ScienceAndTech

ATM నుండి మొబైల్ రీఛార్జి చేయచ్చు

How to recharge mobile via ATM-Telugu Tech News-April 2020

ప్ర‌స్తుతం కొవిడ్‌-19 కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన‌ది. మాల్స్‌, షాప్స్, కొన్ని కార్యాల‌యాలు కూడా మూత‌బ‌డ్డాయి. ఆన్‌లైన్ స‌దుపాయాలు ఉన్నాయి కాబ‌ట్టి ఇంట్లో ఉన్నా ప్ర‌శాంతంగా ఉండ‌గ‌లుగుతున్నాం. అయినా ఎదో ర‌కంగా ఆటంకాలు ఎదురువుతూనే ఉన్నాయి. వాటిలో మొబైల్ రీచార్జ్ కూడా ఒక‌టి. యాప్స్‌తో రీచార్జ్ చేసుకునేట‌ప్పుడు ఆటంకాలు ఏర్ప‌డుతున్నాయి. అందుకే ద‌గ్గ‌ర్లో ఉన్న ఏటియ‌మ్‌ల ద్వారా వొడాఫోన్‌, జియో, ఎయిర్‌టైల్ వంటి సంస్థ‌లు వివిధ ఏటియ‌మ్‌ల ద్వారా రీచార్జ్ చేసుకునే సౌకర్యం కల్పించాయి.
*వొడాఫొన్ :
వోడాఫోన్ ఐడియా 2020 ఏప్రిల్ 17 వరకు దాదాపు 100 మిలియన్ ప్రీపెయిడ్ చందాదారుల యాక్సిస్ ను పెంచింది. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్, భారతి ఎయిర్‌టెల్ వంటి ఇతర టెల్కోలు కూడా ప్రీపెయిడ్ ప్లాన్ల చెల్లుబాటును పెంచడమే కాకుండా టాక్ టైమ్ క్రెడిట్ ను కూడా చందాదారుల అకౌంట్ లలో జమచేశారు.
*ఎయిర్‌టెల్ రీఛార్జ్ :
ఇండియాలో భారతి ఎయిర్‌టెల్‌ సుమారు 100 మిలియన్లకు పైగా చందాదారులను కలిగి ఉన్నారు. లాక్డౌన్ వ్యవధిలో తమ చందాదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు భారతి ఎయిర్‌టెల్ తన చందాదారులకు రీఛార్జ్ సదుపాయాన్ని కల్పించడానికి హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్‌లతో జతకట్టింది. ఇది మాత్రమే కాదు లాక్డౌన్ కాలంలో పనిచేస్తున్న అపోలో ఫార్మసీలతో పాటు టెల్కో దిగ్గజం బిగ్ బజార్ కిరాణా దుకాణాలతో జతకట్టింది.
*రిలయన్స్ జియో రీఛార్జ్ :
భారతదేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో తమ చందాదారులకు రీఛార్జ్ సమస్యలు కలగకుండా ఉండడానికి తొమ్మిది వేర్వేరు బ్యాంకులతో జతకట్టింది. జియో భారతదేశంలో 350 మిలియన్లకు పైగా చందాదారులను కలిగి ఉంది. ఈ బ్యాంక్ జాబితాలో SBI, యాక్సిస్ సిటీ బ్యాంక్, డిసిబి బ్యాంక్ వంటివి మరెన్నో ఉన్నాయి. రిలయన్స్ జియో చందాదారులు భారతదేశంలో పనిచేస్తున్న ఈ తొమ్మిది బ్యాంకుల్లో దాదాపు 90,000 ఏటిఎంలలో రీఛార్జిని పొందగలుగుతారు.
***ATM ద్వారా రీఛార్జ్ చేయడం ఎలా?
మొదటగా మీ యొక్క simను రీఛార్జ్ చేయడానికి అనుమతిస్తున్న బ్యాంక్ ఎదో కనుకోండి. మొదటగా మీ యొక్క బ్యాంక్ ATM కార్డును అందులో “ఇన్సర్ట్” చేయండి. తరువాత మీ యొక్క భాషను ఎంచుకోండి. తరువాత “మొబైల్ రీఛార్జ్” అనే ఎంపిక మీద క్లిక్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయండి. మీరు రీఛార్జ్ చేయవలసిన ప్లాన్ ను ఎన్నుకోండి. తరువాత మీ యొక్క ATM కార్డు పిన్ నెంబర్ ను నొక్కండి.అంతే మీ మొబైన్‌ నెంబర్‌ రీఛార్జవుతుంది. ఏటీఎం నుంచి డబ్బులు కట్టవుతాయి.