Devotional

దేవాలయాల్లో కదిలే రధం చరిత్ర ఇది

The moving chariots in hindu temples history

1. దేవాలయాల్లో కదిలే రధం చరిత్ర ఇది- ఆద్యాత్మిక వార్తలు- 12/03
రథం అనే పదం.. రథం ఉపయోగం చాలా ప్రాచీనమైనది. తొలివేదమైన ఋగ్వేదంలోనే రథం గురించి.. వాటి నిర్మాతలైన రథకారుల గురించి వివరాలున్నాయి. ఆలయవ్యవస్థ కంటే ముందే రథం రూపుదిద్దుకుంది అని చెప్పడంలో ఏ సందేహమూ లేదు. దేవతలు ఉపయోగించే వాటిని దేవతారథాలనీ.. ఆలయంలో ఉత్సవాలప్పుడు వాడేవాటిని ఆలయరథాలనీ.. యుద్ధాలలో పోరాటాలకు వినియోగించేవి యుద్ధ/సాంగ్రామిక రథాలనీ అంటారు. నాలుగు చక్రాలు ఉంటే శకటం అనీ.. ఆరు చక్రాలుంటే స్యందనం అనీ.. ఎనిమిది చక్రాలుంటే సభద్రం అనీ.. పదిచక్రాలుంటే మేరువు అనాలని ఆగమసారం చెప్తోంది. వీటిలో ఆలయరథం నిర్మాణం విలక్షణమైనది. ప్రతి రథాన్ని నడపడానికి ఏదోక అనువుంటే ఇక్కడ మాత్రం భక్తులే రథచాలకులు. ఈ రథం నిర్మాణానికి అనాదిగా కొయ్యనే వాడుతున్నారు.ఆలయరథం అనగానే.. పెద్ద పెద్ద చక్రాలు..వాటికి జోడించిన ఇరుసులు…వాటిపై ఆలయానికి వలెనే అధిష్ఠానం.. దానిపైన మండపం.. మండపం మధ్యలో దేవతా విగ్రహాన్ని ఉంచే దివ్యపీఠం.. పీఠానికి వెనుక ప్రభావళి.. మండపంపైన విమానం.. విమానం తుదిభాగంలో శిఖరకలశం.. దానికి అమర్చిన ఛత్రం (గొడుగు).. ఇంకా దానికి సింహాలు.. ద్వారపాలక విగ్రహాలు.. అశ్వాలు.. సారధి విగ్రహం మొదలైన దారు (కొయ్య) విగ్రహాలను తగిలించి జెండాలతో.. రంగురంగుల వస్త్రాలతో.. పూలమాలలతో అలంకరించబడి.. రథోత్సవం రోజున ఆలయమే కదిలి వస్తుందా అనిపిస్తుంది. ఆలయానికి మరోరూపు అనుకునే రథోత్సవంతోనే ఉత్సవాలు సమాప్తమౌతాయి. రథం స్వయందేవాలయమే కనుక కొన్ని ఆలయాల్లో రథోత్సవం ప్రారంభం కాగానే గుడి తలుపులు మూసివేయడం సంప్రదాయం. అంటే దేవుడు అప్పుడు రథంలో ఉన్నాడని అర్థం.అలాగే ‘రథస్థం కేశవం దష్ట్వా పునర్జన్మ న విద్యతే ‘రథంపై ఉన్న కేశవుడిని చూస్తే మరుజన్మ ఉండదని పురాణవచనం. సంవత్సరానికోసారి జరిగే ఉత్సవాల్లో చివరిరోజు రథోత్సవం నాడు వేలాదిమంది భక్తులు ఒక్కటై అతిపెద్ద తాడును రథానికి పూన్చి రథాన్ని లాగే సన్నివేశం మాటలకందని దివ్యభావనను అందిస్తుంది. రథంపై కదిలొస్తున్న దేవుని జయజయధ్వానాలతో కీర్తించే భక్తుల గొంతులు ఏకమై స్మరించేవారంతా తరించాలని దేవుడు దీవెనలనందిస్తాడు. భక్తులు కోరుకున్నవన్నీ నిజం చేస్తాడు. ఆలయానికి.. రథానికి ఉన్న అవినాభావ సంబంధం అంత గొప్పది. కనుకనే ఎన్నో ఆలయాలు రథాకారంలో ఉన్నాయి. కోణార్క్‌ సూర్య దేవాలయం, చెన్నై పార్థసారథి ఆలయం, హంపి విఠ్ఠల ఆలయం రాతితేరు, మహాబలిపురం పంచరథాలు, తాడిపత్రి చింతలవెంకట రమణస్వామి దేవస్థానం గరుడాలయం ఇవన్నీ రథాకారంలో రూపుదిద్దుకున్నవే.
2.పద్మావతీ అమ్మవారికి పుష్పయాగం
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో సోమవారం రాత్రి పుష్పయాగాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ఆలయంలోని ముఖమండపంలో కొలువుదీర్చి నాలుగు టన్నుల బరువు ఉన్న 14 రకాల పుష్పాలతో చతుర్వేద విన్నపం చేశారు.
