Health

ఏపీలో 10 కేసులు మాత్రమే ఉండటం మన అదృష్టం-TNI కథనాలు

TNILIVE Special Coverage On COVID19-YS Jagan Review Meet

* 10 పాజిటివ్ కేసులు మాత్రమే ఉండటం మన అదృష్టం అనుకోవాలి.ఏపీకి వచ్చిన ఫారెన్ రిటర్న్స్ 27,819 మంది ఉన్నారువారిని ట్రాక్ చేసి వారిపై నిఘా కూడా ఉంచాం.4 చోట్ల క్రిటికల్ కేర్ హాస్పటళ్లుప్రతి జిల్లాలో 200 బెడ్స్ ఏర్పాటు చేసాంప్రతి నియోజకవర్గంలో 100 పడకలు క్వారంటైన్ కోసం అందుబాటులో ఉన్నాయి.213 వెంటిలేటర్లు సిద్ధం చేసాం.80.9% ఇళ్లలో ఉండటం వల్లే కరోనాను ఎదుర్కోవచ్చు.14% మాత్రమే ఆసుప్రతికి వెళ్లాల్సిన కండిషన్ ఉంటుంది.4.8% ఐసీయూ దాకా వెళ్లే అవసరం వస్తుంది.104 హెల్ప్ లైన్ ద్వారా ఆరోగ్య సమస్యలు ఏమొచ్చినా వెంటనే సంప్రదించవచ్చు1902 హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా సహాయం కోరవచ్చువాలంటీర్లు, ఆశావర్కర్లు, ఎఎన్‌ఎమ్‌లు, హెల్త్ అసిస్టెంట్లు, డాక్లర్లు మీకు అందుబాటులో ఉన్నారు.ప్రతిజిల్లాలో డిస్టిక్ కంట్రోల్ రూమ్, ముగ్గురు మంత్రులు, సీఎంఓ, ఇతర శాఖల అధికారులు, కలెక్టర్లతో కలిసి స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం.ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రజలందరినీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.భోజనం, వసతులకు సంబంధించి ఏ సమస్య ఉన్నా 1902కి కాల్ చేస్తేయ్ మీకు సహాయంఅందుతుందినిత్యావసరాలన్నీ సమృద్ధిగా ఉన్నాయి. దానిగురించి భయపడి ఎక్కువ కొనాల్సిన అవసరం లేదు.ప్రతి రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను చూసి తగినంత రైతు బజార్లు అందుబాటులో ఉంచుతాం.గ్రామాలలో రైతులు, రైతు కూలీలు పొలం పనులు తప్పవు కనుక పని చేసేటప్పుడు దూరం పాటించండి.గ్రామాల్లో పారిశుధ్యం విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోమని పంచాయితీ రాజ్ శాఖను ఆదేశించాంఉచితంగా రేషన్, ఒక కేజీ కందిపప్పుతో పాటు 1000 రూపాయిలు అందిస్తాం.ప్రభుత్వం తరఫునుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలుంటాయి.వైద్యసిబ్బంది, వాలంటీర్లు, మున్సిపల్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, పోలీసు శాఖ తమ ప్రాణాలు పణంగా పెట్టి, మన వద్దకు వచ్చి సహాయం అందిస్తున్నారు. దాన్ని మనమంతా గుర్తించాలి. వారికి మనఃస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను.ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నేను చేస్తున్న వ్యక్తిగత విజ్ఞాపన ఏమిటంటే ఎక్కడివారక్కడే ఉండాలి.

* కోవిడ్ 19 నివారణ కోసం ఏపీ సర్కార్ కోవిడ్ 19 రెగ్యులేషన్స్ 2020 చట్టం అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. కోవిడ్ అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని వైద్యం చేయించే అధికారం ప్రభుత్వ అధికారులకు కల్పించింది. కోవిడ్ 19 రిపోర్టు అయిన గ్రామం, పట్టణం, వార్డు, కాలనీ పరిధిలో సంబంధిత అధికారికి అధికారాలు కట్టబెడుతూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోవిడ్ 19 లోకల్ ట్రాన్స్ మిషన్ జరిగితే దాని నుంచి బయటపడేందుకు ప్రైవేటు ఆస్పత్రులను సైతం ఐసోలేషన్ వార్డులుగా మార్చే అధికారం కల్పించారు. రిటైర్డ్‌ వైద్యులు, నర్సులు, ప్రైవేటు వైద్యులు అవసరాన్నిబట్టి విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు సంవత్సరకాలం పాటు అమలులో ఉండనున్నాయి.

* #ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ హాస్పటల్స్ యాజమాన్యాల్ని, సిబ్బందిని ఎందుకు వాడటం లేదు? ఆరోగ్యశ్రీ ద్వారా కోట్లు కట్టబెట్టట మేనా?#కరోనా నిర్మూలనలో “కార్పొరేట్” భాగస్వామ్యమేది?-ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఏమయ్యాయి?-వైద్యం లో నెంబర్ 1 లు ఎటు పోయారు..?#ఆంధ్రప్రదేశ్_తెలంగాణలలో కరోనా వైరస్ వ్యాపించిన నాటి నుండి ప్రైవేట్ హాస్పటల్స్ తలుపులు మూత పడ్డాయి.కేవలం ప్రభుత్వ వైద్య సిబ్బంది మాత్రమే సేవ చేయాలా..?మన తెలుగు రాష్ట్రం లలో ఉన్న పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు వ్యవస్థ సిగ్గుతో నిద్ర పోతుందా?ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏం చేస్తున్నాయి?మేమే నెంబర్ వన్ అని టీవీ లు, హోర్డింగ్లు, పత్రికలలో ప్రకటనలు ఇచ్చుకునే ఆసుపత్రులు, వాటి ఎంట్రన్స్ లకు ఎందుకు రెడ్ రిబ్బెన్ తగిలించాయి..?అమాయక జనం నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్న ఈ కార్పొరేట్ ఆసుపత్రులు, ఎందుకు సామాజిక స్పృహ కోల్పోయి, సామాజిక బాధ్యతను మరచి పోయాయి..?నేడు దేశం అత్యంత ప్రమాదకరమైన వైరస్ బారిన పడి, క్లిష్ట పరిస్థితిలో ఉంటే, ప్రభుత్వ వైద్య రంగానికి కనీసం సాయం చేయాలనే సోయి లేదా? ఈ కార్పొరేట్ ఆసుపత్రులకు..నేడు దేశం మరియు రాష్ట్రం లలో లాక్ డౌన్ నిబంధన విధించిన మాదిరిగా ప్రభుత్వం చొరవ తీసుకుని..కార్పొరేట్ మరియు ప్రైవేటు ఆసుపత్రులను కూడా ఛోవీడ్-19 నియంత్రణ విధి నిర్వహణలో భాగస్వాములుగా చేస్తూ కఠినమైన ఉత్తర్వులు తక్షణమే జారీ చేయాలి.కార్పొరేట్ మరియు ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం దయచేసి ఇప్పటికైనా కళ్లు తెరిచి, మేమున్నామంటూ సామాన్యులకు సైతం ధైర్యం కల్పించి విధి నిర్వహణలో పాత్రులు కండి.మహమ్మారి వైరస్ ను తరిమి కొట్టండి.ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించండి.ప్రజలారా..కార్పొరేట్ మరియు ప్రైవేటు వైద్య సిబ్బందిని ప్రశ్నించండి, విధి నిర్వహణలో వారిని భాగస్వాములు చేయండి.

* ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ వ్యాప్థి నేపథ్యంలో పాఠశాలలు మూత పడటంతో.. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకూ వార్షిక పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపించాలని నిర్ణయించింది. ఈమేరకు పాఠశాల విద్యా శాఖను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ ప్రకటించారు.

* కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నప్పటికీ దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కరోనా వివరాలతో కూడిన బులెటిన్ ను కాసేపటి క్రితం ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. తాజా అప్ డేట్స్ ఏమిటంటే..?ఇప్పటి వరకు విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారి సంఖ్య 26,942.వారిలో 25,942 మందిని హోం ఐసొలేషన్ లో ఉంచాం.కరోనా అనుమానిత లక్షణాలతో ప్రస్తుతం 117 మందికి చికిత్స అందిస్తున్నాం.ఇప్పటి వరకు 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.289 మందికి కరోనా నెగెటివ్ వచ్చింది.ఇంకా 33 మంది శాంపిల్స్ నివేదిక రావాల్సి ఉంది.కరోనా అనుమానాల నివృత్తి కోసం 104 టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేశాం.

* కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసేందుకు వైద్యులు కొత్తగా రోబోలను రంగంలోకి దించారు. జైపూర్ నగరంలో సవాయ్ మాన్‌సింగ్ ఆసుప్రతిలో ని కరోనా వైరస్ పాజిటివ్ రోగులకు చికిత్స చేసేందుకు ఉద్దేశించిన ఐసోలేషన్ వార్డులో వైద్యసేవలు అందించేందుకు రోబోట్ లను రంగంలోకి దించామని ఆసుపత్రి డాక్టర్ డీఎస్ మీనా చెప్పారు. జోద్‌పూర్ నగరానికి చెందిన ఓ వ్యక్తి తయారు చేసిన ఈ నర్సింగ్ రోబోలను ఎలాంటి చార్జీలు తీసుకోకుండా పనిచేసేందుకు ఆసుపత్రిలో ప్రవేశపెట్టారని డాక్టర్ మీనా పేర్కొన్నారు.

* ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ ను జాతీయ విపత్తు గా ప్రకటించింది : ఎపి డిజిపిఎక్కడివారు..అక్కడే ఉండాల్సింది గా..కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రతిఒక్కరు సహకరించాలని దేశ ప్రధాని,ముఖ్యమంత్రి చేతులు జోడించి ప్రజలందరిని కోరారు : ఎపి డిజిపిఇది ఇలా ఉండగా నిన్నటి నుండి కొందరు నిబంధనలకు విరుద్దంగా ఆంధ్ర ప్రదేశ్ లోనికి రావడానికి ప్రయత్నిస్తూ సరిహద్దు తనిఖీ కేంద్రాల దగ్గరకు వచ్చి ఉన్నారుఅయితే అట్టి వ్యక్తులను నిబంధనలకు విరుద్దంగా రాష్ట్రంలోనికి అనుమతించేది లేదు:ఎపి డిజిపిబోర్డర్ వద్దకు వచ్చిన వారికి నిబంధనల మేరకు కచ్చితంగా రెండు వారాలపాటు క్యారంటైన్ నిర్వహించిన తరువాతే రాష్ట్రం లోకి అనుమతిస్తాము. ఎపి డిజిపిలాక్ అవుట్ ఉదేశ్యం ఒక మనిషి నుండి మరొక మనిషికి,ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి అంటు వ్యాధి సంక్రమించకండా ఉండేలాగా చేయడమే. ఎపి డిజిపిబయట ప్రాంతాల నుండి ఆంధ్ర ప్రదేశ్ లోనికి అనుమతిచడం మన లాక్ అవుట్ ఉద్దేశ్యాన్ని నీరు గార్చటమే : ఎపి డిజిపిదయచేసి అట్టి వ్యక్తులు ఆర్థం చేసుకోగలరని మనవి. ఎపి డిజిపి

* ఎట్టకేలకు వెనుదిరిగిన విద్యార్థులు, ప్రయాణికులుకృష్ణా జిల్లా జగ్గయ్యపేట గరికపాడు చెక్ పోస్టు వద్ద పడిగాపులు కాసిన విద్యార్థులు ప్రయాణికులను ఎట్టకేలకు వెనక్కు పంపిన ఆంధ్రా పోలీసులు..ఆంధ్రాలోకి రావాలంటే నూజివీడు ఐఐఐటీలో 14 రోజులు ఉండాలన్న అధికారుల ఆంక్షలతో వెనుదిరిగిన కొందరు విద్యార్థులు, ప్రయాణికులు…విద్యార్థులకు నచ్చజెప్పిన విజయవాడ సబ్ కలెక్టర్సుమారు 100మంది విద్యార్థులు ఐఐఐటీ లో ఉండేందుకు అంగీకారం…కర్ఫ్యూ కారణంగా ఇకపై ఎవ్వరూ హైదరాబాద్ నుండి రావద్దని పోలీసులు ఆదేశం…తిరుగు హైదరాబాద్ వెళ్లేందుకు కొందరికి వాహనాలు లేక పోవడంతో చెక్ పోస్టు వద్ద పడిగాపులు.

* జగ్గయ్యపేట వద్ద హైదరాబాద్‌ నుంచి వచ్చి వేచిచూస్తున్న వారికి రాష్ట్రంలోకి అనుమతిప్రత్యేక బస్సుల ద్వారా హెల్త్‌ప్రోటో కాల్‌ కోసం వారిని తరలిస్తున్న అధికారులువారిని వైద్య పరీక్షలకోసం క్వారంటైన్‌ చేస్తున్న అధికారులుపగడ్బందీగా హెల్త్‌ ప్రోటోకాల్‌ను పాటిస్తున్న అధికారులుగుంటూరు, కృష్ణా జిల్లాల వారిని నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి తరలిస్తున్న అధికారులుఈస్ట్‌ గోదావరి వారిని రాజమండ్రి క్వారంటైన్‌కు తరలిస్తున్న అధికారులువెస్ట్‌గోదావరి తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్లకు తరలిస్తున్న అధికారులువీరికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఫలితాల ఆధారంగా స్వస్థలాలకు పంపాలని నిర్ణయం.

* ఏపీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులో తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ వైపుకు వచ్చే అన్ని వాహనాలు అడ్డుకున్న పోలిసులుగుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పోందుగుల వద్ద రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద. ఉద్రిక్తతతెలంగాణ రాష్ట్రం మాకు ణోఛ్ జారీ చేసింది అందువల్ల మా స్వగ్రామలకు వెళ్ళడాని మేము వస్తే అనుమతించటం లేదురాత్రి నుండి నిద్ర ఆహారం కనీసం త్రాగడానికి నీరు కూడా లేకుండా ఇబ్బంది పడ్డుతున్నాముగుంపులు గుంపులుగా జనం ఇక్కడ ఉంటే ఒక్కరికీ కరోనా వైరస్ ఉన్న అందరికీ వస్తుంది ,ణోఛ్ ఉంది కనుక క్వరంటైన్ చేసి అనుమతి ఇవ్వలి అని వెడుకోటున్న ప్రయాణికులు.

* ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తమకు చేతనైన సహాయాన్ని అందిస్తున్నారు.పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు, ప్రధానమంత్రి సహాయనిధికి భారీ విరాళం ప్రకటించారు.కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ఏపీ, తెలంగాణ సీఎం సహాయ నిధులకు రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయల విరాళం అందిస్తాను.అలాగే భారత ప్రధాన మంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందిస్తానని పవన్ ట్విటర్ ద్వారా తెలిపారు.ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తివంతమైన నాయకత్వం కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడుతుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

* కరోనా వైరస్​ పాజిటివ్​ కేసుల వివరాలుదేశంలో ఇప్పటివరకు 649కి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.మహారాష్ట్రలో 124, కేరళలో 118 కరోనా పాజిటివ్‌ కేసులుతెలంగాణ, కర్ణాటకలో 41 మంది చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులుగుజరాత్‌, రాజస్థాన్‌లో 38 మంది చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులుఉత్తరప్రదేశ్‌లో 37, దిల్లీలో 35, పంజాబ్‌లో 33 కరోనా పాజిటవ్‌ కేసులుహరియాణా 30తమిళనాడు 26మధ్యప్రదేశ్‌ 15లద్దాఖ్‌ 13ఏపీ 11జమ్ముకశ్మీర్‌ 11బంగాల్‌ 9చండీగఢ్‌ 7ఉత్తరాఖండ్‌ 5బిహార్‌ 3ఛత్తీస్‌గఢ్‌ 3హిమాచల్‌ ప్రదేశ్‌ 3గోవా 3ఒడిశా 2పుదుచ్చేరి 1మిజోరాం 1మణిపూర్‌ 1

* తెలంగాణలో ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్‌తెలంగాణలో తాజాగా మరో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది.?? కుత్బుల్లాపూర్‌కి చెందిన 49 ఏళ్ల వ్యక్తితో పాటు దోమలగూడలో భార్యాభర్తలైన ఇద్దరు వైద్యుల నమూనాలు పరీక్షించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.?? కుత్బుల్లాపూర్‌కి చెందిన వ్యక్తి ఇటీవల దిల్లీ నుంచి రాగా.. కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఉండటం వల్లే ఆయనకూ పాజిటివ్‌ వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.?? దోమలగూడలో 43 ఏళ్ల వైద్యుడి నుంచి వైద్యురాలిగా ఉన్న ఆయన భార్యకూ వైరస్‌ సోకింది.?? తాజా కేసులతో కలిపి తెలంగాణలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 44కి చేరుకుంది.

* కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు దేశంలోనే అతి పెద్ద ఆస్పత్రి ఒడిశాలో నిర్మించనున్నారు. మొత్తం 1000 పడకలతో దీన్ని సిద్ధం చేయనున్నారు. రెండు వారాల్లో ఈ ఆస్పత్రి అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థలు, వైద్య కళాశాలల మధ్య ఒప్పందం కుదిరింది.

* కరోనా వైరస్ నిర్మూలన కోసం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సీఎమ్ సహాయ నిధి కి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్