Movies

బాలీవుడ్ బాద్‌షా అమీర్‌ఖాన్-TNI ప్రత్యేకం

Special Focus On Life Story Of Aamir Khan

ఆమిర్ ఖాన్ (జననం 14 మార్చి 1965) ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత. భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటునిగా కూడా ఆయన ప్రసిద్ధుడు. ఆమిర్ అసలు పేరు మహమద్ ఆమిర్ హుస్సేన్ ఖాన్. ఆయన నాలుగు జాతీయ పురస్కారలతో పాటు ఏడు ఫిలింఫేర్ పురస్కారాలు కూడా అందుకున్నారు. భారత ప్రభుత్వం 2003లో పద్మశ్రీ, 2010లో పద్మ భూషన్ పురస్కారాలతో ఆయనను గౌరవించింది.పెద్దనాన్న నాసిర్ హుస్సేన్ తీసిన యాదోంకీ బారాత్(1973) చిత్రంలో చిన్నపాత్రలో మొదటిసారి నటించారు ఆమిర్. ఆ తరువాత హోలీ సినిమాలో నటించిన ఆయన హీరోగా ఖయామత్ సే ఖయామత తక్(1988) సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలోనూ, ఆ తరువాత చేసిన రాఖ్(1989) సినిమాలోనూ ఆయన నటనకు జాతీయ పురస్కారాల ఫంక్షన్ లో ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. 1990వ దశకంలో ఆయన నటించిన దిల్(1990), రాజా హిందుస్థానీ(1996), సర్ఫరోష్(1994) వంటి సినిమాలతో బాలీవుడ్ సినీరంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సర్ఫరోష్ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు ఆమిర్. కెనెడా-భారత్ కు చెందిన చిత్రం ఎర్త్(1998) సినిమాలో ఆమిర్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.2001లో ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ కంపెనీ అనే నిర్మాణ సంస్థను స్థాపించి మొదటి సినిమాగా లగాన్ ను నిర్మించి, అందులో హీరోగా నటించారు ఆమిర్. ఆ సినిమా ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ పురస్కారం, జాతీయ ఉత్తమ పాపులర్ చిత్రం పురస్కారం అందుకొంది. ఆ తరువాత 4 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న ఆమిర్ 2006లో ఫనా, రంగ్ దే బసంతీ వంటి సినిమాలతో తిరిగి విజయం అందుకున్నారు ఆయన. ఆ తరువాతి సంవత్సరం తారే జమీన్ పర్ చిత్రంతో దర్శకుడిగా కూడా మారారు ఆమిర్. ఈ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం పురస్కారాలు కూడా వచ్చాయి. ఘజిని(2008), 3 ఇడియట్స్(2009), ధూమ్ 3(2013), పికె(2014) వంటి సినిమాలతో కమర్షియల్ గానే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు ఆమిర్. పికె ఆయన కెరీర్ లోనే అతిఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచిం