DailyDose

ప్రియాంక నిందితులను ఉరితీయలంటు ఆత్మహత్యాయత్నం-నేరవార్తలు-12/01

Khammam Student Attempts Suicide Demanding Priyanka Murderers Be Hanged-Telugu Crime News-12/01

* అమెరికాలో పిలాట‌స్ పిసి-12 ర‌కానికి చెందిన విమానం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో తొమ్మిది మంది మృతి చెందిన‌ట్లు అక్కిడి మీడియా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మృతుల్లో పైల‌ట్ స‌హా ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాదం సమ‌యంలో మొత్తం 12 మంది విమానంలో ఉన్నారు. వెంట‌నే రంగంలోకి దిగిన నేష‌న‌ల్ ట్రాన్స్‌పోర్టేష‌న్ సేఫ్టీ బోర్డ్ బృందం క్ష‌త‌గాత్రుల్ని స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించింది. ద‌క్షిణ డకోటాలోని చెంబ‌లీన్ అనే ప్రాంతంలో శ‌నివారం మ‌ధ్యాహ్నం ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌డ‌మే దీనికి కార‌ణమ‌ని ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

* హైదరాబాద్ నగరంలోని ఓ పబ్‌లో ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఓ నటి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పీకల్లోతు వరకు తాగడంతో నలుగురున్నారనే విచక్షణ మరిచిపోయి గలీజు పనులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.    ఈ వివరాలను పరిశీలిస్తే, మాదాపూర్‌లోని ఓ పబ్‌లో పటాన్‌చేరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌ కొడుకు అశీష్‌గౌడ్‌ హల్‌చల్‌ చేశాడు. పీకల్లోతు మద్యం మత్తులో మునిగి తేలిన ఆయన.. పబ్‌లోని యువతులతో అసభ్యంగా ప్రవర్తించాడు.    ఇదేంటి అని ప్రశ్నించిన యువతులపై కూడా దాడికి దిగాడు. దీంతో పలువురు అశీష్ గౌడ్‌ బాధితులు మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్ ఉన్న పబ్‌లో శనివారం అర్థరాత్రి జరిగింది.    అతనిపై ఫిర్యాదు చేసినవారిలో తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-2 ఫేం సంజనా కూడా ఉంది. మ్యూజిక్ ప్రోగ్రామ్‌లో తన చేయి తాకుతూ అశీష్ అసభ్యంగా ప్రవర్తిస్తూ.. అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించాడని ఫిర్యాదులో పేర్కొంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చి నోటికొచ్చిన బూతులు మాట్లాడారని చెప్పుకొచ్చింది. సంజన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

* తెలంగాణలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలతో మహిళలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బయటికి వెళ్లాలన్నా భయపడుతున్నారు. వరంగల్​లో ఓ మహిళా లెక్చరర్ తన ఆత్మరక్షణ కోసం రివాల్వర్ లైసెన్స్ కావాలంటూ… నగర పోలీస్ కమిషనర్​కు దరఖాస్తు చేసుకుంది. ఉద్యోగం నిమిత్తం తాను ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తోందని… తాజాగా జరిగిన దుర్ఘటనలు చూస్తుంటే భయమేస్తోందని దరఖాస్తులో పేర్కొంది. బయటకు వెళ్లిన తాను సురక్షితంగా వస్తానని నమ్మకం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు వస్తారనేది అత్యాశే… ఫోన్ చేసిన వెంటనే పోలీసులు వస్తారని…. కాపాడతారనేది నమ్మలేనని చెప్పారు. పోలీసింగ్​లో ప్రపంచంలోనే ఉత్తమ దేశాలుగా పేరు గాంచిన ఇంగ్లండ్, కెనాడా, నెదర్లాండ్స్ దేశాల్లోనే ఇది సాధ్యం కానప్పుడు… వరంగల్​లో సాధ్యమవుతుందని అనుకోవడం అత్యాశే అవుతుందని లెక్చరర్ తన దరఖాస్తులో పేర్కొన్నారు. మానవ మృగాల మధ్యలో ఉంటూ… ప్రతీ క్షణం తనని తాను కాపాడుకోవాలంటే… రివాల్వర్ ఉండటమే ఏకైక మార్గమన్నారు. తన ఆత్మరక్షణ కోసం రివాల్వర్ లైసెన్స్ కావాలని దరఖాస్తులో మహిళా లెక్చరర్ విజ్ఞప్తి చేశారు. లైసెన్స్ నిరాకరిస్తే… ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండే పరిస్థితి రావచ్చని తెలిపారు. అందుకే తన భద్రత కోసం రివాల్వర్ లైసెన్స్ మంజూరు చేయాలని సీపీని లెక్చరర్​ కోరారు.

* సార్‌ మావాళ్లు ప్రమాదంలో చిక్కుకున్నారు… వారిని రక్షించరూ’’ అంటూ పోలీసులను ఆశ్రయిస్తే.. ఆ స్థలం తమ పరిధిలోకి రాదనో.. లేదా ఫలానా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదివ్వండనో వచ్చే సమాధానాలు చాలామందికి అనుభవమే. తాజాగా హైదరాబాద్‌ శివార్లలో హత్యాచారానికి గురైన యువతి ఆపదలో ఉన్నట్లు తెలిసి ఆమె సోదరి ఫిర్యాదివ్వటానికి వెళ్లినప్పుడూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆపత్కాలంలో పోలీసులకు చెబితే ఆదుకుంటారనే భావనే తప్ప.. రక్షణకు ఈ హద్దుల గోలేంటో ఎవరికీ అర్థంకాదు. ఇలాంటివాటన్నింటికీ సమాధానమే ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’. చట్టంలోనే దీనికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ అంటే ఏమిటో, దాని ఉపయోగమేంటో తెలుసుకుందాం. జీరో ఎఫ్​ఐఆర్​ అంటే..? నేరఘటన స్థలం తమ పోలీసుస్టేషన్‌ భౌగోళిక పరిధిలోకి రాదని తెలిసినా సరే.. ఫిర్యాదు అందితే అత్యవసర పరిస్థితుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి, దర్యాప్తు ప్రారంభించాల్సిందే. తర్వాత సంబంధిత పోలీసుస్టేషన్‌కు ఎఫ్‌ఐఆర్‌ను బదిలీచేయాలి. తొలుత ఏ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు అందిందో.. అక్కడ నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు వరుససంఖ్య కేటాయించరు. దీన్ని ఆ స్టేషన్‌ రికార్డుల్లో జీరోగా చూపిస్తారు. దీన్నే జీరో ఎఫ్‌ఐఆర్‌ అంటారు. కేసు బదిలీ అయిన పోలీసుస్టేషన్‌ రికార్డుల్లో ఎఫ్‌ఐఆర్‌కు వరుస సంఖ్యను కేటాయిస్తారు. ఎక్కడైనా, ఏదైనా నేరం జరిగిందని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు అందితే తప్పనిసరిగా కేసు నమోదుచేయాలి. నేరం జరిగిన ప్రదేశం తమ పోలీసుస్టేషన్‌ భౌగోళిక పరిధిలోకి వస్తుందా.. రాదా? అనే సందేహమున్నా సరే తొలుత ఫిర్యాదు స్వీకరించి ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించాలి. తర్వాత నేరం జరిగిన ప్రదేశం తమ పరిధి కాదని తేలితే.. అది ఏ పోలీసుస్టేషన్‌ పరిధిలోకి వస్తుందో చూసి.. అక్కడికి ఎఫ్‌ఐఆర్‌ బదిలీచేయాలి. నేరం జరిగినప్పుడు బాధితులను రక్షించే క్రమంలో పరిధుల పేరిట జాప్యం జరగకూడదని, ఆ జాప్యం వల్ల నేరగాళ్లు తప్పించుకునేందుకు అవకాశం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానాన్ని కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిర్యాదు తీసుకోకుంటే ఫిర్యాదు తీసుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరిస్తే అది నేరమవుతుంది. ఐపీసీ సెక్షన్‌ 166ఏ ప్రకారం ఆ పోలీసు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవొచ్చు. జీరో ఎఫ్‌ఐఆర్‌ విషయంలో సత్వరం స్పందించే పోలీసు అధికారులను రివార్డులతో సత్కరించాలని.. నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తీసుకోవాలని 2013లోనే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు, ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది.

