DailyDose

రానా తమ్ముడి కారు ప్రమాదంపై కుటుంబసభ్యుల ఆగ్రహం-తాజావార్తలు

రానా తమ్ముడి కారు ప్రమాదంపై కుటుంబసభ్యుల ఆగ్రహం-తాజావార్తలు

* జిల్లా పరిషత్ ,మండల పరిషత్ లకు ప్రత్యేక అధికారుల పదవీకాలం పొడిగింపు..ఆరు నెలలపాటు పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..గత నెల 4 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన పొడిగింపు.

* గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్‌ 20 నుంచి రాతపరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షల నిర్వహణపై బుధవారం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ విజయవాడలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందులో మొత్తం 19 రకాల పోస్టులకు 14 వేర్వేరు రాతపరీక్షలను వారం పాటు పెట్టాలని నిర్ణయించారు. 14,062 గ్రామ, 2,146 వార్డు సచివాలయాల పోస్టులు కలిపి మొత్తం 16,208 పోస్టులకు ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 11,06,614 మంది దరఖాస్తు చేసుకోగా 10,63,168 మందిని పరీక్షలకు అర్హులుగా అధికారులు నిర్ధారించారు.

* ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు తనయుడు అభిరామ్‌ కారు ప్రమాదానికి గురైందంటూ వస్తున్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. ఆ కారు ప్ర‌మాదానికీ, ద‌గ్గుబాటి అభిరామ్‌కూ ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అసలది ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన కారే కాదని స్పష్టం చేశారు. రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని మ‌ణికొండ‌లో ద‌గ్గుబాటి అభిరామ్ కారు ప్ర‌మాదానికి గురైంద‌నీ, ఎదురుగా వ‌స్తున్న కారును ఆయ‌న కారు ఢీకొట్టింద‌నీ మీడియాలో, ఆన్‌లైన్‌లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అది కేవ‌లం వ‌దంతి మాత్ర‌మేననీ, మీడియాలో చూపిస్తున్న కారు అస‌లు ద‌గ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించినది కాద‌నీ వారు స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో ద‌య‌చేసి వ‌దంతుల‌ను నమ్మొద్ద‌ని, వాటిని ప్ర‌చారం చేయొద్ద‌ని కోరారు.

* భారత్‌కు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? అని అడిగితే టక్కున వచ్చే సమాధానం 1947 ఆగస్టు 15. కానీ, దేశంలోని ఓ గ్రామం మాత్రం అంతకు అయిదేళ్ల ముందే స్వాతంత్ర్యం పొందింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. బ్రిటిష్ వారిపై దేశమంతా పోరాటం సాగుతున్నా.. అంతకు మించిన తెగువ ప్రదర్శించి తెల్లవారి నుంచి స్వాతంత్ర్యం పొందింది కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా ఈసూరు గ్రామం.

* చైనా ఆన్‌లైన్‌ గేమింగ్‌ ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను సిటీ కమిషనర్‌ అంజనీ కూమార్‌ మీడియాకు వెల్లడించారు. విదేశీయుడు సహా మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 16.9 బిలియన్‌ డాలర్ల మేర ఆన్‌లైన్‌ గేమింగ్‌ జరుగుతోందని సీపీ చెప్పారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ కోసం టెలిగ్రామ్‌, వాట్సాప్‌ గ్రూప్‌ ఉందని, రిఫెరెన్స్‌ల ద్వారా గ్రూపుల్లో చేర్చుకుంటారని తెలిపారు. ప్రతి రోజు వెబ్‌సైట్‌, గ్రూప్‌లు మారుస్తూనే ఉంటారని చెప్పారు. గేమింగ్‌కు సంబందించి మూడు కంపెనీల డైరెక్టర్లు భారత్‌, చైనాలో ఉన్నట్లు గుర్తించామని సీపీ పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌లో ఇప్పటి వరకు రూ.1,100కోట్లు వినియోగించినట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.30 కోట్ల మేర బ్యాంక్‌ ఖాతాలు సీజ్‌ చేశామని వెల్లడించారు.

* తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా పరీక్షలు, చికిత్సలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈనెల 3 నుంచి సుమారు 42వేల మంది సెకండరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు నిర్వహించామని నివేదికలో తెలిపింది.

* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం టంగుటూరు మండలంలోని మైనింగ్‌ భూములను కేటాయించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మైనింగ్‌ భూమిని ఇతర అవసరాలకు కేటాయించవద్దని ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ మేరకు ఇళ్లస్థలాలకు మైనింగ్‌ భూమి కేటాయింపుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

* కరోనా వ్యాప్తి నియంత్రణలో వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసిందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…‘‘మీరు చెప్పిన కరోనాతో సహజీవనం ఇదేనా?. వైద్యులు, సిబ్బంది ముందస్తు నియామకాల్లో విఫలమయ్యారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం మంచిది కాదు. కేంద్రం ఇచ్చిన రూ.8వేల కోట్లు ఏం చేశారు. కరోనా నిధుల వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

* అమరావతి మెట్రోపాలిటన్‌ ప్రాంత అభివృద్ధి సంస్థపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అమరావతిలో ప్రస్తుత నిర్మాణాల పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవనాలు పూర్తి చేసే కార్యాచరణపై చర్చించారు. నిర్మాణలు పూర్తి చేయడం కోసం నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఆర్థికశాఖ అధికారులతో చర్చించి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. హ్యాపీ నెస్ట్‌ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

* ఎస్తర్‌ అనిల్‌, ఈశ్వరీరావు, చైతన్య కృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జోహార్‌’. తేజ మర్ని దర్శకుడు. ఈ వేసవిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీ బాట పట్టింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో దీన్ని విడుదల చేయనున్నారు.

* ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమకూ ఆధార్‌ తరహాలో ప్రత్యేక సంఖ్య కేటాయించాలని నిర్ణయించింది. ‘పరిశ్రమ ఆధార్’‌ పేరుతో ప్రత్యేక సంఖ్య జారీచేయనుంది. దీనికోసం రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల సర్వే నిమిత్తం ఉత్తర్వులు జారీచేసింది. పరిశ్రమల్లోని కార్మికులు, విద్యుత్‌, భూమి, నీటి లభ్యత గురించి తెలుసుకోవాలని నిర్ణయించింది. ఎగుమతి-దిగుమతి, ముడిసరకు లభ్యత, మార్కెటింగ్‌ సహా మొత్తం 9 అంశాల్లో వివరాలను పరిశ్రమల శాఖ సేకరించనుంది.

* అమీన్‌పూర్‌లోని ఓ ప్రైవేటు అనాథ శరణాలయంలో బాలిక అత్యచారానికి గురై మృతి చెందిన ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ఈ కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కమిటీలో బాలల హక్కుల కమిషన్‌, బాలల సంరక్షణ కమిటీ సభ్యులు, ఏసీపీ ప్రతాప్‌ సభ్యులుగా ఉన్నారు. కమిటీలో మహిళా కమిషన్‌ కార్యదర్శి జి. సునంద కూడా ఉన్నారు. ఈ కమిటీ సమావేశమై.. ఆ తర్వాత బాలిక కుటుంబసభ్యులు, బంధువులను కలువనుంది.

* ప్రముఖ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ భారత్‌లో పునరాగమనానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో ఉన్న తన యూజర్‌ బేస్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓ వైపు ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తూనే.. మరోవైపు భారత్‌లో తన వ్యాపారాన్ని విక్రయించే అంశంపై చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా దేశీయ అతిపెద్ద కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌ చర్చలు జరిపినట్లు ‘టెక్ క్రంచ్‌’ వెబ్‌సైట్‌ పేర్కొంది.

* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం టంగుటూరు మండలంలోని మైనింగ్‌ భూములను కేటాయించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మైనింగ్‌ భూమిని ఇతర అవసరాలకు కేటాయించవద్దని ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ మేరకు ఇళ్లస్థలాలకు మైనింగ్‌ భూమి కేటాయింపుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

* గత వారం పది రోజులుగా బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం ఈ కేసుకు సంబంధించిన తుది నివేదికను బిహార్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ సందర్భంగా సుశాంత్‌ ఆత్మహత్యకు సంబంధించి తాము కేవలం ఎఫ్ఐఆర్‌ మాత్రమే నమోదు చేశామని, విచారణ మొత్తం సీబీఐకి అప్పగించినట్లు వెల్లడించింది.

* ఆంధ్రప్రదేశ్‌లో గత 24గంటల్లో (9అం-9అం)కొత్తగా 9,996 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 55,692 నమూనాలు పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 90,840 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,70,924 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒక్క రోజులో 9,499 మంది కోలుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 27,05,459 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది.

* జడ్జి కె.రామకృష్ణ వేసిన అనుబంధ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకు ఆయన ఇచ్చిన పెన్‌డ్రైవ్‌లోని సంభాషణను నిజనిర్ధారణ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రన్‌కు బాధ్యతలు అప్పగించింది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని, అవసరమైతే సీబీఐ, సెంట్రల్‌ విజిలెన్స్‌ అధికారులు సహకరించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.

* న్యాయస్థానాల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టుకు, రాష్ట్రపతి, గవర్నర్‌కు న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఇటీవల న్యాయస్థానాలను, న్యాయమూర్తులను ఉద్దేశించి రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ఆయన్ను.. ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. న్యాయవ్యవస్థపై పెద్ద కుట్ర జరుగుతోందన్న లక్ష్మీనారాయణ.. ఇటీవల కుట్రపూరితంగా కోర్టులను విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.

* పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ కెరీర్‌ తనవల్లే ముగిసిపోయిందని గతేడాది సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్‌ పేసర్‌ మహ్మద్‌ ఇర్ఫాన్‌ తాజాగా దానికి వివరణ ఇచ్చాడు. ఇటీవల అతడు సవేరా పాషా అనే క్రికెట్‌ వ్యాఖ్యాతతో యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ తన గురించి, టీమ్‌ఇండియా క్రికెటర్ల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2012లో భారత పర్యటనకు వచ్చిన ఈ పాక్‌ పేసర్‌.. ఎత్తు ఎక్కువగా ఉండడంతో తన బౌన్సర్లతో అప్పుడు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో లాభాలు ఆర్జించినప్పటికీ చివరికి స్వల్ప నష్టాలను మూటగట్టుకున్నాయి. ఉదయం 100కు పైగా పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఆద్యంతం ఒడుదొడుకులకు లోనైంది. చివరికి 59.14 పాయింట్ల నష్టంతో 38,310.49 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 7.90 పాయింట్లు నష్టపోయి 11,300.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.84గా ఉంది.