Health

మామోగ్రఫీ చేయించుకున్నారా?

Did you get your mammography done?-Telugu health news

రొమ్ములో గడ్డలనే శత్రువులను తెలుసుకోవడానికి ఇప్పుడు మరింత మెరుగైన ఉపకరణం అందుబాటులోకి వచ్చింది. అదే డిజిటల్‌ మామోగ్రాఫీ. ఇది గతంలో ఉన్న పరిజ్ఞానమే. అయితే దీనికి ఆధునిక సాంకేతికత తోడై బ్రెస్ట్‌ టోమోసింథసిస్‌/3డి మామోగ్రఫీ అనే అత్యంత ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒమేగా హాస్పిటల్స్‌లో నెలకొల్పిన ఈ అత్యాధునిక ఉపకరణంతో సంప్రదాయ పద్ధతుల్లో కంటే మరింత ముందుగానే గడ్డను చూడవచ్చు. ఇది 3డీ పరిజ్ఞానంతో రొమ్ములో క్యాన్సర్‌ ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని దాన్ని తొలగించడానికి వీలవుతుంది. పక్కనున్న కణజాలం క్యాన్స ర్‌ గడ్డతో కలిసిపోయి, రెండింటినీ స్పష్టంగా, నిర్దిష్టంగా గుర్తించలేని పరిస్థితి పూర్తిగా తొలగిపోయి, క్యాన్సర్‌ గడ్డ, కణితి ఉన్న భాగం మరింత స్పష్టంగా కనిపించి చికిత్స సులువు అవుతుంది. దీనివల్ల వ్యాధి తిరగబెట్టే అవకాశాలు 30 శాతం తగ్గుతాయి.

*** సైబర్‌ నైఫ్‌
ఒక్క రొమ్ము క్యాన్సర్‌కు మాత్రమే కాదు అన్ని రకాల క్యాన్సర్లతో పాటు ఇక దాన్నీ రక్షించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కూడా ఒమేగా హాస్పిటల్లో లభ్యమవుతున్నది. అదే సైబర్‌ నైఫ్‌. ఇది కత్తి కాని కత్తి. క్యాన్సర్‌ ఉన్న భాగాన్ని మెత్తగా కోసే కత్తి. వాస్తవానికి రొమ్ము లాంటి ప్రదేశంలో అతి మెత్తగా గాటుకు గాయం కాకుండా, గాయానికి నొప్పి లేకుండా, సమస్య ఎప్పుడూ మళ్లీ రాకుండా (కనీసం గతంలో కంటే 30 శాతం అధికంగా) చేసే సాంకేతిక పరిజ్ఞానం. ఒకప్పుడు మెదడు, వెన్నెముక, ఊపిరితిత్తులు, కాలేయం, క్లోమగ్రంధి వంటి సున్నితమైన ప్రదేశాల్లో క్యాన్సర్‌ కణితి ఉంటే ఆందోళన పడేవారు.

*** ఇమేజ్‌ గైడింగ్‌ టెక్నాలజీ
సైబర్‌ నైఫ్‌ అనే సునిశితమైన వైద్య పరిజ్ఞానంతో పాటు ఇమేజ్‌ గైడింగ్‌ టెక్నాలజీ అనే సాంకేతికత కూడా అందుబాటులోకి వచ్చింది. ఇమేజ్‌ గైడింగ్‌ అంటే మనం చూడలేని ప్రాంతాన్ని కూడా స్పష్టంగా అద్దంలో చూసినట్లుగా చూడటం. ఇక రొమ్ము క్యాన్సర్‌ విషయానికి వస్తే డిజిటల్‌ మామోగ్రఫీ విత్‌ బ్రెస్ట్‌ టోమోసింథసిస్‌/కిడి మామోగ్రఫీ పరిజ్ఞానంలోని కెమెరా సహాయంతో రొమ్ముకు అన్ని వైపులా తిప్పుతూ క్యాన్సర్‌ గడ్డను అన్ని కోణాలనుంచి చూస్తూ శస్త్రచికిత్స చేయడం సాధ్యమవుతుంది. పైగా దీనివల్ల ఇప్పుడు మనం చూసే క్యాన్సర్‌ గడ్డ గతంలో కంటే మరింత స్పష్టంగా, మరింత పెద్దగా, శస్త్రచికిత్స సమయంలో మిగతా భాగాలేవీ దెబ్బతినకుండా తీసేయడానికి వీలయ్యేంత పరిమాణంలో కనిపిస్తుంది.

