NRI-NRT

పేరు మార్చుకున్న అమెరికా తెలంగాణా అసోసియేషన్

American Telangana Association ATA Changes Its Name

అమెరికా తెలంగాణా అసోసియేషన్(ATA)గా ఏర్పడిన తెలుగు సంఘం ఇక నుండి తన పేరును మార్పు చేసుకున్నట్లు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇప్పటికే ATA అమెరికా తెలుగు సంఘం ఉండగా, ఇదే పేరుతో మరొక సంస్థను ఏర్పాటు చేయడం పట్ల తొలుత అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీని మీదట ఇరు తెలుగు సంఘాల మధ్య జరిగిన సంప్రదింపుల మేరకు ఏకాభిప్రాయం కుదిరింది. అనంతరం తమ సంఘం పేరును అమెరికన్ తెలంగాణా సొసైటీగా మార్చుకున్నట్లు అమెరికా తెలంగాణా అఓసియేషన్ పేర్కొంది.