Movies

ఏడాది చివర వరకు ఖాళీ లేదు

Tamannah Very Busy Till The End Of 2021 -Telugu Movie News

ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టారు తమన్నా. షూటింగ్‌తో ఎప్పుడు బిజీ అవుదామా అని ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చివరి వరకూ ఆమె డైరీ కాల్షీట్లతో నిండిపోయింది. ఇక సెట్‌లో అడుగుపెట్టడమే తరువాయి. గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న ‘సీటీమార్‌’ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. తాజా షెడ్యూల్‌ అక్టోబర్‌లో మొదలయ్యే అవకాశం ఉంది. ‘అంధాధున్‌’ రీమేక్‌గా మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న సినిమాలోనూ తమన్నా సందడి చేయనున్నారు. హిందీలో టబు పోషించిన పాత్రను తెలుగులో తమన్నా చేస్తున్నారు. దీనితోపాటు ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో సత్యదేవ్‌ సరసన నటించడానికీ ఆమె అంగీకరించారు. ఇవన్నీ త్వరలోనే సెట్స్‌ మీదకెళ్లనున్నాయి. సినిమాలే కాకుండా వెబ్‌ సిరీస్‌లపైనా తమన్నా దృష్టిపెట్టారు. తమిళంలో ‘ద నవంబర్స్‌ స్టోరీ’ పేరుతో తెరకెక్కుతున్న ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న ఆమె తెలుగులో ఆహా ఓటీటీ కోసం ఓ సిరీస్‌ చేయబోతున్నారు. ప్రవీణ్‌ సత్తారు ఈ వెబ్‌ సిరీస్‌కి దర్శకత్వం వహించనున్నారు. ‘‘ఆరు నెలలు షూటింగ్‌ లేకుండా ఇంట్లో కూర్చోవాలంటే చిరాకు వచ్చింది. ఇప్పుడు సెట్లో అడుగుపెట్టడం కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా’’ అని తమన్నా తెలిపారు.