Movies

బ్రహ్మీ….ద ఆర్టిస్ట్

బ్రహ్మీ….ద ఆర్టిస్ట్

వెండితెరపై నవ్వులు పూయించే బ్రహ్మానందంలో చిత్ర లేఖనం కళ కూడా ఉంది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఆయన.. తనలోని చిత్రకారుడిని నిద్ర లేపారు. తనకెంతో ఇష్టమైన ప్రముఖ రచయిత శ్రీశ్రీ చిత్తరువును పెన్సిల్‌తో ఆకట్టుకునేలా చిత్రించారు. ఆ ఫొటోలను బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’లో కీలక పాత్రలో నటిస్తున్నారు బ్రహ్మానందం.