Fashion

ధాన్యం గింజలతో నగలు

Necklaces And Jewellery With Grains-Telugu Fashion News

ధాన్యపు సిరులు ఇంట్లోనే కాదు… ఒంటిపైనా కళకళలాడతాయి. పసిడి మెరుపుతో అమ్మాయి అందానికి మరింత వన్నె తెస్తాయి. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఆలస్యమెందుకు, చదివేయండి మరి! పొలంలో పచ్చని వరికంకి గాలికి ఊగుతుంటే అందం… పక్వానికి వచ్చాక పసిమి ఛాయతో మెరుస్తుంటే అందం… కోతలూ, నూర్పులూ… ప్రతి దశలోనూ అందమే! మరి అంతటి అందమైన ధాన్యపు గింజలు చిన్నదాని ఒంటిపైన తళుకులీనితే ఇంకెంత అందంగా ఉంటుంది? ఆభరణాలుగా మారిపోతే ఇంకెంత చక్కగా ఉంటుంది? ఈ ఆలోచన వచ్చింది మొదలు, ఇదిగో ఇలా ధాన్యంతో నగలు తయారు చేస్తున్నారు డిజైనర్లు. ముచ్చటైన మెడలో హారం… చెక్కినట్టున్న చెవులకు దుద్దులు… ఇలా అన్నీ వడ్ల గింజలతోనే చేసేస్తున్నారు!