Politics

ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు

Amaravathi CRDA Cancelled By Jagan's Govt-Three Capitals Approved

సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుపై మంత్రివర్గం చర్చించింది. హైపవర్‌ కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది.

మొత్తం ఏడు అంశాల అజెండాగా మంత్రివర్గ సమావేశం కొనసాగింది. కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలివి..

> హైవపర్‌ కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం..

> పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుకు ఆమోదం

> పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి బిల్లుకు ఆమోదం

> సీఆర్‌డీఏ రద్దుకు కేబినెట్‌ ఆమోదం

> పులివెందుల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం

> ఏఎంఆర్డీఏ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం

> రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం

> ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు సంబంధించి లోకాయుక్త విచారణకు ఆమోదం

> రైతుల కూలీలకు ఇచ్చే పరిహారాన్ని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంపు

> రైతులకు 15 ఏళ్లపాటు కౌలు చెల్లించేందుకు నిర్ణయం

> రాజధాని ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలని నిర్ణయం

> హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం

> అమరావతిలోనే కొనసాగనున్న అసెంబ్లీ

> విశాఖ కేంద్రంగా సచివాలయం కార్యకలాపాలు

> రాష్ట్రాన్ని 4 పరిపాలన జోన్లులా విభజించాలని నిర్ణయం

> జిల్లాల విభజన తర్వాత సూపర్‌ కలెక్టరేట్ వ్యవస్థ ఏర్పాటు

> మంత్రులు రెండు చోట్లా అందుబాటులో ఉండాలని నిర్ణయం