Fashion

గారపళ్లకు వంటసోడాతో మెరుపు

Telugu fashion and beauty tips-How to whiten stained teeth

సాధారణంగా తినే సోడాను వంటల్లో వాడుతుంటాం. వంటల్లోనే కాకుండా సోడాతో ఎన్ని లాభాలున్నాయో చూద్దాం.. 1. అద్దాలపైన పడిన నీటి మరకలను తొలగించాలంటే… వంటసోడాలో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి దూదితో అద్దాన్ని తుడవాలి. తరువాత పొడి వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. 2. ఆమ్లెట్ ఉబ్బినట్లుగా రావాలంటే గుడ్డుసొనలో చిటికెడు వంటసోడా కలపాలి. కేక్ తయారీలోనూ ఉపయోగించవచ్చు. 3. బకెట్ నీళ్లలో చెంచా వంటసోడా వేసుకుని స్నానం చేస్తే చర్మ సమస్యలు దూరమవుతాయి. 4. ఫ్లవర్‌వాజ్‌లో పూలు ఎక్కువ రోజులు తాజాగా వుండాలంటే నీళ్లల్లో చిటికెడు వంటసోడా కలపాలి. -సాక్సుల దుర్వాసన దూరం చెయ్యాలంటే వంటసోడా కలిపిన నీటిలో వాటిని నానబెట్టి, ఉతకాలి. 5. చెక్క ఫర్నిచర్‌పై పడిన పదార్థాల మరకలు పోగొట్టాలంటే… ఒక మగ్గు నీటిలో చెంచా వంటసోడా వేసి, మరకలు పడిన చోట ఈ నీటితో తుడిస్తే సరిపోతుంది. చెమట వాసన రాకూడదంటే నీటిలో పావు చెంచా వంటసోడా కలిపి చల్లుకోండి. 6. దంతాలు పచ్చగా ఉంటే టూత్ పేస్ట్‌పై చిటికెడు వంటసోడా వేసుకుని శుభ్రం చేసుకుంటే దంతాలు మెరుస్తాయి. గ్లాసు నీటిలో రెండు చెంచాల వంటసోడా కలిపి పుక్కిలిస్తే, నోరు రోజంతా తాజాగా వుంటుంది.