Movies

వాణీకి లేదు ఖాళీ

వాణీకి లేదు ఖాళీ

గతేడాది ‘వార్‌’ చిత్రంతో ఘన విజయం అందుకున్నారు బాలీవుడ్‌ నటి వాణీకపూర్‌. కొన్ని రోజుల క్రితం విదేశాల్లో జరిగిన ‘బెల్‌ బాటమ్‌’ షూటింగ్‌ పూర్తిచేసుకున్నారు. ఇప్పుడు మరో సినిమా షూటింగ్‌ కోసం చండీగఢ్‌కు బయలుదేరారు వాణీకపూర్‌. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా అభిషేక్‌ కపూర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో వాణి కథానాయికగా నటిస్తున్నారు. ఆ చిత్రం షూటింగు మరికొన్ని రోజుల్లో ప్రారంభమవనుంది. దాంతో ఆమె చండీగఢ్‌కు బయలుదేరారు. అక్కడ వాణి కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉంటారు.