Movies

మౌనం…సహనం…ప్రాధాన్యం…

మౌనం…సహనం…ప్రాధాన్యం…

‘‘వృత్తి, విమర్శలు, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యం సాధించడం అంత సులువేం కాదు. చాలా భరించాలి. నోరును అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. అనవసరమైన ప్రశ్నలకు, పుకార్లకు సమాధానం చెప్పకుండా జాగ్రత్త పడాలి. కొన్నింటికి మౌనంగా ఉండటమే మంచిది. మేం కూడా సాధారణ మనుషులమే. ఎల్లప్పుడూ ప్రశాంతతతో ఉండటం సాధ్యం కాదు. కానీ ఈ విషయాన్ని మేం చెప్పలేం. అందుకే నేను చాలా వరకు మౌనంగా, సహనంతో ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తా. వివాదాలకు దూరంగా ఉండాలంటే ఇదే మంచి మార్గం’’అని జాక్వెలిన్ చెప్పుకొచ్చింది. ప్రశాంతత కోసం రోజూ వ్యాయామం, ధ్యానం చేస్తానని జాక్వెలిన్‌ వెల్లడించింది.