Movies

సోనాక్షి వెబ్ షో

Sonakshi Sinha New Web Show

సినిమాలు, టీవీ షోలతో పాటు డిజిటల్‌ మీడియావైపు కూడా ఆసక్తిగా అడుగులు వేస్తున్నారు సినిమా తారలు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు క్రేజ్‌ పెరుగుతుండటంతో అగ్ర నటులు కూడా వెబ్‌ షోలు చేస్తున్నారు. ఇప్పుడొస్తున్న చాలా సినిమాల కంటే వెబ్‌ షోలు బాగుంటున్నాయి అంటోంది బాలీవుడ్‌ నాయిక సోనాక్షి సిన్హా. ఆమె కూడా ఓ వెబ్‌ షోలో నటిస్తోంది. ‘‘కళంక్‌’, ‘ఖాన్‌దాని సఫాఖానా’, ‘మిషన్‌ మంగళ్‌’, ‘దబంగ్‌ 3’…ఇలా గత ఏడాది నాలుగు భారీ చిత్రాల్లో నటించాను. వాటికి భిన్నంగా ఏదైనా కొత్తగా చేయాలి అనిపించింది. అప్పుడే రీమా కగ్తీ ఓ కథ వినిపించారు. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. అందుకే ఈ వెబ్‌ షో చేస్తున్నాను. వెబ్‌ షోలు కూడా ఎక్కువగానే చూస్తుంటాను. మాధ్యమం ఏదైనా నేను పోషించే పాత్ర నాకు సవాల్‌ విసిరేలా ఉండాలి. అలాంటి అవకాశం ఈ వెబ్‌ షోతోవచ్చింది. సినిమాల్లో నటిస్తూనే డిజిటల్‌ మీడియాలోనూ సత్తా చాటాలనుకుంటున్నాను’’అంటోంది సోనాక్షి.