* శంషాబాద్​కు చెందిన యువతి హత్యాచారం ఘటనలో నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. షాద్​నగర్ మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట నలుగురు నిందితులను హాజరుపర్చగా… 14 రోజుల రిమాండ్ విధించారు. రిమాండ్​లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు 21 న బయలుదేరినప్పటి నుంచి దారుణానికి ఒడిగట్టి ఇంటికి చేరేవరకు చేసిన కృత్యాలన్ని బట్టబయలయ్యాయి. కామాంధుల క్రూర’కృత్యాలు’… 27 సాయంత్రం 5.30 గంటల సమయంలో మద్యం కొనుగోలు చేసి నలుగురు పీకలదాకా తాగారు. సాయంత్రం 6 గంటలకు లారీ పక్కనే ద్విచక్ర వాహనం పార్కు చేసిన శంషాబాద్ యువతిని గమనించిన నిందితులు… ఆమెపై అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నారు. యువతి గచ్చిబౌలి వెళ్లిన విషయాన్ని గమనించారు. యువతి తిరిగి వచ్చేలోపు… ద్విచక్ర వాహనంలోని వెనక టైరులో గాలిని నవీన్​ తీసేశాడు. అదేరోజు రాత్రి 9.30 గంటలకు అమ్మాయి తిరిగి రాగానే టైరులో గాలిలేదని… పెట్టించుకొస్తామని చెన్నకేశవులు, ఆరిఫ్ ఒప్పించారు. టైరులో గాలి పెట్టించుకురావడానికి శివ వెళ్లాడు. లారీ డ్రైవర్లు తనతో అదోలా ప్రవర్తిస్తున్నారని… భయమేస్తుందన్న విషయాన్ని ఫోన్​లో యువతి తన సోదరికి వివరించింది. మొదటిసారి దుకాణాలు మూసి ఉన్నాయని తిరిగి వచ్చిన శివ… రెండోసారి వెళ్లి టైరులో గాలి పెట్టించుకొచ్చాడు. శివ వచ్చేలోపు ఆరిఫ్, నవీన్, చెన్నకేశవులు కలిసి యువతిని బలవంతంగా జాతీయ రహదారి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి లాక్కెళ్లారు. యువతి సెల్​ఫోన్​ను లాక్కొని ననీన్​ స్విఛ్చాఫ్​ చేశాడు. చెన్నకేశవులు, నవీన్ కలిసి యువతి నోట్లో బలవంతంగా మద్యం పోశారు. యువతిని చెన్న కేశవులు. నవీన్, ఆరిఫ్, శివ వరుసగా సామూహిక అత్యాచారం చేశారు. హెల్ప్ హెల్ప్ అంటున్నా… యువతిని నిందితులు వదల్లేదు. తీవ్ర రక్తస్రావమై యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కాసేపటి తర్వాత మెలకువ రావటం గమనించిన నిందితులు…. యువతిని హత్య చేయాలని నిర్ధారించుకున్నారు. యువతి నోరు, ముక్కుపై ఆరిఫ్​ గట్టిగా అదిమి పట్టడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. యువతి సెల్ ఫోన్, వాచ్, పవర్​బ్యాంక్​ను నవీన్ తీసుకున్నాడు. మృతదేహాన్ని దుప్పట్లో కప్పి లారీ క్యాబిన్​లోకి ఎక్కించారు. చెన్నకేశవులు, ఆరిఫ్ లారీలో వెళ్లగా… ద్విచక్ర వాహనంపై శివ, నవీన్…. షాద్​నగర్ వైపు బయలుదేరారు. డీజిల్ పోసి తగులబెట్టాలనుకుని పూర్తిగా తగులబడదేమోనని మార్గమధ్యలో పెట్రోల్ కూడా కొనుగోలు చేశారు. చటాన్​పల్లి జాతీయ రహదారి వంతెన కిందికి యువతి మృతదేహాన్ని తీసుకెళ్లారు. యువతి మృతదేహంపై మొదట ఆరిఫ్ పెట్రోల్ పోశాడు. ఆ తర్వాత నవీన్ డీజిల్ పోశాడు. శివ మృతదేహానికి అగ్గిపెట్టెతో నిప్పంటించాడు. యువతి సిమ్ కార్డు, హ్యాండ్ బ్యాగును నిందితులు మంటల్లో వేశారు. అనంతరం ఆరిఫ్, చెన్నకేశవులు లారీలో అక్కడి నుంచి బయల్దేరగా శివ, నవీన్ ద్విచక్ర వాహనంపై వచ్చారు. కొత్తూర్ జాతీయ రహదారి పక్కన ద్విచక్ర వాహనం వదిలిపెట్టి శివ, నవీన్ కూడా లారీలో ఎక్కారు. 28వ తేదీ తెల్లవారుజామున 4గంటల సమయంలో ఆరాంఘర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడి నుంచి శివ 5.30 నిమిషాలకు గుడిగండ్లకు వెళ్లిపోగా…. నవీన్, చెన్నకేశవులు 7గంటలకు వెళ్లారు. ఆరిఫ్ మాత్రం శంషాబాద్​లోని ఆటోనగర్​లో ఇటుక లోడ్​తో ఉన్న లారీని యజమానికి చెప్పి స్వగ్రామం జక్లేర్​కు వెళ్లాడు. చరవాణి దొరకలేదు… హత్య జరిగిన క్రమాన్ని మొత్తం రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు… యువతికి చెందిన చరవాణి, పవర్ బ్యాంక్, చేతివాచి మాత్రం లభించలేదని తెలిపారు. కేసులో పురోగతి కోసం నిందితులను కస్టడీ కోరే అవకాశం ఉంది.

