావ్‌ అందాలను ఆరబోసిన ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వారి విమర్శలకు గురవుతుంటుంది. అలాంటిది ఈ సారి తనే విమర్శకులపై విరుచుకుపడింది. దీని గురించి ఈ భామ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో తనను విమర్శించిన వారి గురించి పాపం అని జాలి పడతానంది. అలావిమర్శలు చేసేవారి నుంచి దూరంగా తాము పారిపోలేమంది. ఎలాంటి విమర్శనలనైనా నిజాయితీగా స్వాగతించాలని అంది.