DailyDose

సీబీఐ కోర్టులో జగన్‌కు చుక్కెదురు-నేరవార్తలు

CBI Court Denies Jagan's Petition Today-Telugu Crime News Roundup

*అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్‌కు చుక్కెదురైంది. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు న్యాయస్థానం నిరాకరించింది. తన బదులు జగతి పబ్లికేషన్స్‌ ప్రతినిధి హాజరయ్యేందుకు జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
* వివాహితను గదిలో బంధించి అయిదురోజుల పాటు అత్యాచారం జరిపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. నెల 19న జరిగిన ఈ ఘటన గురించి శుక్రవారం ఉత్తరప్రదేశ్‌ పోలీసులు వివరాలు వెల్లడించారు.
* ఈ రెండు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ములుగు మండలం బండమైలారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. యువకులు ప్రయాణిస్తున్న బైక్‌ను వేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను కొక్కొండకు చెందిన కుమార్‌, స్వామిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని మల్కాజ్‌గిరి ఆనంద్‌బాగ్‌లోనూ రోడ్డుప్రమాదం జరిగింది.
* ఒడిశాలోని జైపుర్‌లో ఓ మదగజం ఇద్దరు ప్రాణాలు తీసింది. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచింది. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగు పంట పొలాలను నాశనం చేసింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకుల్ని పరుగులు పెట్టించి మరీ బలితీసుకుంది. గాయపడ్డ ఇరువురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు
*పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మియాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఓల్డ్ హఫీజ్ పేటలోని సాయినగర్ ప్రాంతానికి చెందిన జి.రమేశ్(20) స్థానికంగా పానీపూరి బండి నడుపుతున్నాడు. తనకు పెళ్లి కావడం లేదని కొన్ని రోజులుగా రమేశ్ బాధపడుతున్నాడు.
*చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వారాసిగూడలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్‌ విద్యార్థినిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. రాత్రి చదువుకునేందుకు భవనంపైకి వెళ్లిన బాలిక శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
*కీసర పోలీసు స్టేషన్‌ పరిధిలోని నాగారంలోని మమత వృద్ధాశ్రమంపై కేసు నమోదైంది. వృద్ధాశ్రమం పేరుతో మానసిక వికలాంగుల కేంద్రం నడుపుతున్నట్లు స్థానికులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇరుకైన గదుల్లో 73 మంది మానసిక వికలాంగులను ఉంచినట్లు పోలీసులు గుర్తించారు.
*రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఇంటి వద్ద ప్రమాదవశాత్తు ఓ సీఆర్పీఎఫ్‌ జవాను మృతి చెందారు. గుజరాత్‌కు చెందిన దేవ్‌దాన్‌ బకోత్రా సీఆర్పీఎఫ్‌ జవాన్‌. విధి నిర్వహణలో భాగంగా దేవ్‌దాన్‌కు అంబానీ ఇంటి వద్ద డ్యూటీ వేశారు.
*తమిళనాడు చెంగల్పేట్‌ జిల్లాలోని కలియపట్టాయి గ్రామంలో ప్రతిష్టించిన ద్రవిడ ఉద్యమ నేత పెరియార్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. ధ్వంసమైన పెరియార్‌ విగ్రహాన్ని చూసి గ్రామస్తులు షాక్‌ అయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కలియపట్టాయి గ్రామానికి చేరుకున్నారు. పెరియార్‌ విగ్రహం కుడి చేయి, ముఖాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
*సముద్రస్నానానికి వెళ్లిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు గల్లంతు కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తూర్పు గోదావరి జిల్లా తొండంగిలో ఈ విషాదం చోటు చేసుకుంది. తాటిపర్తి మణికంఠతాటిపర్తి శ్రీను అనే ఇద్దరు డిగ్రీ విద్యార్థులు నేడు సముద్ర స్నానానికి వెళ్లారు. సముద్ర స్నానం చేస్తుండగా ఇద్దరూ అకస్మాత్తుగా గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
*కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాగారంలో ఉన్న మమత వృద్ధాశ్రమంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వృద్ధాశ్రమం పేరుతో మానసిక వికలాంగుల కేంద్రం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
*చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వారాసిగూడలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్‌ విద్యార్థినిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. రాత్రి చదువుకునేందుకు భవనంపైకి వెళ్లిన బాలిక శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం… రెండంతస్తుల భవనంలో ఇంటర్ విద్యార్థిని, ఆమెతల్లి, సోదరుడు, సోదరితో కలిసి నివాసముంటోంది
*ఇరాక్‌లోని అల్‌-ఖైమ్‌ పట్టణంలో గురువారం వైమానిక దాడులు జరిగాయి. ఇరాన్‌ మద్దతు ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయమే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు కొన్ని అరబ్‌ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సిరియా సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో మూడు దఫాల దాడులు జరిగినట్లు సమాచారం. గుర్తు తెలియని విమానం నుంచి బాంబులు పడ్డట్లు అక్కడి నిర్వాహకులు తెలిపారు. ఇరాక్‌, సిరియాలో ఉన్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలే ఈ దాడులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ, వారు మాత్రం దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు.
*ముగ్గురు స్నేహితులను రోడ్డు ప్రమాదం కబళించిన విషాద సంఘటన గురువారం తెల్లవారుజామున గద్వాల సమీపంలో జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న చెరకు లోడ్ ట్రాక్టరును వీరి కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
*గొలుసుకట్టు పథకంలో మదుపు చేస్తే వంద రోజుల్లో రెండింతల ఆదాయాన్ని పొందొచ్చంటూ ప్రచారం నిర్వహిస్తూ మోసం చేస్తున్నారంటూ బాధితులు ‘ఈ-క్యాష్’ ట్రేడ్ సెక్యూరిటీ సంస్థపై సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. జె.శ్యామ్సుందర్, పి.వాసుదేవనాయుడులు రెడ్హిల్స్లో కొద్దినెలల క్రితం ఈ సంస్థను ప్రారంభించి తమతో పెట్టుబడులు పెట్టించుకున్నారని, మదుపు చేసిన మరుసటి రోజు నుంచి డబ్బు తీసుకోండి అంటూ చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
*ఉగ్రవాదులకు సాయం చేస్తూ దొరికిపోయిన జమ్మూకశ్మీర్ డీఎస్పీ దవీందర్ సహా నలుగురిని ప్రత్యేక న్యాయస్థానం ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. 15 రోజుల కస్టడీకి అనుమతించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సస్పెండైన డీఎస్పీతో పాటు ఇద్దరు ఉగ్రవాదులు, మరో ఇద్దరు అనుచరులను గురువారం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు.
*రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దానమ్మ దోపిడి ప్రాంతంలో ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ కావడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భయాందోళనకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు.
*రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దానమ్మ దోపిడి ప్రాంతంలో ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ కావడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భయాందోళనకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు.
*గుంటూరు జిల్లా మేడి కొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు, కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ క్యాబిన్లోని సీట్లోనే ఇరుక్కుపోవడంతో స్టీరింగ్ తొలగించి బయటకు తీశారు. గుంటూరు నుంచి మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు, సత్తెనపల్లి నుంచి గుంటూరు వెళ్తున్న కంటైనర్ పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
*తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం బొడ్డగండిలోని గిరిజన బాలికల వసతి గృహంలో ఓ విద్యార్థినిపై ఆ వసతి గృహం వార్డెన్ మడకం లక్ష్మణరావుదొర అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై డొంకరాయి పోలీస్స్టేషన్లో బాధితురాలు గురువారం ఫిర్యాదు చేసింది. తల్లి, సోదరుడితో కలిసి నివసిస్తున్న బాలిక స్థానిక గిరిజన బాలికల వసతి గృహంలో ఉంటూ అక్కడే చదువుకుంటోంది.
*ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తురకగూడేనికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు వడ్డెంపుల వెంకటేశ్ పాలు అనుకొని ఫినాయిల్ తాగి మృతి చెందాడు.