Agriculture

పాడిపశువుల ఎంపికలో తగు జాగ్రత్తలు

How to select cattle-Telugu agricultural news

పాడి పశువుల ఎంపికమేలు రకంపశువులతోనే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. పశువులు కొనేటప్పుడు ప్రధానంగా.. పాలదిగుబడి, శరీర లక్షణాలుపొదుగు వ్యవస్థను గమనించాలి. కొనే పశువు మన వాతావరణాన్ని తట్టుకుంటుందా,ఎన్ని ఈతలు ఈనింది వంటి విషయాలు అతిముఖ్యం. పశువులను వీలైనంత మేరకు పాడి రైతుల వద్దే కొనాలి. పశువు కాలి గిట్టలుదృఢంగా, ఆడ లక్షణాలు కలిగిఉండాలి. ఎటునుంచి చూసిన పశువు త్రికోణాకారంగా ఉండాలి. కళ్లు చురుకుగా ఉండాలి.పొదుగుపై పాలనరం బాగా కనిపించాలి. చేపు సమస్యలు ఉండకూడదు. ఈ లక్షణాలున్న పశువులనేఎంపిక చేసుకోవాలి. 2-6 వరకు పళ్లుండి, మూడో ఈత పశువులనుదూడతో సహా కొనుగోలు చేయాలి. అనువంశికంగా గర్భకోశ వ్యాధులున్న పశువులను కొనకూడదు.పశువుల కొనుగోలుకు 3 నెలల ముందుగానేపశుగ్రాసాలను సాగు చేయాలి. మార్కెట్లో డిమాండ్ ఆధారంగా గేదెలు లేదా ఆవులను కొనాలి.ఈ విషయంలో స్పష్టత లేకపోతే, పాల విక్రయంలోసమస్యలు ఎదురవుతాయి.సంతల్లో పశువులుకొనేటప్పుడు కనీసం మూడు రోజులు పాలు పిండి చూసిన తర్వాతే కొనాలి. సంతల్లో మోసాలుజరుగుతుంటాయి. చర్మ వ్యాధులు కనిపించకుండా నలుపురంగు పూస్తుంటారు. కొమ్ములు చెక్కితక్కువ వయసు పశువుగా కనిపించేలా చేస్తుంటారు. ఇలాంటి మోసాలకు లోనవకుండా ఉండేందుకునమ్మకమైన వ్యక్తుల దగ్గర గానీ అనుభవజ్ఞులు లేదా పశువైద్యుల పర్యవేక్షణలో గానీపశువులను కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన పశువులకు బీమా చేయించాలి. విటమిన్-ఎ,బెలామిల్ ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాతేలారీల్లో ఎక్కించాలి. రవాణా చేసిన పశువులకు మొదట ఎండుమేత పెట్టి,తర్వాత తాగు నీరందించాలి. దూడల పెంపకంలోమెలకువలు పాటించి తమవద్దే పశుసంతతిని పెంచుకుంటే పాడి లాభసాటిగా ఉంటుంది.