* శంషాబాద్​లో పశువైద్యురాలిని అత్యంత పాశవికంగా హత్యాచారం చేసిన నిందుతుల తల్లిదండ్రులు కూడా వారి చేసిన నేరానికి కనికరం చూపట్లేదు. ఇలాంటి వారికి శిక్ష పడితేనే.. సమాజంతో ఇలాంటి తరహా ఘటనలు పునరావృతం కావని చెబుతున్నారు

* పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామం నుండి వరగాని వైపు వ్యవసాయ కూలీలు తో వస్తున్నా ట్రాక్టర్ కాలవలో బోల్తా ట్రాక్టర్ లో 25 మంది ప్రయాణిస్తూన్నారు 10 మందికి చిన్న చిన్న గాయాలు 3 తీవ్రగాయాలు అదంబి. అంజలి.కుమారి ని గుంటూరు లలిత ఆసుపత్రి కి ప్రవేటు వాహనం లో తరలింపు

* కేంద్రంలోని జాతీయ ఉద్యానవనం సమీపంలో ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మూడో పట్టణ సీఐ రెడ్డప్ప, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపంపేట(జాకీర్‌ కొట్టాలు) ప్రాంతానికి చెందిన వెంకటేశు, పోలేరమ్మ(45) భార్యాభర్తలు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఆర్తి(17), దీప(11) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఆర్తి ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి, నర్సింగ్‌లో శిక్షణ పొందుతోంది. కొన్ని ఆర్థిక కారణంగా పోలేరమ్మ తన ఆభరణాలను తాకట్టు పెట్టింది. ఈ ఆభరణాల విషయమై ఇద్దరూ గొడవ పడ్డారు. ఈక్రమంలో శనివారం రాత్రి 9గంటల సమయంలో పోలేరమ్మ భర్తతో గొడవ పడి కుమార్తెలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది.

* లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్‌ నారాయణ కారుకు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని జూబ్లి చెక్‌పోస్టు వద్ద జేపీ కారుకు ప్రమాదం జరిగింది. కారును వెనుక నుంచి ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో ఢీకొట్టడంతో కారు వెనుకభాగం నుజ్జునుజ్జయింది.

* పెద్దపెల్లి జిల్లా రామగుండము ఎన్టీపీసీ లో ప్రజాసంఘాలు,యువజన సంఘాలు సామజిక కార్యకర్తలు ఆధ్వర్యంలో శంషాబాద్ లో అత్యాచారం హత్య కి గురైన ప్రియాంక రెడ్డి చిత్రపటానికి నివాళి అర్పించి అత్యాచారం చేసిన హంతకుల దిష్టి బొమ్మ దగ్ధం చేసి హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.మహిళల పై ఎలాంటి దాడులు జరగకుండా కొత్త చట్టాలు తేవాలని కోరారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని మహిళలకి రక్షణ కల్పించాలని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఛ్ఫీంళ్ న్యూ డెమోక్రసీ నాయకులు జ్యోతి,శంకర్ లక్ష్మి, సామజిక కార్యకర్తలు ముచకుర్తి రమేష్, భ్ఝ్ఫ్ నాయకులు తొగరి తిరుపతి ,జింక ఉదయ్ భూషణ్ సింధు పాల్గొన్నారు.

* ఖమ్మం జిల్లా వైరా లో డిగ్రీ విద్యార్థి మట్టా రోహిత్ ప్రియాంక రెడ్డిని హత్యాచారం చేసి చంపిన నిందితులను ఊరి తియ్యాలి వారికి శిక్షలు వద్దు అంటు మూడు అంతస్తుల బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ప్రియాంక నిందితులను ఉరి తీస్తేనే బిల్డింగ్ పై నుండి దిగుతా లేకుంటే ఇక్కడ నే ఉంటా లేకపోతే దూకుత అన్నాడు.విషయం తెలుసుకున్న వైరా ఎస్సై నరేష్ తన పోలీసు సిబ్బంది తో అక్కడికి వచ్చి భవనం పైకి ఎక్కి రోహిత్ తో తల్లిదండ్రులతో మట్లడించి కొద్ది సేపు పైనే ఉండి సర్దిచెప్పి కిందికి తీసుకుని వచ్చారు.అనంతరం రోహిత్ ను పోలీసు స్టేషనుకు తీసుకెళ్ళి ఎస్సై నరేష్ అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు.రోహిత్ మరో ఆడపిల్లకు అన్యాయం జరగకుండా ప్రాణం పోకుండా ఉండాలి. మానవ మృగలకు భయం పుట్టేలా వారిని వెంటనే ఉరి తీస్తే మరో ఆడపిల్ల వైపు చూడాలి అంటే మానవ మృగాలకు భయం పుట్టాలి అన్నాడు.