ScienceAndTech

వాట్సాప్ డార్క్ మోడ్ వచ్చేసింది

WhatsApp Dark Mode Is Here

ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌తో ముందుకు రానుంది. యూజర్ల భద్రత, గోప్యతలను పరిరక్షించే చర్యల్లో భాగంగా ఈ ఫీచర్‌ను జోడిస్తోంది. ఇకపై వాట్సాప్‌ యూజర్లు పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం ద్వారా తమ చాట్‌ బ్యాకప్స్‌ను కాపాడుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. పాస్‌వర్డ్‌ ప్రొటెక్ట్‌ బ్యాకప్స్‌ అనే ఫీచర్‌ పేరుతో న్యూ అప్‌డేట్‌ ఉంటుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించింది. బీటా యూజర్లకే నూతన ఫీచర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఒక ఫోన్‌ నుంచి మరో ఫోన్‌కు మారిన క్రమంలో వాట్సాప్‌ చాట్స్‌ను కలిగిఉండటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆండ్రాయిడ్‌ యూజర్లు మాత్రం తమ చాట్‌ బ్యాకప్‌ను ఎన్‌క్రిప్టెడ్‌ ఫామ్‌లో సేవ్‌ చేసుకోగలుగుతున్నారు. ఇక ఎన్నాళ్లుగానో వేచిచూస్తున్న డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను యూజర్లందరికీ వాట్సాప్‌ మంగళవారం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక యూజర్లు ఇప్పుడు తమ ఆండ్రాయిడ్‌ 10, ఐఓఎస్‌ 13 ఫోన్లలో డార్క్‌ మోడ్‌ ఆప్షన్‌కు మళ్లబగానే ఆటోమేటిక్‌గా డార్క్‌ మోడ్‌ థీమ్‌ ఆన్‌ అవుతుంది. గత కొంతకాలంగా వాట్సాప్‌ పరీక్షిస్తున్న ఈ ఫీచర్‌ తాజాగా యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది.