DailyDose

KPHB నందమూరి నగర్‌లో కార్డన్ సెర్చ్-నేరవార్తలు

Telugu Crime News Roundup Today - Police Search In KPHB

* కె.పి.హెచ్.బి. పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్ నగర్, నందమూరి నగర్లలో పోలీసుల‌ మంగళవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ డిసిపి వేంకటేశ్వర రావు అధ్వర్యంలో నిర్వహించిన ఈ నిర్భంధ తనిఖీలలో అడిషినల్ డిసిపి, కూకట్‌పల్లి ఏసిపి, 8 మంది ఇన్స్పెక్టర్లు, 25 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్ళతో కలిసి పోలీసులు 14 బృందాలుగా ఏర్పడి ఇంటింటికి తిరిగి తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఒక్కరి గుర్తింపు పత్రాలు, వాహానాల వివరాలు టిఎస్ కాప్ యాప్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా డిసిపి వేంకటేశ్వర రావు మాట్లాడుతూ ఈ తనిఖీలలో సరైన ధృవపత్రాలు లేని, ట్రాఫిక్ చలానాలు పెండింగ్ ఉన్న 55 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. టిఎస్ కాప్ యాప్ ద్వారా నేరస్తులతో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉన్న 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన అన్నారు.

* రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు నదిలో పడి 24 మంది దుర్మరణం చెందారు. బూండీలోని కోట లాల్‌సాత్‌ మెగా హైవేపై బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుక నిమిత్తం వరుడి కుటుంబం, బంధువులతో కోట నుంచి సవాయ్‌మాధోపూర్‌ వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి మేజ్‌ నదిలో బోల్తాపడింది. ఘటన సమయంలో బస్సులో 40 మందికి పైగా ఉన్నారు. ఇప్పటివరకు కనీసం 24 మంది మృతిచెందినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

  • నగ్నంగా నృత్యం చేయాలని బెదిరిస్తూ ఒక మహిళపై నలుగురు యువకులు దాడి చేసిన ఘటన హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏసీపీ అశోక్‌ చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో నివసించే ఓ మహిళ ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా పనిచేస్తోంది. పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అమీర్‌ అనే యువకుడు సదరు మహిళను సంప్రదించాడు. ఈనెల 22న రాత్రి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. రాత్రి వేడుకలు ముగిసిన తర్వాత మద్యం సేవించిన అమీర్‌, అతడి మిత్రులు సుల్తాన్‌, సలీమ్, రాజ్‌అలీ నగ్నంగా నృత్యం చేయాలంటూ మహిళను బలవంతపెట్టారు. ఆమె నిరాకరించటంతో కత్తులతో బెదిరించి గదితో బంధించారు. నృత్యం చేయాల్సిందేనంటూ ఆమెపై దాడి చేశారు. రాత్రంతా గదిలోనే ఉన్న సదరు మహిళ 23వ తేదీన తన భర్తతో కలిసి రాజేంద్రనగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు యువకులు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

* జమ్మూకశ్మీర్ ప్రాంతంలోని జైషే మహ్మద్ ఉగ్రవాదులు, వారితో సంబంధాలున్న వారి ఇళ్లపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు, జమ్మూకశ్మీర్ పోలీసులు బుధవారం మూకుమ్మడి దాడులు చేశారు. పుల్వామా జిల్లాలో బుధవారం ఉదయం జైషే మహ్మద్ టాప్ కమాండర్ జాహిద్ షేక్ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. కాకపోరా, క్వాస్ బయర్, పుల్వామా ప్రాంతాల్లో జైషే ఉగ్రవాదులతో సంబంధాలున్న వారి ఇళ్లపై దాడులు చేసి తనిఖీలు చేశారు. దక్షిణ కశ్మీర్ లో దాడులు కొనసాగుతున్నాయి.

* పెళ్లికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఓ యువతి తనకు సన్నిహితుడైన వ్యక్తిని హత్య చేసిన ఘటన కడప చిన్నచౌకు ఠాణా పరిధిలో జరిగింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. దీంతో హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో నిందితురాలికి ఇంకా ఎవరైనా సహకరించి ఉంటే వారిపైనా కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. పోలీసుల వివరాల మేరకు.. కడప జిల్లా సిద్దవటం మండలం టక్కోలి గ్రామ హరిజనవాడకు చెందిన సాల శ్రీనివాసులు (29)కు అదే ప్రాంతానికి చెందిన సుమతితో రెండున్నరేళ్ల కిందట వివాహమైంది. శ్రీనివాసులు కడప అప్సర కూడలి వద్ద ఉన్న ఓ నర్సింగ్‌ హోంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. వీరికి 11 నెలల కొడుకు ఉన్నాడు. అదే నర్సింగ్‌ హోంలో యువతితో శ్రీనివాసులుకు వివాహేతర సంబంధం ఉంది. ఆమె వేరే వ్యక్తులతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుందని అప్పుడప్పుడు వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగేది. అయిదు రోజుల కిందట ఆమెకు కడపకు చెందిన ఓ అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఘర్షణలు మరింత ఎక్కువయ్యాయి. వేరే వారిని పెళ్లి చేసుకుంటే చచ్చిపోతానంటూ శ్రీనివాసులు ఆమెను భయపెట్టేవాడు. సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీనివాసులు విధులకు వచ్చాడు. రాత్రి వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. నన్ను కాదని వేరే వారిని పెళ్లి చేసుకుంటే ఉరేసుకుని చనిపోతానంటూ ఆమెను భయపెట్టాడు. ఎక్కడ తన పెళ్లికి అడ్డు వస్తాడనే భయంతో ఆ యువతి శ్రీనివాసులు మెడకు చీర బిగించి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని యత్నించింది. మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టి వారి బంధువులకు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఆసుపత్రి వర్గాలు ఫోన్‌ చేసి శ్రీనివాసులు ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. హుటాహుటిన అతని భార్యా, తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. శ్రీనివాసులు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని బంధువులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సై రోషన్‌ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు శ్రీనివాసులు ఆత్మహత్యపై అనుమానం రావడంతో విభిన్న కోణాల్లో పరిశీలించి హత్యగా తేల్చారు. రాత్రి 12.30 నుంచి 2 గంటల వరకు సీసీ కెమెరాలు ఆఫ్‌ చేయడంతో ఈ మధ్య సమయంలోనే హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతుని భార్య సుమతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుజనపై హత్య కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

