Food

అలసటకు విరుగుడు కీరా

Cucumber Scares Tiredness Away-Telugu Food And Diet News

కీరదోసలో 95 శాతం నీరే ఉంటుంది. దీన్ని రోజూ తీసుకుంటే శరీరం తాజాగా ఉంటుంది. పొటాషియం, విటమిన్‌-ఇ అధికంగా ఉండే కీరా.. వయసు కారణంగా ముఖంపై ఏర్పడే ముడతలను తగ్గిస్తుంది. దీంతో మరిన్ని ప్రయోజనాలు తెలుసుకుందామా!

* కీరాలో బ్లీచింగ్‌ లక్షణాలుంటాయి. దీని రసం టోనర్‌లా పనిచేస్తుంది. దీంతో తయారుచేసిన మంచు ముక్కలతో ముఖంపై మృదువుగా రుద్ది కాసేపటి తరువాత చల్లటి నీటితో కడిగేస్తే చాలు. చర్మంపై ఉండే నలుపుదనం తగ్గి ముఖం మెరుస్తుంది.

* ఈ ముక్కలను చక్రాల్లా కోసి కళ్ల మీద పెట్టుకుంటే అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది.

* ఎండ వల్ల చర్మం కందిపోయి నల్లగా మారుతుంది. ఇలాంటప్పుడు కీరా ముక్కలను ఆ మచ్చలపై పెడితే మార్పు కనిపిస్తుంది.

* ఈ రసంలో కాస్తంత టమాటా రసం కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పావుగంటాగి కడిగేస్తే చర్మరంధ్రాలు శుభ్రపడతాయి.

* దీని రసాన్ని జుట్టుకు పట్టించి అరగంట తరువాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే జుట్టుకు కావాల్సిన పోషణ లభిస్తుంది. జుట్టు పట్టులా మారుతుంది.