3.16న తితిదే ఆధ్వర్యంలో త్రిగళావధానం
తిరుపతిలో తితిదే ఆధ్వర్యంలో ముగ్గురు ప్రముఖ అవధానులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ, పాలడుగు శ్రీచరణ్ల కలయికతో ‘త్రిగళావధానం’ జరగనుంది. అచ్చతెలుగు, ఆంధ్రం, సంస్కృతాల సమ్మేళనంతో దేశంలోనే మొదటిసారిగా ఈ నెల 16న మహతి కళాక్షేత్రంలో మధ్యాహ్నం రెండు గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. కీలకమైన అప్రస్తుత ప్రసంగం అంశాన్ని రచయిత, సినీనటుడు తనికెళ్ల భరణి నిర్వహించనున్నారు.
4. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ చాలా సాధారణంగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచిఉన్నారు. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి 4 గంటల సమయం, టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 80,474 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,062 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.40 కోట్లు.
5. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణం..
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులు రెండు కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం, టైమ్‌స్లాట్ 3 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
6. శ్రీకాళహస్తిలో నిర్వహించనున్న ఏడుగంగల జాతరకు ఆదివారం అర్ధరాత్రి ఘనంగా చాటించపు నిర్వహించారు. జాతర సందర్భంగా ముక్కంటి ఆలయానికి అనుబంధంగా ఉన్న ఏడుగంగల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెట్టురాయి వద్ద కుంభం వేసి పూజలు జరిపారు. ముందురోజున ముక్కంటి ఆలయంచే సారెను సమర్పించనున్నారు. కొత్తపేట, గాంధీవీధి, జయరామారావువీధి, పెళ్లిమండపం, బేరివారి మండపం, సన్నిధివీధి, తేరువీధుల్లోని గంగమ్మలతో పాటు అనుబంధ ఆలయాలైన ముత్యాలమ్మ, అనుబంధ ఆలయాల్లోనూ సారెను అందజేయనున్నారు.
7. పంచాంగం
image.gif
03.12.2019
సంవత్సరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: హేమంత
మాసం: మార్గశిర
పక్షం: శుక్ల
తిథి: సప్తమి రా.11:05 వరకు
తదుపరి అష్టమి
వారం: మంగళవారం (భౌమ వాసరే)
నక్షత్రం: ధనిష్ట ప.03:15 వరకు
తదుపరి శతభిషం
యోగం: వ్యాఘత, హర్షణ
కరణం: గార
వర్జ్యం: రా.11:09 – 12:54
దుర్ముహూర్తం: 08:44 – 09:29
రాహు కాలం: 02:52 – 04:16
గుళిక కాలం: 12:05 – 01:29
యమ గండం: 09:18 – 10:41
అభిజిత్ : 11:43 – 12:27
సూర్యోదయం: 06:30
సూర్యాస్తమయం: 05:40
వైదిక సూర్యోదయం: 06:34
వైదిక సూర్యాస్తమయం: 05:36
చంద్రోదయం: ప.12:02
చంద్రాస్తమయం: రా.11:45
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కుంభం
దిశ శూల: ఉత్తరం
చంద్ర నివాసం: పశ్చిమం
మిత్ర సప్తమి – సూర్య వ్రతం
image.gif
నయన ప్రద సప్తమి
image.gif

