Movies

రాధే శ్యాంలో అలాంటివి లేవు

రాధే శ్యాంలో అలాంటివి లేవు

లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత ధైర్యంగా విదేశాలకు పయనమయింది ‘రాధేశ్యామ్‌’ చిత్రం బృందం. ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది. హీరోహీరోయిన్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. 13న పూజా పుట్టినరోజు సందర్భంగా ఓ భావోద్వేగ సన్నివేశాన్ని దర్శకుడు చిత్రీకరించారని ఆమె తెలిపారు. విదేశాల్లో షూటింగ్‌ పరిస్థితుల గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ ‘‘ఇటలీలో కరోనా ఏ విధంగా విజృంభించిందో అందరికీ తెలిసిందే! అక్కడ వైరస్‌ ఉదృతి తగ్గి, అనుమతులు లభించాక షూటింగ్‌కు వెళ్లాం. ఓ లొకేషన్‌లో చిన్న సెట్‌ వేసుకుని కొద్దిమందితో జాగ్రత్తలు పాటిస్తూ చిత్రీకరణ చేస్తున్నాం. షూటింగ్‌ మొదలైన మొదటి రెండు రోజులు చాలా భయంగా, ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత అలవాటైపోయింది. ప్రతిరోజూ సెట్‌లోకి అడుగుపెట్టే ముందు పరీక్షలు చేయించుకుంటున్నాం. కెమెరా ముందు మాత్రమే మాస్క్‌ తీస్తున్నాం. ఇక పాత్ర విషయానికొస్తే.. ఇందులో నాది పురాణాల్లో చూపించిన రాధ పాత్ర కాదు. అయితే ఇందులో పాత్రలకు చారిత్రాత్మకమైన ప్రేమికులే స్ఫూర్తి. నాలో ప్రతిభను బయటపెట్టడానికి మంచి అవకాశం దొరికింది. ఇందులో డ్యూయెల్‌ రోల్‌ చేయడం లేదు’’ అని అన్నారు.