Fashion

ఆ పసుపు రంగు గారపళ్లను ఇలా శుభ్రం చేయండి

How to clean teeth that are yellowish-Telugu fashion and beauty tips

కొందరికి ఎంత శ్భుత పాటించినా పళ్లు గార పట్టి ఉంటాయి. ఇక్కడ చెప్పుకునే ఇంటి చిట్కాలు పాటిస్తే .. కొంత ఉపయోగం ఉంటుంది. పళ్ళపై ఉన్న పసుపుపచ్చదనం తొలగిపోయి తెల్లగా, కాంతివంతంగా మెరుస్తాయి.
*కమలాతొక్కలు
పళ్ళపై ఉన్న గార తొలగిపోవడానికి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు తాజా కమలా తొక్కలతో పళ్ళపై రుద్దాలి. ఆ తరువాత శుభ్రంగా నీటితో పుక్కిలించడం వలన పళ్ళపై ఉన్న పసుపు పచ్చదనం తొలగిపోతుంది. ఒకవేళ కమలా తొక్కలు తాజాగా లేకపోతే ముందుగానే వీటిని పొడిగా చేసుకుని, రోజుకొకసారి వాడటం వల్ల పళ్ళు తెల్లగా, మెరుస్తాయి.
*బేకింగ్ సోడాతో
టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను బౌల్లోకి తీసుకుని, అందులో రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని టూత్పేస్ట్తో గానీ, బ్రష్పై వేసుకుని గానీ తోముకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తే చాలు.
*లెమన్
స్పూన్ నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలుపుకొని, ఈ మిశ్రమాన్ని పళ్ళపై రాసుకుని, కొన్ని నిముషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత మంచినీటితో పుక్కిలించడం వలన పసుపుపచ్చని పళ్ళు తెల్లగా వస్తాయి. రోజుకి ఒకటి, రెండుసార్లు రెండు వారాల పాటు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
*తులసి ఆకులు
కొన్ని తులసి ఆకులను ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. బ్రష్ లేదా చేతివేలితో తులసి పొడిని పచ్చని పళ్ళపై రాసుకుని, నీటితో బాగా పుక్కిలించాలి. దీనివలన పళ్ళపై ఉన్న గార తొలగిపోతుంది.
2. ఆస్తమా ఉంటే వీటిని అసలు తినొద్దు
ఆస్తమా బాధితులకు కలుషితమైన గాలి చాలా ప్రమాదకరం. ఉబ్బసం ఉన్నవారు ఎప్పుడూ కలుషిత ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండటానికి, వారు ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి. ఉబ్బసం ఆహారం ద్వారా కూడా ప్రేరేపితమవుతుంటుంది. అందువల్ల కొన్నిరకాల ఆహారాల జోలికి ఆస్తమా బాధితులు వెళ్లకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఉబ్బసం రోగులు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఐస్క్రీం, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు ఉబ్బసాన్ని రేకెత్తిస్తాయి. పాల ఉత్పత్తులను తింటే వీరికి దగ్గు, తుమ్ము సాధారణ సమస్యలు.గుడ్లు, సిట్రస్ పండ్లు, గోధుమలు, సోయా ఉత్పత్తులు ఉబ్బసం ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి వీరు ఈ ఆహారాలను వారి మెనూ నుండి తొలగించాలి.ఉబ్బసం బాధితులు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకుంటే, వాటిలోని సాస్లు, ఇతర పదార్థాలు అలర్జీని రేకెత్తిస్తాయి. కాబట్టి ఈ ఆహారాలు తినడం మానుకోవాలి. సులభంగా జీర్ణం కాని కాఫీ, టీ, సాస్, ఆల్కహాల్ పానీయాలు తీసుకుంటే, అవి ఉబ్బసాన్ని పెంచుతాయి. ఆస్తమా ఉన్నవారు ఫాస్ట్ ఫుడ్ తింటే అవస్థ రెట్టింపు అవుతుంది.
3.నిమ్మతో ప్రయోజనాలెన్నో..
నిమ్మ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. నిమ్మకాయని నిత్యం ఏదో ఒక రూపంలో వినియోగిస్తే అది ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసం తాగడం, మజ్జిగలో నిమ్మరసాన్ని కలుపుకోవడం, చికెన్, మటన్ వంటి స్పైసీ ఫుడ్స్లో టేస్ట్ కోసం నిమ్మకాయ రసాన్ని వాడడం తెలిసిందే. నిమ్మరసంలో ఐదు శాతం సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అది నిమ్మకాయకు ప్రత్యేకమైన రుచినిస్తుంది. ఇక విటమిన్ల వంటివాటి విషయానికొస్తే, విటమిన్ – సి, బి, క్యాల్షియం, పాస్ఫరస్, మెగ్నీషియం, ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్ నిమ్మకాయలో పుష్కలంగా ఉంటాయి. నిమ్మరసంతో మేని నిగారింపుతోపాటు, సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చేలా వివిధ రకాలైన ఉపయోగాలు న్నాయి. అజీర్ణంతో బాధపడేవారెవరైనా సరే కాస్త నిమ్మరసం గోరువెచ్చని నీటిలో కలుపుకుని, తాగితే అజీర్తి నుంచి ఉపశమనం పొందవచ్చు. పన్ను నొప్పితో బాధపడు తుంటే, నిమ్మరసంలో ముంచిన దూదిని నొప్పి పుట్టినచోట ఉంచితే, ఉపశమనం లభిస్తుంది. గుండెల్లో మంట, డయేరియా, బద్ధకంగా ఉండడం వంటి వాటికి నిమ్మరసం దివ్యౌషధం. నిమ్మకాయ సహజ సిద్ధమైన యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. నిమ్మరసాన్ని శరీరానికి పట్టించి, కాసేపటి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే శరీరంలో నిగారింపు వస్తుంది.