Agriculture

1.10కోట్ల ఎకరాలలో పంటలు సాగు

Telangana Is the only state that gives capital for farmers

రాష్ట్రంలో 1.50కోట్ల ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి ఉందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. 1.10కోట్ల ఎకరాలలో పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. నసుర్లాబాద్‌ మండలం బొప్పాస్‌పల్లిలో కిసాన్‌ మేళా 2019 కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యంత్రాలతో వరినాటే విధానంపై అవగాహన కల్పించారు. ‘భవిష్యత్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి మళ్లించి ఏటా రెండు పంటలకు సాగునీరు అందిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. దేశంలో రైతుకు పెట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. యంత్రాలతో వరినాటడం ద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతోంది. గతంలో బొప్పాస్‌పల్లి విత్తనక్షేత్రం నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్షేత్రానికి పూర్వవైభవం తీసుకొస్తున్నాం. రూ.4కోట్లతో సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మిస్తున్నామని’ స్పీకర్‌ పేర్కొన్నారు.