WorldWonders

ఇప్పటివరకు 4లక్షల మందిని కబళించిన కరోనా

ఇప్పటివరకు 4లక్షల మందిని కబళించిన కరోనా

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నది. శుక్రవారం నాటికి ప్రపంచవ్యాప్త మరణాలు 4లక్షలు దాటాయి. అగ్రరాజ్యం అమెరికా, అతిపెద్ద దేశం రష్యా, బ్రెజిల్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉన్నది. కరోనా కేసులు, మరణాల్లో అమెరికానే అగ్రస్థానంలో ఉంది. గత కొద్దిరోజులుగా బ్రెజిల్‌, రష్యాలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కోవిడ్‌-19 బాధితుల సంఖ్య 6,740,320కు చేరింది. కరోనా పాజిటివ్‌ కేసుల్లో అమెరికా(1,926,269 కేసులు), బ్రెజిల్‌(618,554), రష్యా(449,834), స్పెయిన్‌(287,740), బ్రిటన్‌(281,661), ఇటలీ(234,013), భారత్‌(230,113), జర్మనీ(184,923), పెరూ(183,198), టర్కీ(167,410) టాప్‌-10లో ఉన్నాయి.