DailyDose

కేసీఆర్ ఇంటి ఎదుట ఆటోవాలా ఆత్మహత్యాయత్నం-నేరవార్తలు

కేసీఆర్ ఇంటి ఎదుట ఆటోవాలా ఆత్మహత్యాయత్నం-నేరవార్తలు

* ప్రగతిభవన్ ఎదుట ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.హైదరాబాద్ నగరంలోని ప్రగతిభవన్ ఎదుట ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది.డబుల్ బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వాలంటూ శుక్రవారం ఉదయం సీఎం క్యాంపు ఆఫీస్ ఎదుట ఆటో డ్రైవర్ చందర్ కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి యత్నించాడు.వెంటనే గుర్తించిన పోలీసులు చందర్‌ను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.ఇక 2010లోనూ అసెంబ్లీ ఎదుట చందర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.అప్పుడు కూడా పోలీసులు అడ్డుకుని కౌన్సిలింగ్  ఇచ్చారు.ఆటో డ్రైవర్ చందర్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు.

* విశాఖ జిల్లా చింతపల్లి మండలం చింతపల్లి గ్రామం లో చిలకలమామిడి వీధి శివారులో శివాలయం విగ్రహాలను ధ్వంసం చేసిన హిందూ వ్యతిరేకులు.

* మలుపులు తిరుగుతున్న వెండి రథం సింహాలు మాయం ఘటన..రథాన్ని పరిశీలించిన క్రైమ్ బ్రాంచ్ డిసిపి కోటేశ్వరరావు..అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న పోలీసులు..వెండి, బంగారం ఇత్తడి పొలిషింగ్ కి నెలకి 47వేలు రూపాయలు చొప్పున కాంట్రాక్ట్ తీసుకున్న శ్రీ శర్వాని ఇండస్ట్రీ…శ్రీ శర్వాని ఇండస్ట్రీ నుండి సబ్ కాంటాక్ట్ తీసుకున్న వెంకట్ అనే వ్యక్తి..ఈ ఏడాది మార్చి 2020 ఉగాదికి రథాన్ని సిద్ధం చేసేందుకు 15 రోజుల ముందు రథాన్ని చూసిన పాలిష్ చేసే వ్యక్తి వెంకట్…రథానికి నాలుగు సింహాలు ఉన్నాయని అప్రైజెర్ షమీ కి చెప్పిన వెంకట్…ఈ విషయాన్నే పోలీసుల ముందు చెప్పిన షమీ..గత రెండు రోజులుగా వెండి సింహాలు మాయం మీ హయాం లో అంటే మీ హయం లో జరిగింది అంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధం…ఈ ఘటన లో కీలకం కానున్న సబ్ కాంట్రక్టర్ వెంకట్ స్టేట్మెంట్…అందుబాటులో లేని సబ్ కాంట్రక్టర్ వెంకట్..ఫోన్ స్విచ్ ఆఫ్

* విజయవాడలో అక్రమ మద్యం రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పడమట ఎక్సైజ్ పోలీసులు…ఆర్టీసీ పార్సెల్ సర్వీస్ బస్సులో తరలిస్తున్న 11 లక్షల విలువ చేసే 2,200 మద్యం బాటిళ్లు స్వాధీనం….ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు,మరో ముగ్గురిని అరెస్ట్ చెసిన పడమట ఎక్సైజ్ పోలీసులు.స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు

* మేడ్చల్‌ జిల్లా నేరేడ్‌మెట్‌లో 12 ఏళ్ల బాలిక అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది.నిన్న సాయంత్రం అదృశ్యమైన బాలిక… నాలాలో విగతజీవిగా బయటపడింది.కాకతీయనగర్​కు చెందిన ఐదో తరగతి చదువుతున్న 12 ఏళ్ల సుమేధ కపురియా.. నిన్న సాయంత్రం అదృశ్యమైంది.సైకిల్‌పై బయటికి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించగా సైకిల్​పై వెళ్తున్నట్లు గుర్తించారు.జీహెచ్​ఎంసీ బృందాల గాలింపు చర్యల్లో… నాలాలో సైకిల్ దొరికింది.భారీ వర్షానికి దీన్ దయాల్ నగర్ నాలా పొంగిపొర్లడంతో బాలిక ప్రమాదవశాత్తు పడిపోవచ్చని అనుమానంతో నాలాలో సెర్చ్‌ ఆపరేషన్స్‌ చేపట్టారు.రెస్క్యూ బృందాల గాలింపులో బండ చెరువు వద్ద నాలాలో బాలిక మృతదేహం బయటపడింది.