Sports

సెహ్వాగ్ ఇంటిపై మిడతల దాడి

సెహ్వాగ్ ఇంటిపై మిడతల దాడి

దేశ రాజ‌ధాని ఢిల్లీపై మిడ‌త‌‌ల దండు దాడి చేసింది. 

రాజ‌స్థాన్ మీదుగా దేశంలోకి ఎంట‌ర్ అయిన మిడ‌త‌లు ఇప్పుడు ఢిల్లీ, హ‌ర్యానా రాష్ట్రాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంటిపై మిడ‌త‌లు దాడి చేశాయి.

గురుగ్రామ్‌లో ఉన్న అత‌ని ఇంటిని మిడ‌త‌లు చుట్టుముట్టాయి.

దానికి సంబంధించిన ఓ వీడియోను సెహ్వాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. 

మిడ‌త‌లు దాడి చేశాయి. మా ఇంటిపై అంటూ త‌న వీడియోకు వీరూ ట్యాగ్ కూడా చేశాడు.  

మిడ‌త‌లు దాడి చేసే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఇంటి కిటికీల‌ను తీయ‌రాదు అని శుక్ర‌వార‌మే అధికారులు గురుగ్రామ్ స్థానికులకు హెచ్చ‌రించారు.

లాక్‌డౌన్ వ‌ల్ల ఇంట్లోనే ఉన్న సెహ్వాగ్ మిడ‌త‌ల దండు వీడియోను షేర్ చేశాడు. 

ఇటీవ‌ల అత‌ను వ‌ల‌స‌కూలీల‌కు హెల్ప్ చేస్తున్న దృశ్యాల‌ను కూడా పోస్టు చేశాడు.