Health

రోజుకి 10లక్షల వ్యాక్సిన్లు వేయగలము

రోజుకి 10లక్షల వ్యాక్సిన్లు వేయగలము

కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక, రోజూ పది లక్షల మంది ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అపోలో గ్రూప్‌ హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ శోభనా కామినేని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 70 ఆస్పత్రులు, 400 క్లినిక్‌లు, 500 కార్పొరేట్‌ హెల్త్‌ సెంటర్లు, 4 వేల ఫార్మసీలతో పాటు తమ ఓమ్ని ఛానెల్‌ డిజిటల్‌ ఫ్లాట్‌ ఫాం ద్వారా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వేగంగా, సురక్షితంగా ప్రజలకు అందించడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాలన్నది తమ ప్రణాళికగా వివరించారు. వ్యాక్సిన్‌ నిల్వ, సరఫరాకు అవసరమైన శీతల వ్యవస్థలు, 10,000 మంది శిక్షణ పొందిన నిపుణుల సేవలను ఇందుకు వినియోగిస్తామన్నారు. భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ను తేవడంలో ముందంజలో ఉందన్నారు. నాణ్యతా ప్రమాణాలు కలిగిన వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు తాము అందిస్తామని ఆమె చెప్పారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌లో గురువారం గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ అధ్యక్షుడు కె.హరిప్రసాద్‌తో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోని తమ ఆస్పత్రులలో దాదాపు 3వేల పడకలను కొవిడ్‌ రోగులకు కేటాయించామన్నారు.