Devotional

బీబీ నాంచారమ్మ గురించి ఇవి తెలుసా?

బీబీ నాంచారమ్మ గురించి ఇవి తెలుసా?

నాంచారమ్మ గురించి రకరకాల ప్రేమ కధలు వాదనలు;
1. బీబీ నాంచారమ్మ గురించి ప్రచారంలో ఉన్న పలు వృత్తాంతాలలో లోని ప్రధాన ఇతివృత్తం ఇలా సాగుతుంది. మధ్యయుగంలో దక్షిణ భారతదేశాన్ని ఒక మహమ్మదీయ సుల్తాను దండెత్తి, వైష్ణవాలయంలోని వైష్ణవ విగ్రహాన్ని (శ్రీరంగంలోని ఉత్సవ విగ్రహాన్ని) ఢిల్లీ తీసుకొని వెళతాడు. ఆ విగ్రహాన్ని చూసిన సుల్తాను కూతురు సమ్మోహితురాలై ప్రేమలో పడుతుంది. విగ్రహాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించక, తీసుకువెళ్ళటానికి వచ్చిన వ్యక్తులతో పాటు తనూ వెళుతుంది. ఆ తరువాత దైవసన్నిధిలో ఐక్యమై విష్ణు భార్యగా నిలచిపోతుంది. వివిధ వృత్తాంతాల్లో దండెత్తిన చక్రవర్తి ఔరంగజేబు గానూ, మాలిక్ కాఫూర్ గానూ చెప్పబడింది. తీసుకెళ్ళిన వైష్ణవ విగ్రహం శ్రీరంగంలోని శ్రీరంగనాథ విగ్రహమనీ, మేళ్కోటలోని కృష్ణ విగ్రహమని,విగ్రహన్ని సుల్తాను కూతురే తిరిగితీసుకు వచ్చిందని, రామనుజస్వామి వెళ్ళి తెచ్చారని, పురబ్రాహ్మణులు తీసుకువచ్చారని ఇలా వివిధ రకాలుగా చెబుతారు. 
అనాదిగా తిరుమలతత్వం మతసామరస్యా నికి ప్రతీకగా నిలచింది. వేంకటేశ్వరుని పట్టపురాణిగా కీర్తించబడే అమ్మవార్లకు అలమేలుమంగ లేక పద్మావతిగా తమిళంలో ఆండాళ్‌, గోదాదేవిగా, శ్రీదేవిగా చెప్పుకుంటారు. స్వామి దేవేరిగా బీబీనాంచారమ్మను కూడా భక్తులందరూ స్మరించుకోవడం పరిపాటి. బీబీ అనే పదం ముస్లింలకు సంబంధించిన ఉర్దూ భాషా పదం. నాంచారి అనేది తమిళ పదం. రెండింటి అర్థం భార్యే…బీబీనాంచారి ప్రస్థావనకొచ్చేసరికి కొందరు వైష్ణవ పండితులు ఒక కథను ప్రస్థావిస్తారు. ఒకప్పుడు మైసూర్‌ చక్రవర్తి హైదరాలీ తిరుమల దగ్గరలో ఉన్న చంద్రగిరి కోటను వశపరుచుకున్నాడట. దారిలో ఉండే హిందూ దేవాలయాలన్నింటినీ నగలు, సంపదలతో సహా వశపరుచుకునేవాడట.
కాగా తిరుమల శ్రీవేంకటేశ్వరుని సొత్తును సైతం స్వాధీనం చేసుకోవడానికి ఉద్యక్తుడవుతుండగా…కొందరు తిరుమలకు వెళ్లే యాత్రికులు తలనీలాలు, గడ్డం గుబురుగా పెంచుకుని గోవింద నామంతో వెళుతున్నారట. దానితో హైదరాలీ అక్కడి ప్రాంతం వారిని అడగగా అది తిరుమల ఆచారమని…స్వామివారు బీబీనాంచారి అనే ముస్లిం యువతిని పెండ్లాడారని…భక్తులు స్వామివారి గౌరవార్థం జుట్టు, గడ్డం పెంచుకుని వెళతారని
స్వామిని దర్శించుకుని వచ్చేటప్పుడు తిరిగి తలనీలాలు సమర్పించుకుని బోడిగుండుతో వెళతారని చెప్పగానే…
హైదరాలీ పశ్చాత్తాపపడి తమ మతానికి చెందిన బీబీనాంచారి గౌరవార్థం స్వామివారి సంపదలను కొల్లగొట్టకుండానే తిరిగి వెళ్లిపోయాడట.తమ మతానికి చెందిన ఆడపడచును హైదరాలీ గౌరవించడంతో అప్పటినుంచి ఏ ఏటికాయేడు ముస్లింలు కూడా వెంకటేశ్వరుని కొలుచుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే 16వ శతాబ్దానికి చెందిన పదకవితా పితామహుడు అన్నమయ్య తన కీర్తనలలో ఎక్కడా కూడా బీబీనాంచారి పేరు ప్రస్థావించకపోవడం గమనార్హం.