*** ఆక్సిలరీ క్లియరెన్స్‌
చికిత్స చేస్తున్నప్పుడు ఊపిరితిత్తుల్లా కదులుతుండే భాగాలు అలా కదులుతున్నా సరే ఇమేజ్‌ గైడింగ్‌ టెక్నాలజీ వల్ల, రోబోటిక్‌ సామర్థ్యం వల్ల క్యాన్సర్‌ ఉన్న భాగం తమ కిరణాలు తగిలే పరిధిలోకి వచ్చినప్పుడే వాటిని ఖచ్చితమైన చోట ప్రసరింపజేసి క్యాన్సర్‌ను కాల్చేసి మసి చేస్తాయి. అలాగే రొమ్ము కూడా ఊపిరితిత్తుల పైభాగంలో ఛాతీమీద ఉంటుంది. కాబట్టి శ్వాసిస్తూ ఉన్నప్పుడు రొమ్ము క్యాన్సర్‌కు కూడా పైవిధంగానే చికిత్స చేయవచ్చు. కొన్నిసార్లు రొమ్ము క్యాన్సర్‌ తొలి దశలను దాటి చంకల్లో ఉండే లింఫ్‌ గ్లాండ్స్‌కూ విస్తరించే అడ్వాన్స్‌డ్‌ దశలకూ వెళ్తుంది. అలాంటప్పుడు వ్యాధిగ్రస్తమైన లింఫ్‌గ్లాండ్స్‌ను శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనే ’ఆక్సిలరీ క్లియరెన్స్‌’ అంటారు. లింఫ్‌ గ్లాండ్స్‌లో జబ్బు ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి సెంటినల్‌ నోడ్స్‌ బయాప్సీ ప్రక్రియ ద్వారా ఏయే గ్లాండ్స్‌ రోగగ్రస్తమయ్యాయో తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్న తర్వాత కేవలం రోగగ్రస్తమైన లింఫ్‌ గ్లాండ్స్‌ ఉంటే ఆక్సిలరీ క్లియరెన్స్‌ చేసి వాటిని వదిలేయవచ్చు.

*** ఏయే భాగాల్లో?
శరీరంలోని ఏ భాగానికైనా సైబర్‌నైఫ్‌ నుంచి చికిత్స చేసే కిరణాలను ప్రసరింపజేసి, క్యాన్సర్‌ గడ్డను, కణితి ఉన్న భాగాన్ని తొలగింపజేయవచ్చు. క్యాన్సర్‌ పుట్టిన భాగంలోనే ఉండక క్రమంగా పాకేస్తుంది. ఇలా విస్తరించడాన్ని మెటాస్టాసస్‌ అంటారు. సైబర్‌ నైఫ్‌ ప్రత్యేకత ఏమిటంటే మెటాస్టాసస్‌ క్యాన్సర్లను సైతం తేలిగ్గా తొలగిస్తుంది. అంతేకాదు తల, మెడ, ముక్కు, గొంతు భాగాలలోని కణుతులు. సైబర్‌నైఫ్‌ను 360 డిగ్రీల్లో ఎటైనా తిప్పుతూ కిరణాలను ప్రసరింపజేయడం సాధ్యమవుతుంది. సైబర్‌ నైఫ్‌ ప్రయోజనాలు సాధారణంగా కరెంట్‌ చికిత్సగా పేర్కొనే గతంలోని లీనియర యాక్సిలరేటర్లను ఉపయోగించే సమయంలో గతంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అన్ని జాగ్రత్తలు అవసరం లేకుండానే సులువుగా చికిత్స జరిగిపోతుంది. నొప్పి ఉండదు. మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. శరీరానికి గాటు పెట్టనవసరం లేదు. చికిత్స చేసే సమయంలో ఊపిరితిత్తులకు రేడియేషన్‌ ఇస్తుంటే ఊపిరిబిగబట్టాల్సిన అవసరం లేదు. సూదిమొనంత ఖచ్చితత్వంతో క్యాన్సర్‌ ఉన్న భాగానికే ఇవ్వవచ్చు. అత్యంత తక్కువ సైడ్‌ ఎఫెక్ట్స్‌. హాస్పిటల్లో ఉండాల్సిన సమయం చాలా చాలా తగ్గిపోతుంది.

క్యాన్సర్‌ కాని ఇతర వ్యాధుల్లోనూ ఉపయోగం సైబర్‌నైఫ్‌ సేవలను కేవలం క్యాన్సర్‌ కోసం మాత్రమే కాకుండా… క్యాన్సర్‌ కాని ఇతర వ్యాధుల్లోనూ ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. వాటిలో కొన్ని.. మెనింజియోమాస్‌ పిట్యూటరీ అకౌస్టిక్‌ న్యూరోమాస్‌ మెదడులో ఉండే క్రేనియల్‌ నర్స్‌ స్క్వానోమాస్‌ గ్లామస్జ్యుగులేర్‌ ఆపరేషన్‌కు వీలుకాని పారాగాంగ్లియోమాస్‌ హిమాంజియోమాస్‌ రక్తనాళాల అమరిక సరిగా లేని సందర్భాల్లో (వాస్క్యూలార్‌ మాల్‌ ఫార్మేషన్‌) ఇటీవలే నమలడం సైతం కష్టమైనంతగా దవడ నొప్పితో సల్మాన్‌ఖాన్‌కు వచ్చిన ట్రెజెమినల్‌ న్యూరాల్జియా క్లస్టర్‌ హెడేక్‌ వంటి సంక్లిష్టమైన తలనొప్పులు తలలోని అత్యంత సంక్లిష్టమైన నరాలకు సర్జరీ చేయలేని సందర్భాల్లో సైబర్‌ నైఫ్‌ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇలా సైబర్‌ నైఫ్‌తో అన్ని రకాల క్యాన్సర్లనూ, అన్ని అవయవాల్లోని అత్యంత సంక్లిష్టమైన భాగాల్లో వచ్చిన గడ్డలను తొలగించుకోవడం సాధ్యమే. చివరకు రొమ్ముక్యాన్సర్‌ భాగాలు, రొమ్ములో వచ్చే గడ్డలతో సహా.