Fashion

ముక్కు మీది నలుపు ఎలా పోగొట్టేది?

How to remove black heads on your nose?

ముక్కు మీద బ్లాక్‌ హెడ్స్‌ చిరాకు పెడుతున్నాయా? అయితే వాటిని తొలగించడానికి తేలికైన చిట్కాలున్నాయి. అవేమిటంటే…
ముఖం కడుక్కొని శుభ్రంగా తుడుచుకోవాలి. ముక్కు మీద గుడ్డు తెల్లసొన పూసుకోవాలి. తర్వాత టిష్యూ పేపర్‌ తీసుకుని ముక్కు మీద అంటించి, ఆరిన తర్వాత లాగేయాలి.
శుభ్రమైన దూది ఉండ మీద లెమన్‌ ఆయిల్‌ పోసి, కొన్ని చుక్కల నీళ్లు చిలకరించాలి. తర్వాత ఆ ఉండను ముక్కు మీద రుద్దుకుని ఆరిన తర్వాత శుభ్రంగా కడిగేయాలి.
సమపాళ్లలో పాలు, జలటిన్‌ కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని 5 సెకన్లపాటు మైక్రోవేవ్‌ చేయాలి. దానిని ముక్కు మీద అప్లై చేసి, 20 నిమిషాల తర్వాత తీసెయ్యాలి.
రెండు టీస్పూన్ల పుదీనా రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముక్కు మీద అప్లై చేయాలి. ఆరిన తర్వాత
గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.
రాత్రి పడుకోబోయే ముందు తేనెలో నిమ్మరసం కలిపి ముక్కు మీద రాసుకోవాలి. ఉదయాన్నే నీళ్లతో శుభ్రంగా
కడిగేసుకోవాలి.
పెరుగులో దాల్చినచెక్క పొడి కలిపి, ముక్కు మీద అప్లై చేసి, ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.