Editorials

19న డమ్మీ ఉరి పరీక్ష

Nirbhaya Trial Run Hanging On 19th

నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22న ఉరి తీసేందుకు డెత్ వారంట్ జారీ చేసింది ఢిల్లీ పటియాలా కోర్టు. అయితే ఈ నెల 19వ తేదీ (ఆదివారం)న ముందుగా డమ్మీ ఉరి తీసేందుకు తిహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గత నెలలో బక్సర్ జైలు నుంచి కొనుగోలు చేసిన కొత్త ఉరి తాళ్లతో ఇసుక బస్తాలను ఉపయోగించి 19వ తేదీ ఉదయం డమ్మీ ఉరి తీయనున్నట్లు తిహార్ జైలు సిబ్బంది తెలిపింది. నిర్భయ దోషులైన పవన్‌గుప్తా, అక్షయ్‌, వినయ్‌ శర్మ, ముకేశ్‌ సింగ్‌ల బరువు ఆధారంగా ఇసుక సంచులను సిద్ధం చేశారు. ఇసుక బస్తాలకు ఉరి తాళ్లు బిగించి డమ్మీ ఉరి తీయాలని జైలు అధికారులు నిర్ణయించారు.గతంలో ఈ తిహార్ సెంట్రల్ జైలులో ఒకేసారి ఇద్దరు దోషులను ఉరి తీశారు. నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఏకకాలంలో ఉరి తీసేలా జైలులోని 3వ నంబరు గదిలో ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వేర్వేరు జైలు గదుల్లో ఉన్న నలుగురు నిర్భయ దోషులను ఉరి తీసే జైలు నంబరు 3కి తరలించనున్నట్లు చెప్పారు.