image.gif
జ్యేష్ఠ కార్తె
image.gif

image.gif
జయ-సిత సప్తమి
image.gif

image.gif
ఉభయ – పుత్రీయ సప్తమి
image.gif

image.gif
నందా సప్తమీ వ్రతం
image.gif

image.gif
సూర్యనమస్కారములు
image.gif

8. శ్రీరస్తు
image.gif
శుభమస్తు
image.gif
image.gif

image.gif
తేది : 3, డిసెంబర్ 2019
image.gif
సంవత్సరం : వికారినామ సంవత్సరం
image.gif
ఆయనం : దక్షిణాయణం
image.gif
మాసం : మార్గశిరమాసం
image.gif
ఋతువు : హేమంత ఋతువు
image.gif
కాలము : శీతాకాలం
image.gif

image.gif
వారము : భౌమవాసరే (మంగళవారం)
image.gif
పక్షం : శుక్లపక్షం
image.gif
తిథి : సప్తమి
(నిన్న రాత్రి 9 గం॥ 0 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 11 గం॥ 14 ని॥ వరకు సప్తమి తిధి తదుపరి అస్టమి తిధి)
image.gif
నక్షత్రం : ధనిష్ట
(నిన్న ఉదయం 11 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 16 ని॥ వరకు ధనిస్ట నక్షత్రం తదుపరి శతభిషం నక్షత్రం)
యోగము : (వ్యాఘాతం ఈరోజు మధ్యాహ్నం 2 గం ll 8 ని ll వరకు తదుపరి హర్షణం రేపు మధ్యాహ్నం 2 గం ll 53 ని ll వరకు)
image.gif
కరణం : (గరజి ఈరోజు ఉదయం 10 గం ll 7 ని ll వరకు)
image.gif
అభిజిత్ : (ఈరోజు ఉదయం 11 గం ll 57 ని ll )
image.gif
వర్జ్యం : (ఈరోజు రాత్రి 10 గం॥ 19 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుఝాము 0 గం॥ 7 ని॥ వరకు)
image.gif
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుఝాము 2 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుఝాము 4 గం॥ 32 ని॥ వరకు)
image.gif
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 16 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 19 ని॥ వరకు)
image.gif
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 8 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 11 గం॥ 57 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 21 ని॥ వరకు)
image.gif
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ వరకు)
image.gif
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 31 ని॥ లకు
image.gif
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 40 ని॥ లకు
image.gif
సూర్యరాశి : వృచ్చికము
image.gif

image.gif
చంద్రరాశి : కుంభము
image.gif

image.gif
జ్యేష్ఠ కార్తె ప్రారంభం
image.gif

9. శుభోదయం
image.gif
మహానీయుని మాట
image.gif

ఎదుటివారిలో నీకు నచ్చని గుణాలు ఉన్నాయని ద్వేషించే ముందు, నీలో అలాంటి గుణాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకో.”
10. నేటి ఆణిముత్యం
image.gif

