Fashion

జాకెట్లు మీదకి ఫెమినిజమ్

జాకెట్లు మీదకి ఫెమినిజమ్

మహిళలకు సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకునేటప్పుడు ‘ఆడవాళ్లను తక్కువ అంచనా వేయొద్దు..’ అంటుంటాం. వాట్సాప్‌ ప్రొఫైల్‌ స్టేటస్‌గా ‘అయామ్‌ పవర్‌ఫుల్‌’ అని రాసుకోవడమూ చాలామంది చేసేదే. అలా రాసుకునే పదాలు ఇప్పుడు జాకెట్లపైన అందంగా చేరిపోతున్నాయి తెలుసా… ఏంటీ వీటి ప్రత్యేకత అంటే… అవన్నీ మహిళా శక్తిని చాటే పదాలే మరి. సాదా జాకెట్లపైన ఏ ఎంబ్రాయిడరీనో మరో వర్క్‌నో చేయించుకోకుండా ఇలాంటి పదాలు రాయించుకోవడమే ఇప్పుడు నడుస్తోన్న ట్రెండని అంటున్నారు డిజైనర్లు. అలా రాయించుకునే పదాల్లో ‘విమెన్‌ పవర్‌, ఫెమినిజం… వంటివి ఉంటున్నాయి. ముఖ్యంగా ఇలా డిజైను చేయించుకునే జాకెట్లు ఖాదీ చీరలకు చక్కని మ్యాచింగనీ చెప్పుకొస్తున్నారు.