DailyDose

ఎంపీపై మంత్రి PA ఫిర్యాదు-నేరవార్తలు

ఎంపీపై మంత్రి PA ఫిర్యాదు-నేరవార్తలు

* నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో వైసీపీలో తారాస్థాయికి విభేదాలు.ఎంపీ రఘురామకృష్ణరాజుపై పోడూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మంత్రి రంగనాథరాజు పీఏ సురేష్.మంత్రి రంగనాథరాజుపై ఎంపీ రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు.చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన రంగనాథరాజు పీఏ సురేష్.మంత్రి రంగనాథరాజు పీఏ సురేష్ ఫిర్యాదును స్వీకరించని పోలీసులు.ప్రవేటు కేసు కాబట్టి కోర్టులోనే తేల్చుకోవాలని పోలీసుల సూచన.

* అత్మకూరులో డంకన్ డ్రైవ్ నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐని బూతులు తిట్టిన 21వ వార్డు వాలంటీర్..నీ అంతు చూస్తానంటూ అసభ్యంగా మాట్లాడిన వాలంటీర్.

* కాన్పూర్​ ఎన్​కౌంటర్​లో ప్రధాన నిందితుడు, రౌడీషీటర్​ వికాస్​ దూబే ప్రధాన అనుచరుడిని ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు హతమార్చారు. మరో నిందితుడిని అరెస్టు చేశారు. వికాస్​ దూబే కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు పోలీసులు.

* సెర్బియా రాజ‌ధాని బెల్‌గ్రేడ్‌లో ఆందోళ‌న‌కారులు పార్ల‌మెంట్‌ను దిగ్భందించారు. మ‌రోసారి లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డంతో…..నిర‌స‌న‌కారులు భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.అధ్య‌క్షుడు రాజీనామా చేయాలంటూ ఆందోళ‌న‌కారులు నినాదాలు చేశారు. ఎన్నిక‌ల కోసం అధ్య‌క్షుడు ఎమ‌ర్జెన్సీ ఎత్తివేశార‌ని, మ‌ళ్లీ ఇప్పుడు లాక్‌డౌన్‌ను అమ‌లు చేయాల‌ని చూస్తున్న‌ట్లు నిర‌స‌న‌కారులు ఆరోపించారు. అధ్య‌క్షుడు అలెగ్జాండ‌ర్ వుక్కీ మాత్రం ఆ ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. పార్ల‌మెంట్ వైపు ఆందోళ‌న‌కారులు దూసుకురావ‌డంతో….వారిపై పోలీసులు టియ‌ర్ గ్యాస్‌ను ప్ర‌యోగించారు.అనేక మంది పార్ల‌మెంట్ బిల్డింగ్ లోనికి చొచ్చుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ప్ర‌త్యేక ద‌ళాలు వారిని అడ్డుకున్నారు. 

* ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ ప్రమాద ఘటన కారకులైన 12 మందికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధిస్తూ బుధవారం సెకండ్‌ అడిషనల్‌ ఛీప్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

* డీ ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు.అనంతపురం కరోనా నేపథ్యంలోమందుల కొనుగోళ్లు, ఉద్యోగుల భర్తీ పై పలు ఆరోపణలు.వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన అంశాలపై అవినీతి ఆరోపణలు.ఈ నేపథ్యంలో డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు.అడ్మినిష్ట్రేషన్ ఆఫీసర్ రత్నకుమార్ ఛాంబర్ రికార్డులు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు.కార్యాలయం నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించిన డీఎంహెచ్ఓ అనిల్ కుమార్.అడ్డుకున్న ఏసీబీ అధికారులు…..పూర్తి స్థాయిలో అన్ని రికార్డులు పరిశీలన.ఏసీబీ డీఎస్పీ అల్లాబకష్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తనిఖీలు.