మిడిసిపాటు వలన మిత్రత చెడిపోవు
స్పర్ధలిలను పెరుగు వ్వర్ధముగను
మనసు శుద్ధిలేక మన్నించ రెవ్వరు
గర్వమడచి చూడు సర్వమబ్బు
భావం:
మనిషి లోని గర్వం స్నేహాన్ని చెడగొడుతుంది. అనవసరంగా గొడవలను పెంచుతుంది. మనసు మంచి గా లేకపోతే ఎవరూ గౌరవించరు.గర్వాన్ని విడిచి పెట్టు.అంతా నీ వశమౌతుంది.
11. మన ఇతిహాసాలు -భారతంలో వ్యాసుని పాత్ర
మహాభారతాన్ని రచించిన వ్యాసుడు భారతకథలో ఒకభాగమై ఉన్నాడు. అయినప్పటికీ వ్యాసుడు కర్తవ్యనిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్యబోధ చేస్తూ తిరిగి తనదారిన తాను వెళ్ళిపోతాడు.
వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరువాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది.సత్యవతీ శంతనుల వివాహకాలంలో దాశరాజు విధించిన షరతుల కారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగధుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మంత్రం చే తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని మరియు దాశీకు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు.
ఆతరువాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృత పిండం నూట ఒక్క నేతికుండలలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు. * దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తనదారిన తాను వెళతాడు.
ఆ తరువాత లక్క ఇంటి దహనం తరువాత హిడింబాసురుని మరనానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివసించిన ఆశ్రమప్రాంతంలో పాడవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు. ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడి వృక్షముకింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప భయములుండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రథమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయమందగలరచి సూచించి తనదారిని తాను వెళతాడు.ఆ తరువాతి కాలంలో ద్రౌపతీ స్వయంవరానికి ముందుగా పాందవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపతి పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభంకలుగుతందని చెప్పి ద్రౌపతీ వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధాన మయ్యాడు.
12. రాశిఫలం – 03/12/2019
తిథి:
శుద్ధ చవితి సా.6.39, కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
నక్షత్రం:
పూర్వాషాఢ ఉ.9.40
వర్జ్యం:
సా.6.03 నుండి 7.43 వరకు
దుర్ముహూర్తం:
ఉ.6.00 నుండి 7.36 వరకు
రాహు కాలం:
ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలధికమవుతాయి.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలేర్పడే అవకాశాలుంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా నుండుట మంచిది. స్ర్తిలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఋణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకెళ్తారు.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా వున్నాయి. వేళ ప్రకారం భుజించుటకు ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులెదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కళాకారులకు మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.
ధనుస్సు:
(మూల,పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చగుటచే ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించక తప్పదు.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ఋణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనంవల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా నుండుట మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు.
13. చరిత్రలో ఈరోజు, డిసెంబర్ 03
image.gif సంఘటనలు
1971: భారత్-పాకిస్తాన్ 3వ యుద్ధం ప్రారంభం.
1984: భోపాల్ విషవాయు దుర్ఘటనలో 2200 మంది చనిపోయారు.
2007: ఆస్ట్రేలియా 26వ ప్రధానమంత్రిగా కెవిన్ రడ్ ప్రమాణస్వీకారం.
జననాలు
1884: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (మ.1963)
1889: ఖుదీరాం బోస్, భారత స్వాతంత్ర్యోద్యమ కారుడు. (మ.1908)
image.gif 1931: విజయ్‌కుమార్ మల్హోత్రా, భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు రచయిత.
మరణాలు
1939: ఓలేటి వేంకటరామశాస్త్రి, ప్రముఖ జంట కవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (జ.1883)
image.gif 1968: బందా కనకలింగేశ్వరరావు, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (జ.1907)
1979: ధ్యాన్ చంద్, ప్రముఖ భారత హాకీ క్రీడాకారుడు. (జ.1905)
1998: పసల అంజలక్ష్మి, గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలచుకుని, సమాజ సేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయి. (జ.1904)
2009: కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (జ.1986)
2011: దేవానంద్, ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు. (జ.1923)
మనపండుగలు/జాతీయ దినోత్సవాలు
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
14. తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ
ఈరోజు మంగళవారం 03-12-2019 ఉదయం 5 గంటల సమయానికి.
image.gifతిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ…
శ్రీవారి దర్శనానికి 2 కంపార్ట్ మెంటులలో వేచి ఉన్న భక్తులు…….
శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది…..
ప్రత్యేక ప్రవేశ (₹-300) దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది….
కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది…..
నిన్న డిసెంబర్ 2 న 80,474 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది…
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 3.40 కోట్లు…