DailyDose

ఏపీలో నూతన లాక్‌డౌన్ మార్గదర్శకాలు ఇవి-తాజావార్తలు

ఏపీలో నూతన లాక్‌డౌన్ మార్గదర్శకాలు ఇవి-తాజావార్తలు

* దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గర్భంతో ఉన్న ఏనుగు మృతి చెందిన అమానుష ఘటనలో విచారణ కొనసాగుతోంది. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం ఈ ఘటనకు సంబంధించిన పలు వివరాలను అటవీ అధికారులు వెల్లడించారు. మరణించిన ఏనుగు తిన్నది అందరూ భావిస్తున్నట్లు పైనాపిల్‌ కాదని.. కొబ్బరికాయ అని అధికారులు స్పష్టం చేశారు. పేలుడు పదార్థాలతో కూడిన కొబ్బరికాయను తినటంతో దాని నోరు తీవ్రంగా గాయపడిందని వివరించారు. రోజుల తరబడి ఆహారం, నీరు కూడా తీసుకోలేని స్థితిలో… పాలక్కాడ్‌లోని వెల్లియార్‌ నదిలో ఆ గజరాజు ప్రాణాలు విడిచిందని తెలిపారు. సుమారు 20 రోజుల పాటు ఆహారాన్ని తీసుకొని ఉండదని అధికారులు అంచనా వేశారు. అరెస్టైన నిందితుడు విల్సన్‌ రబ్బరు సేకరించే వృత్తిలో ఉన్నాడని.. విచారణలో భాగంగా నిందితుడిని పేలుడు పదార్ధాలు తయారుచేసిన ప్రాంతానికి తీసుకెళ్లినట్లు అటవీ అధికారులు చెప్పారు. అక్కడున్న ఓ షెడ్‌లో ఆ వ్యక్తి మరో ఇద్దరితో కలసి పేలుడు పదార్ధాలను తయారు చేశాడని తమ దర్యాప్తులో వెల్లడైనట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. వారిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తప్పక న్యాయం చేస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

* తమిళ కథానాయకుడు సూర్య తండ్రి, నటుడు శివకుమార్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ సభలో పాల్గొన్న శివకుమార్‌ తితిదేను విమర్శించేలా మాట్లాడారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఏప్రిల్‌ 29న శివకుమార్‌పై కేసు నమోదైందని.. ఈ మెయిల్‌ ద్వారా విజిలెన్స్‌కు ఫిర్యాదు అందినట్లు తితిదే పేర్కొంది. అంతేకాకుండా తితిదేను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై కూడా తితిదే ఫిర్యాదు చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు తిరుమల టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పలువురిపై కేసులు నమోదు అయ్యాయి. ఎపిడమిక్‌ డిసీజెస్ యాక్ట్‌ ప్రకారం వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో చేసిన పోస్టుల వివరాలను తితిదే ఫిర్యాదులో పేర్కొంది.

* కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులతో ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రం సడలింపులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల 8 తేదీ నుంచి మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

మార్గదర్శకాలు ఇవే..

> కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి. ఆహారం పార్శిల్‌ తీసుకువెళ్లేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

> 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్లలోపు చిన్నారులు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదు.

> కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని మార్గదర్శకాలనూ అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలి.

> షాపింగ్ మాల్స్‌లో ఎయిర్‌ కండీషన్‌ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండాలి.

> బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం.

> అనుమతి ఉన్న షాంపింగ్ మాల్స్‌, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు డిజిటల్ చెల్లింపులు, ఈ-వ్యాలెట్ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.

> షాపింగ్ మాల్స్‌ ప్రాంగణాలు, పార్కింగ్ ప్రాంతాల్లో రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టాలి.

> ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం మందికి మాత్రమే ప్రవేశం.

> హోటళ్లు, రెస్టారెంట్లలోని టేబుళ్లు, కుర్చీలు వినియోగదారుడు మారిన ప్రతీసారీ శానిటైజ్ చేయాలి.

> గేమింగ్ ప్రాంతాలు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ మూసి ఉంచాలి.

> షాపింగ్ మాల్స్లోని సినిమా హాళ్లు తెరవకూడదు.

దేవాలయాల్లో పాటించాల్సినవి..

> దేవాలయాలు, ధార్మిక ప్రదేశాలకు అనుమతి.

> ధార్మిక ప్రదేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర మాల్స్ వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటంపై కొనసాగనున్న నిషేధం.

> దేవాలయాల వద్ద క్యూ మేనేజ్‌మెంట్ సవ్యంగా ఉండాలి.

> దేవాలయాల్లో విగ్రహాలు, పవిత్ర గ్రంథాలను ముట్టుకోకుండా దర్శనం చేసుకోవాలి.

> తీర్థ ప్రసాదాలు ఇవ్వడం, పవిత్ర జలాలను భక్తులపై చల్లడం నిషేధం.

> సరైన భౌతిక దూరాన్ని పాటిస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు.

> ప్రార్థనా మందిరాల్లో ఎవరికి వారు కిందకూర్చునే వస్త్రం లేదా తివాచీని తెచ్చుకోవాలి.

* ఉత్తరాంధ్ర రైతులకు వైకాపా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని తెదేపా సీనియర్‌నేత సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. అనకాపల్లిలో ఉద్యానవన పరిశోధన కేంద్రాన్ని తెదేపా ప్రభుత్వం ప్రారంభిస్తే… వైకాపా ప్రభుత్వం దాన్ని పులివెందులకు తరలించిందని తెలిపారు. డాక్టర్‌ సుధాకర్‌ తనకు గతంలోనే తెలుసని, అయితే.. కొందరు ఆరోపిస్తున్నట్టుగా వ్యక్తిగతంగా ఇటీవల తనతో మాట్లాడలేదని స్పష్టం చేశారు.

* క్రిమి సంహారకాలు లేకుండా పంటలు పండించే పరిస్థితి లేదు. కలుషితం అయ్యాయో లేదో చాలాసార్లు గుర్తించలేం. అందులోని పోషకాల విలువలను లెక్కగట్టలేం. ఈ ఆదివారం (జూన్‌ 7) ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం. అందుకే కలుషిత ఆహారంతో నష్టాలు ఏంటి? సురక్షిత ఆహారం కోసం ఏం చేయాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. అవేంటో తెలుసుకుందామా!!