Health

బరువు తగ్గాలంటే…

బరువు తగ్గాలంటే…

రెస్టారెంట్స్లో ఉండే డైనర్స్ తరచుగా చేసే తప్పేమిటంటే, 8 ఔన్సుల సోడా కోసంగా 32 ఔన్సుల గ్లాస్ వినియోగిస్తుంటారు. ఈ కారణంచేత, తరచుగా ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో ఇచ్చే డ్రింక్ 16 ఔన్సులతో రెండు రెట్లు ఎక్కువ పరిమాణం కలిగి ఉంటుంది. వైన్, కాక్టెయిల్స్ కూడా ఇదేవిధంగా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంటుంది. 5 ఔన్సుల వైన్లో 125 కేలరీలు ఉండగా, 2 ఔన్సుల డైకిరిలో 112 కేలరీలు ఉంటాయి. అందుకే ఈ డ్రింక్స్ జోలికి వెళ్ళకుండా, వీలైనంత వరకు నీళ్ళు లేదా అన్-స్వీటెండ్ టీ ఆర్డర్ చేయడం మంచిది.

​తప్పుడు పోషకాల సమాచారం..

అనేక రెస్టారెంట్లలో ఈ పోషకాల సమాచారం ఉండకపోవచ్చు. కానీ ఈమధ్య కొన్ని రెస్టారెంట్లలో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. వీరు చెప్పిన పోషకాల ఆధారంగా ఆహారాన్ని తీసుకుంటే, ఎటువంటి సమస్యలు తలెత్తకూడదు. కానీ, తెలీకుండా బరువు పెరగడం, జీవక్రియల సమస్యలు తలెత్తుతుంటాయి. దీనికి కారణం, ఈ రెస్టారెంట్ ఆహార పదార్ధాలలో చెబుతున్న కేలరీల సంఖ్య తప్పు. టైమ్ హెల్త్ ప్రకారం, రెస్టారెంట్ భోజనంలో తరచుగా 18శాతం ఎక్కువగా కేలరీలు ఉంటాయి. మీరు 500కేలరీలుగా జాబితా చేసిన భోజనం తింటే, మీరు 590 కేలరీలను గడించే అవకాశం ఉంది. ప్రతిరోజూ మీకు అవసరమైన కాలరీలకన్నా 90కేలరీలు అధికంగా తీసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం 9పౌండ్ల బరువు పెరుగుతుందని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. మీరు రెస్టారెంట్లలో ఇలా పోషక సమాచారాన్ని చూసినప్పుడు, జాబితా చేయబడిన కాలరీల సంఖ్యకన్నా 20శాతం అదనంగా లెక్కించడంద్వారా జాగ్రత్తపడవచ్చు

​రెస్టారెంట్ మెంటాలిటీ..

మీరు స్నేహితులతో భోజనం చేస్తున్నప్పుడు, మీకే తెలీకుండా 35 శాతం ఎక్కువగా తినే అవకాశం ఉంది. మాట్లాడుతూ తినడం కూడా ఇందుకు మరొక కారణం. కడుపు నిండిన విషయాన్ని కూడా మర్చిపోతుంటారు కొందరు.
పర్డ్యూ విశ్వవిద్యాలయం ప్రకారం, రెస్టారెంట్ మెంటాలిటీ నుండి బరువు పెరగకుండా ఉండేందుకు ఒంటరిగా, లేదా సాధ్యమైనంత తక్కువమందితో వెళ్ళడం మంచిదని సిఫారసు చేస్తుంది.