Business

తగ్గనున్న వాహన ధరలు-వాణిజ్యం

తగ్గనున్న వాహన ధరలు-వాణిజ్యం

* వాహనదారులకు శుభవార్త. కొత్తగా కారు లేదా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి ఊరట లభించనుంది. నేటి (ఆగస్ట్ 1) నుంచి దేశంలో కొత్త ఇన్సూరెన్స్ నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వాహన ధరలు దిగి రానున్నాయి.

* టెక్‌ దిగ్గజం యాపిల్‌ తన చైనీస్‌ యాప్‌ స్టోర్స్‌ నుంచి శనివారం 29,800 యాప్స్‌ను తొలగించింది. వీటిలో 26,000కు పైగా గేమ్‌ యాప్స్‌ ఉన్నాయని పరిశోధన సంస్‌థ క్విమై వెల్లడించింది. ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్‌ నెంబర్‌ను ఈ ఏడాది జూన్‌లోగా సమర్పించాలని అంతకుముందు గేమ్‌ పబ్లిషర్లకు యాపిల్‌ డెడ్‌లైన్‌ విధించింది. చైనా యాండ్రాయిడ్‌ యాప్‌ స్టోర్స్‌ ఎప్పటినుంచో ఈ మార్గదర్శకాలు అమలవుతున్నాయి. అయితే ఈ ఏడాది నుంచి వాటిని కఠినంగా అమలు చేయాలని యాపిల్‌ ఎందుకు నిర్ణయించిందో స్పష్టం కాలేదు.

* భారతీయ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ వన్‌ప్లస్ టాప్ లో నిలిచింది. జూన్ త్రైమాసికంలో 29.3 శాతం మార్కెట్ వాటాతో ఇండియన్ మార్కెట్ లీడర్‌గా నిలిచిందని తాజా నివేదిక తెలిపింది.

* సంగీత ప్రియులకు సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ శనివారం శుభవార్త ప్రకటించింది. ఫేస్‌బుక్‌ తన అధికారిక సెక్షన్‌లో సంగీతానికి సంబంధించిన వీడియోలను(మ్యూజిక్‌ వీడియోలు)అందించనుంది. ఇప్పటికే సంగీత సంస్థలతో ఫేస్‌బుక్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే గత సంవత్సరం నుండే దేశీయ సంగీత కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, సంగీత ప్రియులను ఆకర్శించడమే తమ అభిమతమని ఫేస్‌బుక్‌ ఇండియా డైరెక్టర్‌ మానీష్‌ చోప్రా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సంగీతాన్ని ప్రపంచానికి చేరవేసే అన్ని సాంకేతిక వనరులను ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు.

* ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. అయితే కరోనా ఉదృతిలోను దేశీయ రియల్‌ ఎస్టెట్‌ అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని జీఆర్‌ఈటీఐ(గ్లోబల్‌ రియల్‌ ఎస్టేట్‌ పారదర్శకత సూచిక (జీఆర్‌టీఐ) నివేదికను విడుదల చేసింది. దేశంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల పెట్టుబడిదారులలో పారదర్శకత నెలకొందని నివేదిక తెలిపింది.