ScienceAndTech

విశాఖలో మెట్రో రైలు

Light Metro Rail Coming To Visakhapatnam

విశాఖపట్నంలో లైట్‌ మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 140 కి.మీ. మేర లైట్‌ మెట్రో, ట్రామ్‌ కారిడార్ల ఏర్పాటుకు డీపీఆర్‌ల తయారీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీపీఆర్‌ల తయారీకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రైట్స్‌, డీఎంఆర్సీ ముందుకొచ్చాయి. రెండు దశల్లో లైట్‌ మెట్రో కారిడార్‌, 3 కారిడార్లుగా ట్రామ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు లైట్‌ మెట్రో కారిడార్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. పాత పోస్టాఫీసు నుంచి ఆర్కే బీచ్‌-రుషికొండ మీదుగా భీమిలి బీచ్‌ వరకు.. అదే విధంగా అనకాపల్లి నుంచి స్టీల్‌ప్లాంట్‌ వరకు, ఎన్‌ఏడీ జంక్షన్‌ నుంచి పెందుర్తి వరకు ట్రామ్‌ కారిడార్లు నిర్మించాలని నిర్ణయించింది. దీనికోసం టెండర్లు పిలవడంపై అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ కార్యాచరణ సిద్ధం చేస్తోంది.