* ముగ్గురిని చట్ట వ్యతిరేకంగా పోలీసులు నిర్బంధించడంపై సిబిఐ దర్యాప్తు జరపాలని హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. గుంటూరు ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి సమర్పించిన రిపోర్టును పరిశీలించిన తర్వాత మంగళవారం న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌, జస్టిస్‌ డి.రమేష్‌ల డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలిచ్చింది. తమ భర్తలు ఎన్‌.ఆదినారాయణ, ఆర్‌.శ్రీనివాసరావు, టి.శ్రీనివాసరావులు 2019 అక్టోబర్‌ 14 నుంచి కనిపించడం లేదని వారి భార్యలు సునీత, నాగలక్ష్మీ, విజయలక్ష్మీ గతేడాది హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. తాము గుంటూరులోని పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు అర్బన్‌ ఎస్‌పికి వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేకపోయిందన్నారు. పిటిషన్‌లో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, గుంటూరు అర్బన్‌ ఎస్‌పి, గుంటూరు సిసిఎస్‌ డిఎస్‌పిలను ప్రతివాదులుగా చేయడమే కాకుండా, సిసిఎస్‌ సిఐ వెంకటరావుపై ఆరోపణలతో వ్యక్తిగత హొదాలో ప్రతివాదిగా చేశారు. ఆ ముగ్గురిపై క్రికెట్‌ బెట్టింగ్‌ కింద చేబ్రోలు పోలీసులు కేసులు పెట్టి కింది కోర్టులో హాజరుపర్చారు. ఆ సమయంలో ఆ ముగ్గురూ ఇచ్చిన వాంగ్మూలాలను వారి భార్యలు హైకోర్టుకు సమర్పించారు.

* పోలీస్ వాహనం డీ కొట్టి ఇద్దరు దంపతులు మృతి కి కారణం అని వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారి పై మృతదేహాల తో ఆందోళన చేపట్టారు బందువులు..వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమల యపెళ్ళి గ్రామ శివారు లో బైక్ పై కొండూరు కు వెళ్తున్న నందనం రాంనగర్ కు చెందిన బొమ్మకంటి రాజు – రాణి దంపతులు అతివేగం తో ఎదురుగా వచ్చిన పాలకుర్తి సి ఐ రమేష్ నాయక్ వాహనం డీ కొట్టి మృతి చెందటంతో న్యాయం చేయాల్సిన పోలీసులు తమకు అన్యాయం చేశారని మృతుల బంధువులు వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారి పై ఆందోళన చేపట్టారు..సుమారు రెండు గంటల నుండి భారీ సంఖ్య లో మృతుల బందువులు ట్రాక్టర్ పై మృతదేహాలను ఉంచి ఆందోళన చేపట్టారు..దీంతో పోలీసులు వర్ధన్నపేట డివిజన్ పరిదిలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాధితులను ఆందోళన విరమించెల ప్రయత్నించారు.

* కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని గౌరారం గ్రామంలో సౌందర్య( 18 ) రోజు మాదిరిగానే సోమవారం సాయంత్రం తన పూరిగుడిసెలో దీపం వెలిగించేందుకు వెళ్ళింది ప్రమాదవశాత్తు . గుడిసె కు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో యువతి మంటల్లో చిక్కుకుంది సమయానికి అందుబాటులో ఎవరూ లేకపోవడంతో యువతి సజీవ దహనమైంది వివరాల్లోకి వెళితే యువతి తల్లిదండ్రులది నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి పేట తల్లిదండ్రులు గొడవపడి విడి పోయినట్లు గ్రామస్తులు తెలిపారు ప్రస్తుతం యువతి తన అమ్మమ్మ తో కలిసి ఉంటుంది ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మృతురాలి మేనమామ రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు సంఘటన జరిగిందా అనే కోణంలో విచారణ చేయనున్నట్లు తెలిపారు

* రాజధానికి సంబంధించిన అన్ని పిటిషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లు, కర్నూలుకు కార్యాలయాల తరలింపు పిటిషన్లపై విచారణను వచ్చే నెల 30కి వాయిదా వేసింది. జీఎన్‌ రావు, బోస్టన్‌ కమిటీ నివేదికలను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై దాఖలైన పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30గంటలకు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

* ఏలేశ్వరపు వాసుదేవ శర్మ అనే వ్యక్తి మృతి.. పద్మారావు, రాజు అనే ఇద్దరికి తీవ్రగాయాలు. క్షతగాత్రులకు ఈ.ఎస్.ఐ ఆసుపత్రిలో చికిత్స.