DailyDose

సామూహిక రేప్ కేసులో సరికొత్త ట్విస్ట్-నేరవార్తలు

సామూహిక రేప్ కేసులో సరికొత్త ట్విస్ట్-నేరవార్తలు

* తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనూ చర్చనీయాంశంగా మారిన 139 మంది రేప్ కేసులో బాధిత యువతి యు-టర్న్ తీసుకుంది. తనపై 139 మంది అత్యాచారం చేశారన్నది అంతా అబద్ధమనీ, తనను డాలర్ బోయ్ అనే వ్యక్తి బెదిరించి ఇలా అబద్దం చెప్పించాడని వెల్లడించింది. సెలబ్రిటీలను ఇలా బయటకు లాగి వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజాలని ఇలా తనతో చెప్పించాడనీ, చెప్పకపోతే చంపేస్తానని బెదిరించాడని చెప్పుకొచ్చింది.తనపై ఒక్కరు కూడా అత్యాచారం చేయలేదని లిఖితపూర్వకంగా తెలిపింది. కాగా గత కొన్నిరోజులుగా నటుడు కృష్ణుడు, యాంకర్ ప్రదీప్‌లకు ఈ యువతి చేసిన వ్యాఖ్యలతో మనశ్శాంతి లేకుండా పోయింది. ఐతే ఆమె ఎవరో తమకు తెలియదని లబోదిబోమని చెప్పారు కూడా. మొత్తమ్మీద ఇపుడు ఈ యువతి ఇలా ట్విస్ట్ ఇవ్వడంతో కేసుపైన పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. కాగా 11 ఏళ్లుగా తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ సంచలన ఆరోపణలు చేసిన బాధిత యువతి ఓ ప్రైవేటు టెలివిజన్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే.. హైదారాబాదులో గెస్ట్ హౌసులకు డిఫరెంట్ అమ్మాయిలను తీసుకువచ్చేవారు. ఆ తర్వాత వారందరికీ ఆల్కహాల్ తాగించి స్పృహ కోల్పోగానే అత్యాచారం చేసేవారు.మరుసటి రోజు ఆ దృశ్యాలు తాలూకు వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేసేవారు. బట్టల్లేకుండా ఒక అమ్మాయి ఫోటోలను ఎక్కడైనా షేర్ చేస్తే, అవి బయటకు వస్తే ఇక చచ్చిపోవడం తప్పించి వేరే మార్గం ఏముంటుంది? నన్ను అనుభవించేవారు. నా ఎకౌంటులో డబ్బులు వేయించుకుని వాళ్లే తీసుకునేవారు.నన్ను తమ స్నేహితురాలు అని చెప్పి తీసుకెళ్లి వారికి అప్పజెప్పేవారు. 2012 నుంచి నరకం చూశాను. పెళ్లయిన తర్వాత నాపై మా బావ అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాద్ వస్తే ఇక్కడ ఇంతమంది నాపై అత్యాచారం చేశారు. నా కుటుంబ సభ్యులకు చెపితే, నా బలహీనతలు తెలుసుకుని, నా తమ్ముడిని కొట్టారు. దాంతో భయంవేసి సైలెంట్ అయిపోయా.నన్ను ఎక్కడికి తీసుకెళ్లినా ఆల్కాహాలు తాగించి దుస్తులు తీసేసి నన్ను మూలన పడేసేవారు. ఇంకా ఏవేవో మత్తు పదార్థాలు నా ముక్కు దగ్గర పెట్టి వాసన చూపించేవారు, దానికి కళ్లు తిరిగి పడిపోయేదాన్ని. ఆ తర్వాత నాపై అత్యాచారం చేసేవారు. 2014లో నన్ను ఓ గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అప్పుడు నేను ఓ వ్యక్తిని చూశాను. అతడు పాపులర్ యాంకర్ అని చెప్పారు. నాపై అతడు అత్యాచారం చేస్తున్నాడు. కళ్లు తెరిచి చూడగానే ఎదురుగా వున్నాడు. ప్లీజ్.. నన్ను వదిలేయండి అని అతడి కాళ్లావేళ్లా పడ్డాను. అతడు ఏమాత్రం కనికరం చూపించలేదు. నాపై భౌతిక దాడి చేసి ఆల్కహాలు తాగించి అత్యాచారం చేశాడు. చాలామంది మేం మంచిగా చూసుకుంటామని చెప్పి నన్ను వాడుకున్నారు. వేరే అమ్మాయిల నగ్న ఫోటోలను నాకు పంపించి అలా కావాలని అడిగేవారు” అంటూ చెప్పింది బాధితురాలు. మిర్యాలగూడకు చెందిన బాధిత యువతి పంజాగుట్ట పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇదంతా అబద్ధమని షాక్ ఇచ్చింది.

* అనంతపురం హౌసింగ్ బోర్డులోని మై కేర్ హాస్పిటల్ దౌర్జన్యం..పేషెంట్ ఫిర్యాదుతో కవరేజ్ కి వెళ్లిన సీనియర్ రిపోర్టర్ సాయి ప్రసాద్ పై 10 మందికి పైగా రౌడీలను పిలిపించి దాడి..దాడి విషయం టూ టౌన్ సీఐ జాకిర్ హుస్సేన్ గారికి చెప్పగా, అది మా పరిధి కాదు.. వన్ టౌన్ పోలీస్ లకు ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చిన సీఐ..మీడియా అయితే ఏం పీక్కుంటావంటూ, అసభ్య పదజాలంతో దూషిస్తూ.. దాడి చేసి సెల్ ఫోన్ లాక్కున్న రౌడీలు..కంప్లెయింట్ చేయడానికి వెళ్తుండగా మోటార్ సైకిల్ ధ్వంసం చేయడానికి ప్రయత్నం..మేము కూడా మీడియానే.. అనంత ఛానల్ మాదే అంటూ దౌర్జన్యం.డిఎస్పీ రాఘవరెడ్డి కూడా మాకు తెలుసు.. ఎవరికి కంప్లెయింట్ ఇచ్చుకుంటావో ఇచ్చుకో పోరా..మమ్మల్ని ఏం చేయలేవు అంటూ దాడి.

* గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపం వద్ద ప్రయాణిస్తున్న కారులో నుండి ఒక్కసారిగా మంట లు.తృటిలో తప్పించుకున్న నలుగురు ప్రయాణికులు.మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.

* పలమనేరు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రం నుండి నెల్లూరుకు తరలిస్తున్న భారీ మద్యంను గంగవరం పోలీసులు S.I సుధాకర్ రెడ్డి,వారి బృందంతో వాహనాలను తనిఖీలు నిర్వహిస్తుండగా లారీలో కర్ణాటక రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ వస్తున్న మద్యంను దాదాపు 15.5లక్షల మద్యంతో పాటు లారీను స్వాధీనం చేసుకున్నారు.

* కడప జిల్లా మైలవరంలో వీఆర్‌ఏగా పనిచేస్తున్న జక్కా నాగమునయ్య (45) శనివారం సాయంత్రం తన ఇంటికి సమీపంలో బాలిక ఆడుకుంటుండగా మాయమాటలు చెప్పి ఓ గుడి ఆవరణలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.బాలిక కేకలు విన్న  స్థానికులు నాగమునయ్య ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.నిందితునిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. 

* ఆంధ్రప్రభ రిపోర్టర్ ఇంటి పైన వైసీపీ నేతలు దాడి.చిత్తూరు జిల్లా సోమల మండలం దళిత యువకుడు ఓం ప్రకాష్ మృతి పైన వార్త రాసిన ఆంధ్రప్రభ రిపోర్టర్ ఇంటి పైన వైసీపీ గుండాల దాడి.నివాసంలోని సామానులు రోడ్డుపై పడేసిన వైస్సార్ పార్టీ నేతలు.బయటకు రాకుండా కర్రలతో వున్న వైస్సార్ నేతలు.భయభ్రాంతులకు గురి ఆవుతున్న కుటుంబ సభ్యులు.

* లాయర్ ప్రశాంతి భూషణ్ కు ఒక్క రూపాయ జరిమానా విధించిన సుప్రీం కోర్టు…సెప్టెంబరు 15 వ తేదీ లోగా జరిమానా కట్టాలి. జరిమానా కట్టకపోతే 3 నెలలు జైలు శిక్ష, మూడేళ్ల పాటు లాయర్ గా ప్రాక్టీసు చేయడానికి వీలు లేదంటూ సుప్రీం ధర్మాసనం తీర్పు.

* 2017లో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు ఇచ్చిన తీర్పుపై విజయ్ మాల్యా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్​ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.న్యాయస్థానం ఉత్తర్వులు ఉల్లంఘించి వారసులకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేయడాన్ని కోర్టు ధిక్కరణ కిందే తేల్చింది.ఇరువైపులా వాదనలు విన్న అనంతరం.. తీర్పును సమీక్షించేందుకు తమకు ఎలాంటి అవసరం కనపడటం లేదని జస్టిస్​ యూయూ లలిత్​, జస్టిస్​ అశోక్​ భూషణ్​ ధర్మాసనం పేర్కొంది.కోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ.. తన వారసులకు 40మిలియన్​ డాలర్లను బదిలీ చేసినట్టు 2017లో సుప్రీంకోర్టుకు వెళ్లాయి ఎస్​బీఐ నేతృత్వంలోని బ్యాంకులు.రూ.9వేల రుణాల ఎగవేత కేసులో నిందితుడు మాల్యా.. ప్రస్తుతం లండన్​లో ఉంటున్నారు.