2.ఆండాళ్ వలే స్వామిని ఘాడంగా ప్రేమించిన బీబీ నాంచారమ్మ విగ్రహాన్ని తయారుచేయించి, శ్రీ రామానుజాచారి శ్రీ రంగంలో ప్రతిస్టించినారు. ఇప్పటికి ఆ బీబీ నాంచారమ్మ విగ్రహానికి అక్కడ పూజాది కైంకర్యాలు నిర్వహించబడుతున్నాయి.

ప్రొద్దుటూరుకు చెందిన డా.సి.వి.సుబ్బన్న శతావధాని రచించిన “బీబీ నాంచారి ప్రబంధము” తిరుపతిలో తెలుగు భాషోధ్యమ సమితి ఆధ్వర్యంలో 25.4.2010 న ఆవిష్కరణ జరిగింది.కర్నాటకలోని మేల్కోటే లోని చెళ్ళపిళ్ళరాయుని విగ్రహాన్ని డిల్లీ సుల్తాన్ డిల్లీ కి తెప్పిస్తాడు.ఆ విగ్రహాన్ని ఆయన కుమార్తె ఆరాధిస్తుంది.ప్రేమలో పడుతుంది.వెంకటేశ్వరుడు సుల్తాన్ కు కలలో కనపడి ఆయన కుమార్తెను వివాహమాడతానని చెపుతాడు.సుల్తాన్ అంగీకరిస్తాడు.గోదాదేవి లాగానే నాంచారి కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి మతాంతరవివాహాలకు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని శతావధాని చెప్పారు.

శ్రీ రామానుజాచార్యులు ప్రజలలో సంకుచిత భావాలు పోగొట్టి, కుల, మత భేదం లేకుండా భక్తులందరికీ దేవాలయ ప్రవేశం దర్శన భాగ్యం కల్పించారు. విశాల హృదయుడైన రామానుజులవారు ఆండాళ్ గోదాదేవి ప్రేమకూ, ముస్లిం రాకుమార్తె ప్రేమకూ ఎలాటి భేదంలేదని, స్వామి ప్రేమలో ఐక్యమైన బీబీ నాంచారి విగ్రహాన్ని చేయించి శ్రీరంగంలోని రంగనాథుని దేవాలయంలో ప్రతిష్టించారు.

బీబీ నాంచారమ్మను పరిణయ మాడడం వల్ల అతను మహమ్మదీయులకు కూడ దగ్గర వాడయ్యాడు !
 ఋషి — సూత మునీంద్రా ! బీబీ నాంచారమ్మను , శ్రీవారు ఏ విధంగా చేపట్టారు ?
ఋషి — మత సామరస్య ప్రబోధకమైన నాంచారమ్మ చరిత్రను చెప్పండి !
సూతుడు — మునులారా ! శ్రధ్ధాభక్తులతో ఆలకించండి !! —అయల సోమయాజుల శ్రీధర్, బీబీ నాంచారమ్మ చరిత్ర పౌరాణిక నాటకం  14 కేంద్రాల లో విజయవంతంగా ప్రదర్శింపబడింది. 21 ఏప్రిల్ 2004 ‘బీబీ నాంచారి’ని మా-టివి వారు టెలికాస్టు చేసారు.