DailyDose

బిగ్‌బాస్ పార్టిసిపెంట్‌కు కరోనా-తాజావార్తలు

బిగ్‌బాస్ పార్టిసిపెంట్‌కు కరోనా-తాజావార్తలు

* ఈ నెలాఖరు న బిగ్ బాస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇందుకోసం ఇప్పటికే నాలుగవ సీజన్ ప్రోమో ను కూడా విడుదల చేసేసారు. ఈ షో కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న సంగతి కూడా విదితమే.. అసలే.. కరోనా విస్తరిస్తున్న నేపధ్యం లో ఈ షో విషయం లో నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు..ఈ షో లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ అందరిని ఇప్పటికే కరోనా టెస్ట్ లు చేశారు.. నెగటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచారు.. వీరు బయటకు వెళ్లేందుకు వీలు లేదు.. షూటింగ్ ప్రారంభం అయ్యే ముందు మరో సారి కరోనా టెస్ట్ చేస్తారు. అప్పుడు కూడా కరోనా నెగటివ్ వస్తేనే వీరిని హౌస్ కు తీసుకెళ్లారు. అయితే.. తాజాగా రెండవసారి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందట..ఇప్పటికే ఈ సారి షో లో పాల్గొంటున్న వారి పేర్లు బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే.. జబర్దస్త్‌ కెవ్వు కార్తీక్‌, సింగర్ నోయల్‌ సేన్‌, యాంకర్లు లాస్య, అరియానా, నటులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడ, నందు యూట్యూబర్లు అలేఖ్య హారిక, మహబూబ్ దిల్‌ సే, గంగవ్వ, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌ ఉన్నారని తెలుస్తోంది. కాగా.. నందు ఇప్పటికే తాను బిగ్ బాస్ లో ఉన్నట్లు ప్రకటించారు. కాగా.. వీరిలో ఓ సింగర్ కు కరోనా వచ్చినట్లు తెలుస్తోంది.

* పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తేదీలు దాదాపు ఖరారయ్యాయి. వచ్చే నెలలో ఈ సమావేశాలు నిర్వహించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 1 వరకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్‌ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సూచించినట్టు సమాచారం. శని, ఆదివారాల్లో కూడా ఉభయసభలూ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఉదయం నాలుగు గంటల పాటు ఒక సభ, సాయంత్రం నాలుగు గంటల పాటు మరోసభ జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సమాచారం

* తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం ముని కూడలికి చెందిన ఇండుగిమిల్లి వరప్రసాద్‌ శిరోముండనం కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ కేసు వ్యవహారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దాకా కూడా చేరింది. ఈ కేసు విషయమై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫస్ట్ టైమ్ స్పందించారు. మంగళవారం నాడు బెంగళూరుకు బయల్దేరే ముందు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా దళితులపై దాడులను, అనైతిక చర్యలపై నిశితంగా చర్చించారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని సీఎం తేల్చిచెప్పారు. బాధ్యులు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసు అధికారులపైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపామన్న విషయాన్ని జగన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దళితులమీద దాడులు సహా, ఇతరత్రా ఘటనలు జరిగినప్పుడు గతంలో పట్టించుకునేవారు కాదన్నారు. కానీ గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది జగన్ చెప్పుకొచ్చారు.

* టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. వచ్చే శుక్రవారం ఏపీ హైకోర్టు తీర్పును వెల్లడించనుంది. ఈఎస్‌ఐలో వైద్య పరికరాలు, మందుల కొనుగోలు కుంభకోణంలో డీలర్ల నుంచి మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి డబ్బులు చేరాయనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈఎస్‌ఐలో వైద్య పరికరాలు, మందుల కొనుగోలు కుంభకోణంలో డీలర్ల నుంచి మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి డబ్బులు చేరినట్లు తమ దర్యాప్తులో ఎక్కడా బయట పడలేదని ఏసీబీ ఇప్పటికే వెల్లడించింది. ఆర్థికపరమైన లావాదేవీలపై ఆధారాలు లభించలేదని ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ పేర్కొన్నారు.

* కరోనా వ్యాప్తి దృష్ట్యా సెప్టెంబర్‌ 1 నుంచి నిర్వహించతలపెట్టిన జేఈఈ, నీట్‌ ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని ఒడిశా డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌కు లేఖ రాశారు. దేశంలో కారోనా ఉద్ధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ అంత శ్రేయస్కరం కాదని లేఖలో పేర్కొన్నారు.

* బయోమెట్రిక్ హాజరు ద్వారా నే వేతనాలు. ఏపీ సర్కార్ ఉత్తర్వులుAP Secretariat Employees: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు సెప్టెంబర్ 1 నుంచి తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.బయోమెట్రిక్ హాజరు ద్వారానే వేతనాలు చెల్లిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇక బయోమెట్రిక్ హాజరుతో వేతనాల చెల్లింపును లింక్ చేయాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను సర్కార్ ఆదేశించింది.బయోమెట్రిక్ హాజరు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.కాగా సచివాలయ ఉద్యోగులకు సంబంధించి బయోమెట్రిక్ హాజరుకు ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించిన విషయం తెలిసిందే.

* ఏపీ ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారు రామచంద్రమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లంకు సమర్పించారు. వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేసినట్లు రామచంద్రమూర్తి వెల్లడించారు.

* పేదవాడైతేనేం ఆయనకు పెద్ద మనసు ఉంది. క్యాన్సర్‌ రోగం నుంచి భార్యను కాపాడుకోవాలన్న తపన వృద్ధాప్యాన్ని కూడా మరిచిపోయేలా చేసింది. లాక్‌డౌన్‌ వల్ల బస్సులు లేకపోవడంతో సైకిల్‌పై భార్యను ఎక్కించుకుని 120 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయినా ఫలితం లేకుండాపోయింది. భార్య ప్రాణాలు హరించింది. భర్తను కన్నీటి కడలిలోకి నెట్టేసింది.  తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని మనల్‌మేడుకు చెందిన అరివళగన్‌ (60) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మొదటి భార్య మరణించడంతో మంజుల (44)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు విష్ణు (12) ఉన్నాడు. మంజుల ఎడమచెంపకు సమీపంలో క్యాన్సర్‌ వ్యాధి సోకినట్లు తొమ్మిది నెలల క్రితం గుర్తించారు.