DailyDose

జూన్ 10న నైరుతి రుతుపవనాలు-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today - Monsoon Season To Start From June 10th

* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఏడాది జూన్ పదవ తేదీన నైరుతి రుతుపవనాలు రానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమల మీదుగా మధ్య తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.దీంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం తెలిపింది.27న రాయలసీమ, ఉత్తరాంధ్రలో చెదురుమదురు జల్లులు పడినా, దక్షిణ కోస్తాలో వడగాలులతో ఎండ తీవ్రత ఉంటుందని పేర్కొంది.సోమవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో చెదురుమదురు జల్లులు పడ్డాయి.

* హైకోర్టు జడ్జీలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు. 49 మందికి నోటీసులు.

* ప్రభుత్వ భూముల అమ్మకాలపై ఏపీ హైకోర్టులో విచారణ. ప్రభుత్వం దివాళా తీసిందా అని వ్యాఖ్యానించిన ఏపీ హైకోర్టు. ఆస్తుల అమ్మితేనే అభివృద్ధి చేయగలరా అని ప్రశ్నించిన కోర్టు. బిల్డ్ ఏపీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారించిన కోర్టు.

* కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ పూర్తిగా విఫలమైందని విమర్శించారు కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ.

* ఈనెల 28 న 14 వేల మంది సినీ కార్మికులు, సినీ, త్వ్ ఆర్టిస్టులకు నిత్యావసర వస్తువుల పంపిణీ.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. లాక్ డౌన్ కారణంగా 2 నెలల నుండి కార్మికులు, కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఏడాది జూన్ పదవ తేదీన నైరుతి రుతుపవనాలు రానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమల మీదుగా మధ్య తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.దీంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం తెలిపింది.27న రాయలసీమ, ఉత్తరాంధ్రలో చెదురుమదురు జల్లులు పడినా, దక్షిణ కోస్తాలో వడగాలులతో ఎండ తీవ్రత ఉంటుందని పేర్కొంది.సోమవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో చెదురుమదురు జల్లులు పడ్డాయి.

* టీడీపీ మహానాడు ఏర్పాట్లు పూర్తి. కరోనా నేపథ్యంలో వర్చువల్ మహానాడు నిర్వహిస్తున్నాం. 25 వేల మంది కార్యకర్తలు మహానాడును వీక్షించేలా ఏర్పాటు. మహానాడులో 52 మంది నేతలు మాట్లాడతారు.

* డాక్టర్ సుధాకర్ కేసులో హై కోర్ట్ ఉత్తర్వులపై సుప్రీమ్ కోర్టుకు అప్పీల్ కు వెళ్లనున్న రాష్ట్ర ప్రభుత్వం. న్యాయ నిపుణలతో చర్చల అనంతరం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. ఈ కేసులో ప్రభుత్వం పై నమ్మకం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు. ప్రభుత్వ ఉద్యోగిగా కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించనందునే సుధాకర్ పై సస్పెన్షన్ వేటు వేసామన్నది ప్రభుత్వ వాదన.

* టీటీడీ ఆస్తుల విక్రయాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన 888 జీవోపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘సింహాచలం అప్పన్నదగ్గర అపచారం చేశారు.దుర్గమ్మ గుడిని రాజకీయ వేదిక చేశారు.శ్రీశైలం గుళ్ళో అవినీతి బయటపడింది.భూములవేలంపై మీ మంత్రుల ప్రకటనలు మీ బాబాయ్ మాటలతో భక్తులు, దాతలు, వెంకన్న ఆగ్రహానికి గురై జీవో 888 ఇచ్చారు.మీ ప్రభుత్వ పనితీరును ప్రజలు ప్రశ్నిస్తున్నారు సమాధానం చెప్పండి జగన్ గారు’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.

* టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్ వస్తానంటేనే మీ నాయకుడికి గుండెజారి గల్లంతయ్యిందంటూ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి వర్ల రామయ్య ట్వీట్ చేశారు.