DailyDose

నేడు కూడా పెరిగిన బంగారం ధర-వాణిజ్యం

నేడు కూడా పెరిగిన బంగారం ధర-వాణిజ్యం

* బంగారం ధర పరుగులు పెడుతూనే వస్తోంది. ఈరోజు కూడా ఇదే ట్రెండ్ నడిచింది.బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా పయనించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు పైకి కదిలాయి.పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.390 పైకి కదిలింది.దీంతో ధర రూ.48,500కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్‌కు 0.11 శాతం పెరిగింది.దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1783 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది.వెండి ధర ఔన్స్‌కు 0.10 శాతం పెరుగుదలతో 18.08 డాలర్లకు ఎగసింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర ర్యాలీ చేసింది.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.40 పైకి కదిలింది.దీంతో ధర రూ.47,250కు చేరింది.అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా పెరిగింది.

* ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన ఉద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. కరోనా వైరస్‌ సంక్షోభంలోనూ పనిచేస్తున్న ముందు వరుస ఉద్యోగులకు ఏకకాల బోనస్‌లు అందజేస్తామని ప్రకటించింది. ఇందుకోసం 500 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3,775 కోట్లు) ఖర్చుచేస్తామని వెల్లడించింది.

* దేశ భద్రతే లక్ష్యంగా టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ స్వాగతించారు. విశేష జనాదరణ పొందిన టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌, వియ్‌ చాట్‌, షేర్‌ ఇట్‌ తదితర యాప్‌లను దేశంలో నిషేధించడం దేశ ప్రయోజనాల విషయంలో తీసుకున్న ఓ సాహసోపేతమైన అడుగుగా అభివర్ణించారు. డిజిటల్‌ చెల్లింపులు, ఈ-కామర్స్‌ సేవలందిస్తున్న పేటీఎం యాప్‌ను వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ అనే భారత సంస్థ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదో మొబైల్‌ ఇంటర్నెట్‌ కంపెనీ. దీనిలో చైనా కంపెనీలైన ఆలీబాబా, యాంట్‌ ఫైనాన్స్‌ సంస్థలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టాయి.

* భారత్‌లో ఉద్యోగుల ఆత్మవిశ్వాసం పెరిగినట్టు తెలిసింది. రాబోయే ఆరు నెలల్లో తమ ఆదాయం, ఖర్చులు పెరుగుతాయని ప్రతి నలుగురులో ఒకరు పేర్కొన్నారని లింక్‌డ్‌ఇన్‌ సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1351 మంది ఉద్యోగులు/ప్రొఫెషనల్స్‌ను జూన్‌-14 వరకు సర్వే చేయగా తమ వ్యక్తిగత ఆర్థికస్థితిపై చాలామంది ఆశాభావం వ్యక్తం చేశారు.

* యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని భారతీయ కంపెనీలు, సంపన్నులు, సబ్సిడరీలు తాము నిజంగా అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని నిరూపించుకోవాలి. దీనికి నేటి సాయంత్రంతో గడువు ముగియనుంది. అక్కడ ఆర్థిక కార్యకలాపాల నుంచే లాభాలు ఆర్జించినట్లు ప్రభుత్వానికి తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే చాలా కంపెనీలు స్విట్జర్లాండ్‌ నుంచి మకాం మార్చి యూఏఈకి వచ్చి స్థిరపడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాలా కంపెనీలు దుబాయ్‌లో గోదాములను అద్దెలకు తీసుకొని వేరే చోట్ల నుంచి లాభాలు ఆర్జించినట్లు చూపి పన్ను ఎగవేస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం అనుమానిస్తోంది. దీంతోపాటు చాలా స్విస్‌లో ఖాతాలు మూసిన తర్వాత ఇక్కడకు తరలివచ్చినట్లు తేలింది. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన భారతీయ సబ్సిడరీ కంపెనీలు యూఏఈ నిబంధనలు పూర్తి చేయని పక్షంలో ఆ వివరాలను భారత్‌కు అందజేసే అవకాశం ఉంది.