DailyDose

తెనాలి ఎమ్మెల్యేకు కోవిద్ పాజిటివ్-TNI బులెటిన్

Tenali MLA Tested Positive For COVID19

* కరోనా తో తిరుపతి పద్మావతికోవిడ్ ఆసుపత్రిలో చనిపోయిన కెప్టెన్ టీవీ రిపోర్టర్ జే.సుబ్రమణిగత పదేళ్లుగా తిరుమల కొండపై వివిధ తమిళ టీవీ ఛానెళ్లకు రిపోర్టర్ గా పని చేసిన మణి..నాలుగురోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో చేరిన మణిఇప్పటివరకూ వారం రోజులలో కరోనాకు బలైన నలుగురు జర్నలిస్టులుప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో పదిమంది..జర్నలిస్టులు.

* తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణతెనాలిలో అన్ని వర్గాలను పట్టిపీడిస్తున్న కరోనాప్రముఖులను సైతం వదలని మహమ్మారిప్రభుత్వాధికారులు,రాజకీయ నేతలను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైరస్తెనాలిలో ఇప్పటికే వైరస్ బారిన పడిన మున్సిపల్ కమిషనర్, తాహసీల్దార్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు,పోలీస్ సిబ్బందికరోనా మహమ్మారి ధాటికి విలవిలలాడుతున్న ప్రజానీకం.

* దేశంలో కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తి మొదలైందని వెల్లడించింది ‘ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​’. రాష్ట్రప్రభుత్వాలు పూర్తి అప్రమత్తంగా ఉంటూ వైరస్​ నియంత్రణ చేపట్టాలని సూచించింది.

* కృష్ణాజిల్లా లోని నూజివీడు, జగ్గయ్యపేట, విజయవాడ వంటి పురపాలికల్లో వందలాది కరోనా కేసులు నమోదవు తుండగా, ఆయా పట్టణాల్లో కేసులున్న నివాసప్రాంతంలో మాత్రమే కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు.

* దేశంలో కొవిడ్‌ మహా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది.

★ గత 24 గంటల్లో అత్యధికంగా 38,902 కేసులు రాగా.. 543 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

★ దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 10,77,618కి చేరింది.

★ వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 3,73,379 మంది చికిత్స పొందుతుండగా.. 6,77,423 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది.

★ కరోనాతో ఇప్పటి వరకు 26,816 మంది ప్రాణాలు కోల్పోయారు.